విజ్ఞానకోశము - 3
చంద్రుడు
చిత్రము - 163
చంద్రకళలు. భూమిపైనుండి చూచువారికి చంద్రకళలు మారుచున్నట్లు కనబడుట బయటి వలయములోని బొమ్మలు తెలియజేయును.
పటము - 1
చంద్రుడు
ముగా నుండుటనుబట్టియు, భూమిపై నున్నట్లు చంద్రగోళముపై ఏ ప్రాణియు ఉండుట కవకాశములేదని గూడ తెలియుచున్నది.
దూరదర్శని అవసరములేకుండ మన దృష్టి నాకర్షించి ఆహ్లాదమును గలిగించు చంద్రుని లక్షణములలో చంద్రకళకు గలుగు మార్పులు ముఖ్యమైనవి. పై బొమ్మలో చంద్రకళల మార్పు బోధపడును.
అమావాస్యనాడు చంద్రునియొక్క చీకటిభాగము భూమివైపునకు తిరిగియుండుటచే మనకు చంద్రుడు అగ పడడు. అందుచే సూర్యగ్రహణమునాడు తప్ప, అమావాస్యనాటి చంద్రుని చూచినవా రుండరనియే మనము అనుకొనవచ్చును. అంతేగాక, సూర్యకిరణము పడి ప్రకాశవంతముగా చేయబడిన చంద్రునిభాగ మెల్లప్పుడును సూర్యునివైపున కుండును. అందుచేత, చంద్రవంక యొక్క కొమ్ములు నల్లని ఆకాశముపై దిఙ్మండలమునకు దూరముగా సూచించుచుండును. ఆ రెండు కొమ్ములను కలుపు ఋజురేఖతో దిఙ్మండలముపై నేర్పడు కోణము భూమి, సూర్యచంద్రులయొక్క పరస్పర స్థానములపై నాధారపడి యుండును. చంద్రవంక కొమ్ములను బట్టి వాతావరణ పరిస్థితులను గూర్చిన వివిధ విశ్వాసములకు, సామెతలకు ఆధారములు అగపడవు.
భూమి భ్రమణము చేయు దిక్కున చంద్రుడు కూడ తన అక్షముపై భ్రమణము చేయు చుండును. ఆ వైపునకే భూమిచుట్టును పరిభ్రమణము కూడ చేయు చుండును. అందుచే, చంద్రునియొక్క ఒకే వైపు ఇంచుమించు ఎల్లప్పుడును భూమివైపునకు తిరిగియుండును. "దర్శనస్థితులు (librations)" అనువాని ఫలితములచే చంద్ర గోళములో సుమారు 41% భూమినుండి చూచువారికి ఎల్లప్పుడును కనబడుచుండును. సుమారు 41% భూమికి ఎప్పుడును కూడ కనబడదు. మిగిలిన 18% భూమిపై నుండి చూచుచున్నవాని స్థానమును బట్టియు, చూచు ప్రత్యేక కాలమునుబట్టియు కనబడవచ్చును; లేదా కనబడక పోవచ్చును. భూమికిని, సూర్యునకును సరిగా మధ్య చంద్రుడు వచ్చినపుడు సూర్యగ్రహణము కలుగును.
దూరదర్శని యంత్రము కల్పింపబడినప్పటి నుండియు దాని సహాయమున జరిగిన చంద్రోపరితల శాస్త్రపరీక్ష (Selenography) వలన భూమినుండి కనబడిన చంద్రగోళభాగము చాల జాగ్రత్తగా చిత్రింపబడినది. ఆ భాగము యొక్క కిరణ పరావర్తన శక్తినిబట్టియు, పరావర్తన చెందిన వెలుతురు ధర్మములనుబట్టియు చంద్రోపరితలము గోధుమ-పసుపురంగులు కలసిన శిలతో నేర్పడినట్లు మనకు తెలియుచున్నది. అచ్చట “సముద్రములు" లేక "ముస
581