పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/543

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాదు. దుఃఖభూయిష్ఠమైన జీవితమును గడపు చున్న మానవులకు దుఃఖములేని శాశ్వతానంద పదవికి మార్గమును చూపించుట కొరకు సిద్ధార్థు నకు కాంక కలిగెను. అట్టి నిశ్చయముతో అతడు ఒకనాటి అర్ధరాత్రమున నిద్రామగ్నులయిన దార సుతాదులను విడచి, రథారూఢుడై వెడలిపోయెను. పురమునకు కొంత దూరముననున్న అరణ్యములో రథము దిగి తన దుకూలములను, భూషణములను రథసారథియగు ఛన్నున కిచ్చియతనిని పంపి వేసెను. దీనిని మహాభి నిష్క్రమణ మందురు. పిదప భిక్షు వస్త్రములను ధరించి అతడు ఏకాకియై తిరుగ జొచ్చెను. అప్పుడు సిద్ధార్థుని వయసు 29 సంవత్సరములు.

సిద్ధార్థుడు ప్ర థ మమున ముడు, ఉద్దక రామపుత్రుడు అను నిరువురు యోగులవద్ద ఉపదేశమును పొందెను. కాని అతనికి తృప్తి కలుగలేదు. అంతట వారిని విడచి మగధరాజ్యమును

చిత్రము - 132 పటము - 2 గౌతమబుద్ధుడు