పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/536

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము _ 3 487 గోలకొండ సుల్తానులు

ఏదియో ఒక వృత్తియందు సిద్ధహస్తు లై యుండిరి. కరువు కాటకములు లేక ప్రజలు సుఖముగ జీవించుచుండిరి. గోల కొండ నేతపనికి కూడ ప్రసిద్ధమై యుండెను. ఇచ్చటి వస్త్రములు విదేశములకు గూడ ఎగుమతి యగుచుం డెను. నిర్మల, ఇందోల్ ప్రాంతమును ఇనుము, ఉక్కు పనిముట్లు తయారగుచుండెను. దారు శిల్పము కూడ ప్రసిద్ధమై యుండెను. నేటికిని కొండపల్లి బొమ్మలు ఆకర్షకములయి యున్నవి. కస్తూరి, చందనము, చైనా సిల్కు, పంచదార పోరస్ పాత్రలు, చైనా వస్త్రములు మున్నగునవి గోల కొండకు దిగుమతి యగుచుండెడివి. దేశమునగల ప్రశాంత పరిస్థితులవలన భాషా వాఙ్మయ పోషణ మొనర్చుటకు గోలకొండ సుల్తానులకు సదవకాశము లభించినది.

గోలకొండ వాఙ్మయపోషణము : గోలకొండ సుల్తా నులు సంస్కృతాంధ్ర వాఙ్మయములను, పారసీక, ఉర్దూ భాషావాఙ్మయములను చక్కగా పోషించిరి. సంస్కృత మున శృంగారమంజరి యను అలంకార గ్రంథము ఈయుగ మున రచింపబడినదే. ఆంధ్రభాషా వాఙ్మయ పోషణము నను, కవిపండితాదరణమునను గోలకొండ సుల్తానులు చూపిన అభిరుచి ప్రశస్తమైనది. మహమ్మదీయ ప్రభువులలో సుల్తాను ఇబ్రహీం కుతుబుషా ఏడు సంవత్సరములవరకు విజయనగరమున నుండి తెలుగు భాషా పాండిత్యమును సంపాదించుకొని గోలకొండసింహాసనము నధిష్ఠించిన తరు వాత తెలుగుపండితులను, కవులను ఆదరించి తదచిత కావ్యములకు కృతిభ ర్తయై స్థిరకీర్తి విరాజితుడయ్యెను. నాటినుండియు విద్యానగరముతోపాటు గోలకొండకూడ ప్రధాన విద్యారంగమయ్యెను. అద్దంకి గంగాధరకవి 'తపతీసంవరణోపాఖ్యానము', పొన్నగంటి తెలగనార్యుని 'యయాతి చరిత్ర', రుద్రకవి 'నిరంకుశోపాఖ్యానము',

  • సుగ్రీవవిజయ యక్షగానము', మట్ల అనంతభూపాలుని

'కకుత్సవిజయము', సారంగు తమ్మయ 'వైజయంతీ విలా సము', భద్రాచల రామదాసు 'భద్రాద్రిశతకము', 'రామ దాసు కీర్తనలు' మున్నగు వివిధ ఆంధ్రవాఙ్మయ ప్రక్రి యలు గోలకొండ సుల్తానుల కాలమున వెలువడినవే. ప్రప్ర ధమముగ అచ్చతెనుగు కబ్బమగు యయాతి చరిత్రము 'ఈ కాలమున రచితమగుట గమనించదగిన విశేషము.

పై కావ్యపీఠికల వలన గోలకొండ సుల్తానుల యొక్కయు, తత్ప్రధానాధికారుల యొక్క యు వాఙ్మ యాభిరుచి తేటపడుచున్నది. అంతియేకాక మహమ్మ దీయ చరిత్రకారులకు తెలియని విశేషాంశము లెన్ని యో బయల్పడినవి. భాగ్యనగర నిర్మాతయగు మహమ్మద్ కులీ స్వయముగ తెలుగులో పద్యరచన గావించినటుల స్థానిక చరిత్రకారుల వ్రాతలవలన రుజువగుచున్నది. కాని నేటికిని అట్టి పద్యములు లభింపకుండుట దురదృష్టము. తండ్రి వారసత్వమునను, భాగ్యమతి పరిచయ భాగ్య మునను మహమ్మద్ కులీ తెలుగునేర్చి పద్యరచన గావించి యుండుటలో ఆశ్చర్యము కాని, సందేహము కాని, ఉండ బోదు. మహమ్మద్ కులీ వ్రాసిన ఉర్దూగీతములందు భ్రష్ట రూపమున తెలుగుపదము లెన్ని యో ఉపయోగింపబడినవి.

గోలకొండ సుల్తానులు పారశీక ఉర్దూ భాషా వాఙ్మయముల కొనర్చిన సేవను ప్రత్యేక ముగ ప్రశంసింప నవసరము లేదు. ప్రభువుల భాషాభిమానమును పురస్కరించుకొని వి దేశములనుండియు, మొగలు దర్బారునుండియు ఏ తెంచిన ఎందరో పారశీక కవులు గోలకొండ దర్బారు నలంక రించిరి. వీరు సుల్తానుల చరిత్రను, గోలకొండయందలి తమ అనుభవములను గ్రంథరూపమున ప్రకటించిరి చరిత్ర కారుల కాగ్రంథము లెంతయు నమూల్యములు.

కులీకుతుబుషా కాలమున నొక సాహితీసమితి ఏర్ప డెను. జమీదు కాలమునుండి సుల్తానుల దర్బారు సుప్రసిద్ధి కెక్కెను. జమీదు ఉర్దూ కవిత్వమున సిద్ధహస్తుడు. అతడు ఒక్కొకసారి ఆవేశమునకు లోనై ఆశుకవిత చెప్పెడి వాడట. ఇబ్రహీంకాలము పారశీక ఉర్దూ వాఙ్మయము లకు స్వర్ణయుగమని చెప్పవచ్చును. అమీనా, మహమ్మద్ అంజూ, అమీర్ ఇమాముద్దీన్, కాసిం బేగ్, హుస్సేన్ కులీమీర్జా మొదలగువారెందరో ఈతని దర్బారు నలంక రించిరి. “శారీఖె ఖుతుబ్ షాహి” (కుతుబ్ షా చరిత్ర) ఈ కాలమున రచింపబడినదే. రసికాగ్రేసరుడగు మహమ్మద్ కులీకాలమున ఉర్దూభాషావాఙ్మయములకు మహోన్నత స్థానము లభించినది. ఈతని పేష్వా 'మీర్ మోమిన్' పారశీక పండితుడు. మీర్జామహమ్మదు అమీన్ వంటి పండితు లెందరో ఉండిరి. సుప్రసిద్ధకవి, మహమ్మదు కులీఖుతు బుషా సమకాలికుడు 'ముల్లావజీ' యనువాడు 'కుతుబ్ ముష్తరి' యనుకావ్యమును రచించెను. ఈ కావ్యము