పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/555

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంధిస్రుతములు (హార్నోనులు))

సంగ్రహ ఆంధ్ర

ప్రయోజనములు మున్నగువాటిని గురించి వివరించెడి సమస్త విషయములు గ్రంథాలయ శాస్త్రమునకు సంబంధించిన అంశములే.

గ్రంథాలయ శాస్త్రములో గ్రంథాలయముల నిర్మాణము, గ్రంథాలయముల నిర్వహణము ముఖ్యమైన భాగములు. నిర్మాణ కార్యక్రమములో గ్రంథాలయముల యాజమాన్యమున కొక సంఘము, పరిపాలన కొక కార్యవర్గము ఏర్పడి, గ్రంథ భాండాగారిని నియమించును. కాని ఈయన సలహా సంప్రదింపులతో స్థల నిర్ణయము చేసి, భవనమునకు పథకమును వ్రాయించి, దీనిని నిర్మాణ మొనర్చి, గ్రంథాలయమునకు కావలసిన బీరువాలు మొదలయిన పరికరములను సేకరించుకొనిన పిమ్మట, దీని నిర్వహణమున కవసరమైన నిబంధనలను తయారు చేయుట జరుగును.

విధి భేదముల ననుసరించి గ్రంథాలయ నిర్వహణమునకు సంబంధించిన ప్రధాన కార్యములను డాక్టరు రంగనాథన్‌గారు ఎనిమిది శాఖలక్రింద విభజించినారు :

1. గ్రంథ వరణము.

2. గ్రంథ సేకరణము.

3. పత్రికలు.

4. గ్రంథ ప్రవేశము.

5. సాంకేతిక కార్యములు, సంపుట సంస్కారము.

6. గ్రంథప్రచారము.

7. ఆచూకీ.

8. బీరువాలు.

ఇవి గ్రంథాలయముల నిత్యనిర్వహణమునకు సంబంధించిన ప్రత్యక్ష కార్యక్రమములు. వీటి కనుబంధముగా నుండినవి గ్రంథాలయ నిర్వాహకులు సాగించెడు వివిధ కార్యకలాపాలు, ప్రచారము, లెక్కలు, ఉత్తరప్రత్యుత్తరములు, అచ్చు పనులు, బైండింగు, నివేదికల తయ్యారీ, పట్టికల వ్రాత మున్నగునవి. ఒక్కొక్క సమయమునందు ప్రజానీకమునందలి కొన్ని వర్గములు విషయమై గ్రంథాలయములు ప్రత్యేక శ్రద్ధను చూపవలసియుండును. ఇట్టి వర్గములకు సంబంధించిన ప్రత్యేక సమస్యలుకూడ గ్రంథాలయ శాస్త్రములోని భాగములే.

పరిశోధన కార్యముల కెక్కువగా ఉపయోగపడెడి గ్రంథవర్గీకరణము (Classification), సూచీకరణము (Cataloguing), ఆచూకీసేవ (Reference Service), వాజ్మయ సూచిక (Bibliographies) లకు సంబంధించిన విజ్ఞానము గ్రంథాలయ శాస్త్రములో నేడత్యంత ప్రాముఖ్యము వహించినది. వీటికి సంబంధించిన సమస్యలపై ఇటీవల జరిగిన పరిశోధనలలో డాక్టరు రంగనాథన్ గారు ప్రముఖ పాత్రను వహించినారు.

గ్రంథాలయ నిర్వాహకులు గమనించదగిన ప్రధాన విషయములను-

1. అధ్యయనము కొఱకు పుస్తకములు.

2. అందరకును పుస్తకములు.

8. ప్రతి పుస్తకమునకు తన చదువరి - ప్రతి చదువరికిని తన పుస్తకము.

4. చదువరికాలము, సిబ్బందికాలము వ్యర్థపుచ్చరాదు.

5. గ్రంథాలయము నిత్య వర్థిష్ణువులైన అంగములు కలిగిన జీవసంస్థ.

అను సూత్రములలో డాక్టరు రంగనాథన్‌గారు ఇమిడ్చినారు. వీటి ననుసరించి గ్రంథాలయ కార్యక్రమము నడిచెడి పక్షమున గ్రంథాలయ నిర్వహణమునందు వృథా వ్యయమునకుగాని, కాల విలంబనమునకుగాని యేమియు అవకాశముండదు. దీని మూలముగ గ్రంథాలయ ఉపయోగముకూడ బాగుగ పెరుగునని నుడువవచ్చును.

పా. నా.


గ్రంధిస్రుతములు (హార్మోనులు):

శరీరముయొక్క కొన్ని అవయవములనుండి రక్తప్రవాహములోనికి విడుదల చేయబడు పదార్థములకు గ్రంధిస్రుతములనియు, ఇంగ్లీషులో హార్మోనులనియు పేరు. రక్తప్రవాహముద్వారా ఈ పదార్థములు మరికొన్ని అవయవములకు చేర్చబడి, అచట దేహారోగ్యమునకు సంబంధించిన కొన్ని ప్రత్యేకక్రియలకై పాటుపడును. ఈ విధముగా హార్మోనులవలన శరీరముయొక్క కొన్ని అవయవములు మరికొన్ని అవయవములపై ఒక విధమగు ప్రభావమును కలిగియున్నవి. మనకు తెలిసి యున్న హార్మోనులలో పెక్కులు నిర్వాహికలగు గ్రంధుల (Ductless glands) నుండి జనించుచున్నవని తెలియు

502