విజ్ఞానకోశము - 3
చంద్రగుప్త చక్రవర్తి
దము విశాల రమ్యోద్యానమునందు నిర్మితమై యుండెను. ఉద్యానమునందు పచ్చని - పత్రశోభితములగు వృక్షములును, శీతలచ్ఛాయా సమన్వితములగు తరుబృందమును ఉండెను. తామరకొలకులు, అందు జలవిహారార్థము పడవలు ఉండుచుండెను.
గంగానదితో శోణానదికలియు సంగమస్థానమున రాజధానియగు పాటలీపుత్రము నెలకొనియుండెను. ఆ నగర రాజముయొక్క పొడవు 9 మైళ్ళ 352 గజములు; వెడల్పు 1 మైలు 1270 గజములు. దీనిచుట్టును 60 అడుగుల లోతును, 200 గజముల వెడల్పును గల అగడ్తయుండెను. ఈ అగడ్తను శోణానదీ జలముతో నింపుచుండిరి. పట్టణమునకు మరియు రక్షణముగా బలాఢ్యమైన 'కంచెకోట' (మానుకోట) అగడ్తవెంట చుట్టుతిరిగి వచ్చును. ఈకోటకు రంధ్రము లుండును. ఆ రంధ్రములగుండ విలుకాండ్రు బాణములను ప్రయోగించుచుండిరి. ఆ నగర ప్రాకార కుడ్యమునకు 64 దర్వాజాలును, 570 బురుజులును నగర సంరక్షక దృష్టితో నిర్మితమైయుండెను. ఈ నిర్మాణములు ప్రాకారకుడ్యమునకు, నగరమునకు శోభనుగూర్చునవిగా నుండెను.
వాయవ్య సరిహద్దునుండి పాటలీపుత్రము వరకును 1150 మైళ్ళ పొడవుగల రహదారి బాట యుండెను. ఈ బాట యందలి ప్రతి మైలునకు గుర్తుగా ఒక రాతిని పాతి, ఆ రాతిమీద ఇటునటుబోవు బాటలను గూర్చియు, వాటి దూరములను గూర్చియు వివరించి యుండిరి. బాటల కిరు ప్రక్కలను ప్రయాణికుల సౌకర్యార్థము వృక్షశ్రేణి పెంచబడుచుండెను. అచ్చటచ్చట నీటివసతు లేర్పరుపబడెను. పూటకూలి యిండ్లును, విశ్రాంతి గృహములును తగు విధముగా నుండెను. భూమార్గములే గాక జలమార్గములును దూరదూర ప్రదేశములకు పోవుటకు సామ్రాజ్యమునం దంతటను ఏర్పరుపబడెను. వీటికి కుల్యామార్గములు. కూలపథములు, సంయాన పథము లనియు పేర్లుండెను. నదీనదములకు సంబంధించినవి కుల్యామార్గములు. రేవులను గలుపు తీరమార్గములకు కూల వథములని పేరు. నిండు సముద్రమార్గములకు సంయాన పథము లని పేర్లు. ఇట్టి జలయానములకు ఉపయోగకరముగ వేర్వేరు విధములయిన నావ లుండెను.
ఈ రహదారి బాటల సుస్థితిని, మరమ్మతులను, సూచీ ఫలకములను చక్కజూచుటకు అధికారులు నియమితులై యుండిరి.
ప్రజాజీవితము : చంద్రగుప్తుని సామ్రాజ్యమునందంతటను శాంత్యభ్యుదయ సంతృప్తులు నిండుకొని యుండిన వని మెగస్తనీసు సందేహవిరహితముగ లిఖించియున్నాడు ఇట్టి ఫలితమునకు, భూమి ఫలవంతమైనదిగను, ఖనిజ సంపత్సంభరితముగను ఉండుటయే కారణము. ప్రజలు సంతృప్తికరమగు జీవనోపాధికలిగియుండుటచే, సామాన్య గృహజీవనమునకు మించిన పరిస్థితులు కలిగి ఠీవిగా నుండుచుండిరి. ప్రజలు కళాకౌశలులై యుండిరి. భూమి సారవంతమైనదగుటచే పంటలు బాగుగ పండుచుండెను. ఫలవృక్షములు చక్కగ ఫలించుచుండెను. ప్రజలు పరిశుద్ధ వాయువును పీల్చుచుండిరి; పరిశుద్ధ జలమును త్రాగుచుండిరి. ఇక వారికి కొరత ఎందుకుండును? భూమ్యంతర భాగములందు పలువిధములయిన పొరలలో బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరము మొదలగు ఖనిజసంపద అమితముగా నుండెను. గృహోపకరణములు, ఆభరణాద్యలంకార వస్తువులు, యుద్ధాయుధములు, వివిధములయిన కొఱముట్లు నిర్మాణముకొరకు ఈ లోహాదులు ఉపయోగింపబడుచుండెను.
నదులు, సెలయేళ్ళు దండిగ నుండుటచే, భూమి సారవంతముగా నుండెను. ఆహారధాన్యములు, చెట్లు చేమలు, చక్కగ వర్దిల్లుటకు అనుకూలముగ నుండెను. సంవత్సరములో రెండు వానలు కురియుచుండుటచే, రెండు పంటలు పండుచుండెను. భారతభూమి యందు క్షామదేవత ఆ కాలములో ప్రవేశించనేలేదట ! పుష్టికరమగు ఆహారమున కెట్టి కొరతయు లేకుండెను. భూమియొక్క సారమునుబట్టియేగాక, భారతీయులు అనుష్ఠించు కొన్ని ఆచారవ్యవహారములవల్ల కరవు ప్రత్యక్షమగుటకు అవకాశమే లేకపోయెనట! ఇతర దేశములలో యుద్ధసమయ ములందు ఇరువాగుల వారును భూతలమును సర్వనాశనముచేసి, పనికిరాని బీడుగా చేయుచుండిరి. కాని భారతదేశములో రైతును పరమపవిత్రుడుగను అహింసనీయుడుగను భావించి, మహాసంగ్రామములు ప్రజ్వలించుచున్న సమయములో కృషికుని కెట్టి భయ సంకటములు సంభ
573