పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/636

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రగుప్తుడు

సంగ్రహ ఆంధ్ర

గ్రీకు చరిత్రలలో ఎక్కడను అశోకునియొక్క గాని, ఇంకే ఇతర భారతీయునియొక్క గాని మతప్రచారము వారి రాజ్యములలో జరిగినట్లు వ్రాయబడియుండలేదు. "There is no evidence in any foreign literature that the King Asoka or any Indian ruler proclaimed his message abroad as is alleged in the inscription of the King Priyadarsi, by some modern scholars. It naturally arouses suspicion in our mind whether the name of any foreign ruler is recorded in the inscriptions." (Asoka's Eternal Religion, Hindustan Review, Patna-1952, p.p. 115-22. Cited by Dr. D. S. Triveda in his Indian Chronology p. 88). కనుక చరిత్రకారులు గుర్తించిన ఆయా యవన రాజులకాలమున అశోకుడు లేడనియు, అశోకుడు ఉదాహరించిన రాజులు భారతదేశపు సరిహద్దులోని యవనరాజులే గాని కొన్ని వేలమైళ్ల దూరముననున్న యవనరాజులు కారనియు నిర్ణయించుట ఉచితమగుట స్పష్టము. సిరియా 1750 మైళ్ళు, ఈజిప్టు 2400 మైళ్ళు, వీనికిని భారతసీమకును నడుమ అనేక దేశములు గలవు. కనుక ఇవి భారతసీమలోని వనుట పొసగదు. అంతేగాక గ్రీసు, ఈజిప్టు, సిరినీ మొదలగుచోట్ల ఆకాలమున బౌద్ధమత వాసన కూడ లేకుండుట పై నిర్ణయమును బలపరచుచున్నది.

ఇంకొక ముఖ్యమైనవిషయము గమనింపదగి యున్నది. మౌర్య చంద్రగుప్తుని సింహాసన మెక్కించిన కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రములో 65 వ ప్రకరణము "దాస కర్మకర కల్పః" అని కలదు. ఇందు మనుష్యులను బానిసలుగా విక్రయించు పద్ధతి, అందు జరుగు నేరములు, వానికి దండములు వివరింపబడినవి. మెగస్తనీస్ భారత దేశములో బానిపతనము అసలే లేదని చెప్పినాడు. "The same writer (Megasthenes) tells us further this remarkable fact about India, that all Indians are free, and not one of them is a slave. The Lakadaemonians and the Indians are here so far in agreement. The Lakadaemonians, however, hold the Helots as slaves, and these Helots do servile labour; but the Indians do not even use aliens as slaves, and much less a countryman of their own." (Mc Crindle; Ancient India as described by Magasthenes and Arrian Page 69, Fragment No. XXVI). దీనినిబట్టి మౌర్యచంద్రగుప్తుని కాలములో మెగస్తనీస్ లేడని కచ్చితముగా చెప్పవచ్చును. అంతేగాక మౌర్యచంద్రగుప్తుడు మెగస్తనీస్‌కు కొన్నిశతాబ్దములకు పూర్వము బానిసవర్తకము మనదేశములో జరుగుచుండిన కాలములో ఉండెనని చెప్పుటకు సందేహములేదు.

పై విషయములను బట్టి చారిత్రక పరిశోధకులు చేసిన అశోకుని కాలనిర్ణయము సరికాదనుట తేటతెల్లమగు చున్నది. కనుక వారి చంద్రగుప్త కాలనిర్ణయము గూడ సరికాజాలదు. చంద్రగుప్త మౌర్యుడు క్రీ.పూ. 1534 లో చాణక్యుని సాహాయ్యమున రాజ్యమునకు వచ్చెనే గాని చరిత్రకారులు చెప్పినట్లు అలెగ్జాండరు కాలమున (క్రీ. పూ. 327 ప్రాంతమున) కాదని నొక్కి వక్కాణించవచ్చును.

చంద్రగుప్తమౌర్యుని కాలము క్రీ. పూ. 1534 నుండి 1500 వఱకు, తరువాత బిందుసారుని రాజ్యకాలము క్రీ. పూ. 1472 వఱకు, అశోకుని కాలము క్రీ. పూ. 1472 నుండి 1436 వఱకు అని సిద్ధాంతముచేయుటకు పురాణములు తోడ్పడుచున్నవి. వాటిని కాదనుటకు చరిత్రకారులు చూపు ప్రమాణములు సరియైనవి కానేరవు.

భారతదేశ చరిత్రమంతయు చంద్రగుప్తుని కాలనిర్ణయము పైనే ఆధారపడియున్నది. ఇంకను ఈ విషయమున వివరములకు Kalhana's Rajatarangini edited by M. Troyer, Ancient History of India by Kuppaiah, Age of Sankara by T. S. Narayana Sastry, Dates in Ancient Indian History by A. Somayajulu, శ్రీ నడింపల్లి జగన్నాథరావుగారి ఆంధ్ర మహాసామ్రాజ్యము, శ్రీ కోట వెంకటాచలముగారి కలిశక విజ్ఞానము మూడు భాగములు, కలియుగ రాజవంశములు, అశోకుని కాలము నాటి యవనరాజులు ; Indian Chronology by Dr. D. S. Triveda, M. A., Ph. D., పురాణములలోని భవిష్య

578