చంద్రగుప్తుడు
సంగ్రహ ఆంధ్ర
శుంగవంశపు రాజులు 300 సంవత్సరములును, కణ్వవంశపు రాజులు 85 సంవత్సరములును, ఆంధ్ర రాజులు 506 సంవత్సరములును పరిపాలించిన తరువాత గుప్తవంశీయుడైన చంద్రగుప్తుడు క్రీ. పూ. 327 నాటికి మగధ సింహాసన మెక్కెను (క్రీ. పూ. 1218 (300 +85+506) = 327).
చంద్రగుప్తుని సభలో మెగస్తనీస్ అను గ్రీకు రాయబారి యుండెననియు, అతడు భారతదేశము తిరిగి తాను చూచిన విషయములు వ్రాసెననియు, అతని గ్రంథము ఉత్సన్నమైపోగా దానినుండి చరిత్రకారులు ఉదాహరించి యుండిన అంశములను కూర్చి 'ఇండికా' 'అను గ్రంథము తయారు చేయబడినదనియు చరిత్రజ్ఞు లెఱిగిన విషయమే గదా ! ఆ మెగస్తనీస్ మౌర్య చంద్రగుప్తుని సభలో ఉండియుండినచో మహామంత్రియైన చాణక్యుని (కౌటిల్యుని) గురించి ఒక్కమాటయైనను వ్రాసియుండడా ? పురాణము లన్నియు ఏకకంఠముగా చాణక్యుడు చంద్రగుప్తుని సింహాసన మెక్కించినట్లు చాటుచున్నవి. చీమలను గుఱించి కూడ మెగస్తనీసు వ్రాసిన మాటలు భద్రపరచినవారు అతడు చాణక్యుని గురించి వ్రాసియుండినచో దానిని ఏల ఉద్దరించియుండరు ? రాజులను గుఱించి వ్రాసిన వాక్యములు లభించుచున్నవి గదా ! ఆ ప్రసంగములో చాణక్యుని ఊసే లేదు. మెగస్తనీసు చాణక్యుని గురించి వ్రాయలేదు గనుక చాణక్యుడను నొక వ్యక్తి లేడనియు, అత డొక కల్పితపురుషుడై యుండు ననియు కొందఱు సిద్ధాంతీకరించిరి. నిజమునకు చాణక్యుడు సింహాసన మెక్కించిన చంద్రగుప్తుని కాలములో లేని మెగస్తనీసు, వేరొక (గుప్త) చంద్రగుప్తుని కాలములో ఉండిన మెగస్తనీసు చాణక్యుని ఉల్లేఖించకపోవుట సహజమే. అతడు చాణక్యుని పేర్కొనక చంద్రగుప్తుని పేర్కొనుటనుబట్టి అతడు పేర్కొనిన చంద్రగుప్తుడు చాణక్యుడు సింహాసన మెక్కించిన మౌర్య చంద్రగుప్తుడు కాడనుట సిద్ధాంత మగుచున్నది.
గ్రీకు చరిత్రకారులు వరుసగా భారతదేశము నేలిన ముగ్గురు రాజులను పేర్కొనిరి. 1. జాండ్రేమ్సు 2. సాండ్రో కొట్టోస్ 3. సాండ్రో సిప్టస్. వీరిలో సాండ్రో కొట్టోస్ మౌర్య చంద్రగుప్తుడని చరిత్రకారు లనుచున్నారు. ఈ పేర్లు కలిసినవి. కాని చంద్రగుప్తునకు ముందున్న రాజు నందరాజు. తరువాత వచ్చిన రాజు బిందుసారుడు. ఈ పేర్లతో వరుసగా జాండ్రేమ్సు, సాండ్రో సిప్టస్ అను పేర్లు కలియుటలేదు. ఇట్లుకాక గుప్త చంద్రగుప్తుడు సాండ్రోకొట్టోస్ అనుకొనినచో, అతనికి ముందున్న ఆంధ్ర రాజులలో చివరివాడైన చంద్రమస్ (చంద్ర బీజుడు, లేక చంద్రశ్రీ), తరువాత వచ్చినరాజు సముద్ర గుప్తుడు. ఈ పేర్లు జాండ్రేమ్సు, సాండ్రోసిప్టస్ అను పేర్లతో కలియుచున్నవిగదా ! దీనిని బట్టికూడ క్రీ. పూ. 327 లో ఉన్న వాడు మౌర్య చంద్రగుప్తుడు కాడనియు, గుప్త చంద్రగుప్తుడే యనియు తేలుచున్నది.
పురాణముల కాలగణనమును త్రోసివేయుటకు చరిత్రకారు లింకొక కారణమును చూపుదురు. "అశోకుని శాసనములలో ఆనాడున్న యవనాది రాజుల నామము లున్నవి. గ్రీకుచరిత్ర ప్రకారము వారి కాలము తెలియు చున్నది. కనుక వారికి సమకాలికుడైన అశోకుడు క్రీ. పూ. 272-232 సంవత్సరముల నడుమ ఉండినట్లు చెప్పవచ్చును. దీనిని బట్టి అతని తాతయైన చంద్రగుప్తునికి నిర్ణయించిన కాలము యుక్తి యుక్తముగ నున్నది" అని సిద్ధాంతము చేయుదురు. ఈ సందర్భమున ఈ క్రింది పట్టిక పరిశీలింపదగును :
అశోకుని శాసనములో ఉన్న రాజుల పేర్లు. (13వ శాసనము కాల్సీశిలమీద దక్షిణ భాగమున | చరిత్రకారులు చదివిన పేర్ల పాఠము | చరిత్రకారులు గుర్తించిన రాజుల పేర్లు |
అతియోగ | అంటియోక | ఆంటియోఛస్ థియోస్ (సిరియా) |
తులమయ | తురమాయ | (రెండవ) టాలమీ ఫిలడెల్ఫాస్ (ఈజిప్టు) |
గొంగకేన | అంటికిన | అంటిగోనస్ గొనాటస్ (మాసిడోనియా) |
మక | మగ | నుగాస్ (సిరినీ) |
అలిక్యషుదలె | అలికసుందర | అలెగ్జాండర్ (ఎపిరస్, లేక, కోరింథు) |
576