పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/542

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము . 8

ఈ విధముగ గోలకొండ రాజకీయ చతురతకు, వివిధ భాషావాఙ్మయ పోషణమునకు, దేశీయ విదేశీయ వర్తక వ్యాపారములకు, తదితర అభ్యుదయ కార్యములకు దాదాపు మూడు శతాబ్దములు ప్రధాన కేంద్రముగ మహోన్నత వైభవము ననుభవించినది.

కో. గో.


గౌతమబుద్ధుడు :

భారత దేశ మునకు ఉత్తరమున నేపాళమునందు శాక్య నామక క్షత్రియవంశమున శుద్దోదనుడను రాజు ఉండెను. అతని రాజధాని కపిలవస్తునగరము. అతనిభార్య మాయా దేవి. ఆమె గర్భవతియై కపిలవస్తు పట్టణమునుండి పురిటికై పుట్టింటికి ప్రయాణము చేయుచుండెను. మార్గ మధ్యమున లుంబిని యను ఆరామమునందు ఆమెకు ఒక మగశిశువు జనించెను. ఆ శిశువు నకు సిద్ధార్థుడని నామక రణము చేయబడెను. ఈ శిశువే అనంత రము గౌతమ బుద్ధుడుగా ప్రసి దు డయ్యెను. గౌతమబుద్ధుని జన్మసంవత్స రమును గూర్చి చారిత్రకులలో అభిప్రాయ భేదము కలదు. కాని క్రీ. పూ. 563 సం. ప్రాంతమున అతడు జన్మించినట్లు పెక్కురు అంగీకరించిరి. అతడుపుట్టినపుడు వచ్చిన జ్యోతిష్కులు పరిపా లింప దలచినచో అతడు చక్ర వర్తి కాగలడనియు, సన్యసించి జ్ఞానసిద్ధిని పొందగల డనియు తెలిపిరి. సిద్ధార్థుడు నచో జన్మించిన వారమురోజుల కే అతని జనని మాయాదేవి మర ణించెను. అందుచేత శుద్దోదనుని రెండవ భార్యయగు మహా ప్రజా పతి గౌతమి ఈ శిశువును వాత్స ల్యముతో పెంచెను. సిద్ధార్థుడు యౌవనమునందు 62 52 గౌతమబుద్ధుడు యశోధర యను కన్యను వివాహమాడి, ఆ మెయందు రాహులుడను పుత్రుని బడసెను. సిద్ధార్థుడు చిన్న నాటి నుండియు ఇతర క్షత్రియ బాలురవలె క్రీడాసక్తుడుగాక నిరంతరము దీర్ఘాలోచనా నిమగ్నుడై యుండెడి వాడు. అతని అట్టి విచిత్ర ప్రవర్తనమును గాంచి, అతడు విరాగి యగునేమో యని భీతిల్లి తండ్రియగు శుద్దోదనుడు అతని మనస్సును ప్రాపంచిక విషయములపై మరల్చుటకయి అనేకవిధముల యత్నించెను. అయినను, కారణజన్ముడైన సిద్ధార్థుని విషయ సుఖములు ఆకర్షింపజాలకుండెను. సిద్ధార్థు డొక నాటి సాయంకాలము వాహ్యాళి కై పుర బాహ్య ప్రదేశమునకు వెడలెను. అచ్చటచ్చట త్రోవలో మున్ముందు కనిపించిన వృద్ధ, రోగి, శవ దృశ్యములవలన అతని హృదయము దుఃఖావిష్టమయ్యెను. పిదప నొక చిత్రము - 131 సన్యాసి కనిపించెను. సిద్ధార్థుడు సన్యాసిని పిలిచి పటము - 1 గౌతమబుద్దుడు 489 ఆ యడుగగా సన్యాసి తాను మోక్షము కొరకు సన్యసించితి ననియు, ఆసన్యాసమే తన నిత్యతృప్తికి, నిత్య సంతోషమునకు కారణ మైన దనియు చెప్పెను. సన్యాసి వృత్తాంతమును వినిన తోడ నే సిద్ధార్థుడు దీర్ఘాలోచనా నిమగ్నుడై రథమును మరలించి స్వీయనగరము చేరెను. ఆ సిద్ధార్థునకు ప్రపంచమున సర్వత్ర దుఃఖమే కనిపించెను. ప్రజల దుఃఖమును నివారించి వారు శాశ్వత మైన ఆనందమును పొందుటకై మార్గమును అన్వే షించుటకు అతడు నిశ్చయించు కొ నెను. తోడ నేఅతనికి ఇంద్రియ భోగముల పై ఏవగింపును, ప్రాణి వర్గముపై అపారమైన దయ యు, సంసారమును పరిత్యజింప తలంపును కలిగెను. ఆ పరిత్యా గము స్వీయ మోక్షమున కై