ఘర్మయంత్రములు
సంగ్రహ ఆంధ్ర
వలెనన్న నాలుగు ముఖ్యలక్షణములను నిర్దేశింపవలసి యున్నవి. అవి పీడనము P, ఉష్ణోగ్రత T, ఘనపరిమాణము V, ఎంట్రాపి S. వీటిలో ఏ రెంటినైనను తీసికొని వాటికిగల పరస్పర సంబంధమును ఒక కరణముచే వ్రాయవచ్చును. ఇట్లు వ్రాయగల్గు ఆరు సమీకరణములలో నాలుగు అతి ముఖ్యమైనవి; ఎక్కువ ఉపయోగకరమైనవి. వీటిని "మాక్స్‌వెల్ సమీకరణములు" అని వ్యవహరింతురు. అవి ఏవియన.
(89) T- (ST) = (SP) T=-(ST) P
ఈ సమీకరణముల నుపయోగించి ఒక గ్రూపు (group)కు సంబంధించిన చరాంకములను (Variables) మరియొక గ్రూపులోని చరాంకములకు మార్చవచ్చును. ప్రక్రియలు జరుగు పద్ధతులను తెలిసికొనుటలోనేగాక, శాస్త్రపరిశోధనలకు యీ సమీకరణములు ఎక్కువ ఉపయోగపడుచున్నవి.
ఇక ఉష్ణయంత్రములు పనిచేయు విధానమునుగూర్చి తెలిసికొందము. అవి పనిచేయు పద్దతినిబట్టి ఉష్ణయంత్రములను క్రింద పేర్కొనబడిన విభాగములుగా విభజింప వచ్చును.
1. ఆవిరియంత్రములు (Steam engines).
2. అంతర్జ్వలన యంత్రములు (Internal combustion engines.)
(అ) ఆటోయంత్రములు (otto cycle engines)
(ఆ) డిసెల్ యంత్రములు (Diesel cycle engines.)
3. ఆవిరి లేక వాయు టర్బైనులు (Steam or gas turbines).
4. జట్ యంత్రములు (Jet engines).
చిత్రము - 148
పటము - 1
ఆవిరియంత్రపు ముఖ్యభాగములు
ఆవిరియంత్రములు : ఉష్ణయంత్రనిర్మాణములో మొట్ట మొదటి మానవ ప్రయత్నమును గురించి హీరో ఆఫ్ అలెగ్జాండరుచే (300. B. C - 400 A. D. మధ్యకాలములో) వ్రాయబడెను. ఆతడు నిర్మించిన యంత్రము కేవలము ఆటబొమ్మగా మాత్రమే నిలిచిపోయెను. ఒక మూయబడిన పేటికలో గాలి వేడిచేయ బడి ఒక గొట్టము ద్వారా క్రిందనున్న పాత్రలోని నీటిలోనికి పంపబడును. గాలియొక్క ఒత్తిడిచేనీరు ఒక ఫౌంటెన్ (fountain) రూపములో పైకి చిమ్మును. గాలికి బదులు ఆవిరిని ఉపయోగించి ఈ యంత్రమును 1606 వ వంవత్సరములో మార్క్వెస్ డెల్లాపోర్టా (marquess dellaporta) నిర్మించెను. 1698 వ సంవత్సరములో థామస్ సేవరీ (Thomas Savery) అను నాతడు నీటిని పైకి త్రోడు యంత్రమును (water-pumping-machine) ఒక దానిని నిర్మించెను. తరువాత పేర్కొనదగిన యంత్రము
చిత్రము - 149
పటము - 2
జేమ్సువాట్
554