గ్రహణములు
సంగ్రహ ఆంధ్ర
సంఖ్య అధికము. ఐనను సూర్యగ్రహణము ప్రతీ దేశమందును కన్పట్టకపోవుటచే ఒక దేశములోనుండు ప్రజలు చంద్రగ్రహణములే తరచు చూచుచుండుటయు, సూర్యగ్రహణములను అరుదుగ చూచుటయు సంభవించు చుండును. ఒక సంవత్సరకాలములో ఎక్కువపక్షము 5 సూర్య గ్రహణములు, రెండు చంద్రగ్రహణములు కాని, లేక 4 సూర్యగ్రహణములు, మూడు చంద్రగ్రహణములు కాని, తక్కువపక్షము రెండు సూర్యగ్రహణములే పట్టి, చంద్రగ్రహణములు లేకుండుటగాని సంభవింపవచ్చునని గణితము వలనను, క్షేత్రమువలనను నిరూపించ వచ్చును. సూర్యుడు మేఘఛ్ఛన్ను డనగా మేఘచ్ఛాయలో నున్న మానవుడు సూర్యుని చూచుట లేదని యర్థము. అట్లే సూర్యుడుచంద్రచ్ఛన్నుడై సూర్యగ్రహణముపట్టినప్పుడు, ద్రష్టయగు మానవుడు చంద్రగోళచ్ఛాయలో నున్నాడని యర్థము. చంద్రచ్ఛాయ యొక్క పొడుగు దరిదాపు 2,40,000 మైళ్ళే యగుటచే, అనగా మనకు చంద్రునికి మధ్య నుండు దూరముతో ఇంచుమించు సమానమే యగుటచేత చంద్రచ్ఛాయ భూమియందు కొద్ది ప్రదేశమే స్పృశించుచు పోవును. ఆచాయయం దుండు జనులే సూర్యగ్రహణమును చూడకలుగుదురు. ఒకప్పుడు చంద్రబింబ ప్రమాణము సూర్యబింబ ప్రమాణము నంతను కప్పివేయ గలుగును. అప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణ మందుము. మరియొకప్పుడు చంద్రబింబము సూర్యబింబము నంతయు కప్పివేయజాలక, సూర్యబింబము యొక్క మధ్య భాగమును మాత్రమే కప్పివేయ గలుగును. అప్పుడు సూర్యబింబముయొక్క చుట్టుభాగము కంకణము వలె మిగిలిపోవును. అప్పుడు కంకణ గ్రహణమందుము.
ఇక చంద్రగ్రహణము పూర్ణిమయందేలపట్టవలయును? ప్రతి పూర్ణిమయందేల పట్టదు ? సూర్యగ్రహణము అమావాస్య యందేల పట్టవలయును? ప్రతి అమావాస్యయందేల పట్టదు ? అను విషయములను గూర్చి తెలిసికొనవలయును. చంద్రగ్రహణ మనగా, చంద్రుడు భూచ్ఛాయలో ప్రవేశించుటయే యని మనము తెలిసికొని యున్నాము. (మొదటి క్షేత్రమును చూడుడు) అనగా సూర్యునికి, చంద్రునికి మధ్యగా భూమి రావలయునన్న మాట. అప్పుడు పూర్ణిమయగును. కావున పూర్ణిమా కాలమందే చంద్రబింబము భూ ఛా ప్రవేశము చేయ కలుగును. ఐనచో ప్రతి పూర్ణిమయందేల చంద్రుడు భూ ఛా ప్రవేశము చేయడు? అన్నప్రశ్నకు సమాధానమేమన, చంద్రుడు ఆ ఛాయకు కొంచెము పై గానో, కొంచెము క్రిందుగానో పయనించి, ఆ భూచ్ఛాయలో పడకుండా దాటిపోవు నన్నమాట. దానికి కారణము చంద్రుడు, భూమియు, సూర్యుడును ఒకే తలము (plane) మీద లేక పోవుటయే. భూమి సూర్యునిచుట్టు తిరుగు తలమునకు 'క్రాంతివృత్త తలము' (Ecliptic plane) అందుము. చంద్రుడు భూమిచుట్టు తిరుగుతలము దానికి భిన్నమై, పై తలమునకు సుమారు 5 భాగలలో నుండును. అందుచే సాధారణముగా పూర్ణిమాకాలమునకు చంద్రుడు క్రాంతి నృత్తతలమునకు పై భాగముననో, క్రింది భాగముననో భూచ్ఛాయను దాటిపోవుచుండును. అట్లే అమావాస్య కాలమందుకూడ సాధారణముగా క్రాంతివృత్త తలమునకు దూరముగానుండి పయనించి పోవుచుండును. అట్లు కాక, పూర్ణిమకాలమందుగాని, అమాకాలమందుగాని చంద్రుడు క్రాంతివృత్త తలమునకు బాగుగా దగ్గర పయనించుచో, తప్పక గ్రహణము సంభవించును.
ఇక పూర్ణిమాకాలమందు చంద్రగ్రహణము సంభవించుటకై చంద్రుడు క్రాంతివృత్త తలమునుండి ఎంత దూరములో నుండవలయును? అట్లే సూర్యగ్రహణము సంభవించుట కెంతదూరములో నుండవలయును? అను ఒక ముఖ్య గణితమును తెలిసికొందము. క్రాంతివృత్త తలమునుండి చంద్రునికి గల దూరమును 'శరము' లేక 'విక్షేపము' అందురు (Celestial latitude). ఈ చంద్ర శరము క్షణక్షణము మారుచుండును. పూర్ణిమాంత మునకు చంద్రగ్రహణము, అమావాస్యాంతమునకు సూర్యగ్రహణము కావున పూర్ణిమాంతమునకు, అమాంతమునకు చంద్రశరమును గణితముచేసి తత్పూర్వాపర కాలములందు శరములో ప్రతి ఘటికావికారమును గణించి గ్రహణమును సాధించెదరు.
స = సూర్యగోళము.
భ = భూగోళము.
అ క ట = భూచ్ఛాయ = Shadow cone.
చ = భూచ్ఛాయా ప్రవేశము చేయు చంద్రగోళము.
506