పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/665

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చతుర్విధ వాద్యములు

స్థానము దేహమందలి హృదయస్థానమనియు, వీణ యందలి కంఠస్థానమే దేహమందలి కంఠస్థానమనియు చెప్పబడెను. గోళ్ళతో వాదనము చేయబడుటచే ఈ నాదము ‘నఖజ' మయ్యెను.

చిత్రము - 169

పటము - 3 శంఖము


చిత్రము - 170

పటము - 4 కొమ్ముబూర

సుషిరములు : రంధ్రములుగల వాద్యములు సుషిరములు. వీటియందు నాదము వాయుపూరణముచే కలుగును. వంశము, పావము, సావికము, మురళి, మధుకరీ, కాహళము, శృంగము, శంఖము మున్నగునవి సుషిర వాద్యభేదములు. వీటిలో వేణువు (వంశము) ముఖ్యమైనదిగా చెప్పబడినది. సుమారు 1 లేక 11/2 ఆంగుళముల వృత్తము కలిగి 18 అం. ల వెదురుగొట్టముతో వేణువును తయారుచేయుదురు. ఈ గొట్టము ఒక వైపు మాత్రమే మూయబడి యుండును. ఈ మూయబడిన స్థానమునకు చేరువగా వాయుపూరణమున కొక రంధ్ర ముండును. ఇక వాదనమునకు అనుకూలించునవి ఏడు రంధ్రములకు తక్కువకాక యుండును. ఈ ఏడు రంధ్రముల నుండియే గానమనుష్ఠింపబడును. నోటితో వాయుపూరణము చేయుచు, మూడు ఎడమచేతి వేళ్ళతోడను, నాలుగు కుడిచేతివ్రేళ్లతోడను, అర, పాతిక, ముప్పాతిక చొప్పునను, మరియు పూర్ణముగను రంధ్రములను మూయుచు, తెరచుచు వాదన మొనర్పబడును.

కాహళము : నేడు దీనిని సన్నాయి లేక నాగస్వర మని వ్యవహరించుచున్నారు. ఇదియును చాల ప్రశ స్తమైన వాద్యము. దేవాలయములందును, మానవకల్యాణ కార్యములందును విధిగా ఈ వాద్యమునకు స్థానము కలదు. వాయుపూరణముచే కలుగు ఈ నాదమునకు 'వాయుజ'మని పేరు.

చిత్రము - 171

పటము - 5 నాగస్వరము

అవనద్ధములు : ఇవి చర్మముచే మూయబడిన ముఖములు గల వాద్యములు, మర్దలము, హుడుక్క, ఘటము, ఢక్కా, రుంజా, డమరుకము, భాణము, దుందుభి, భేరీ మున్నగునవి అవనద్ధ వాద్యభేదములు . వీటిలో ఎక్కువ ప్రాముఖ్యము కలిగిన వాద్యము మర్దలము. నేడు దీనిని మృదంగమని వ్యవహరించుచున్నారు.

సుమారు 30 అంగుళముల పొడవు, 9 అంగుళముల కైవారముగల పనసకఱ్ఱను తొలిచి మృదంగమును తయారు చేయుదురు. కుడి, ఎడమలని పిలవబడు దీని

605