పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/528

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 8 గోలకొండ పట్టణము

పలువురు హిందువులు గోలకొండ రాజ్య నిర్వహణమున ప్రధానపాత్ర వహించిరి. అది గిట్టని వారికి అసూయా ద్వేషములు కలిగెననుటకు సందేహములేదు. అక్కన్న మాదన్నలు ఉన్నతపదవులలో నుండుట అట్టి అసూయా పరులకు మరింత ద్వేష కారణమైనది. గోలకొండసుల్తానులు షియాశాఖకు చెందినవారు. స్థానిక దక్కను ముసల్మా నులు సున్నీ శాఖవారు. సుల్తానులు వీరిలో అందరియం దును సమదృష్టిని పరపిరి. గోలకొండ సుల్తానుల సర్వ మత సమదృష్టి కారణముగా ప్రజలు సుఖమయమయిన జీవితమును గడిపిరి.

మహమ్మదుకులీ కుతుబుషా కాలమునాటికి గోలకొండ పట్టణము జనసంకీర్ణమైన కారణమున అది క్రమముగ విస్తరింప నారంభించెను. భాగ్యమతీ మహమ్మదుకులీ ప్రణయము, మహమ్మదుకులి వర్షర్తువులో విలాసము కొ నెలలతరబడిగా రాజ్యమునుండి దూరముగ నుండుట, హుస్సేనుసాగరు సమీపమున వేసవిగృహము నిర్మితమగుట, గోలకొండలో మహామారి సంభవించి తగ్గిన తరువాత చార్మినారు నిర్మింపబడుట, మక్కామసీదు నిర్మాణాదులు - అన్నియు క్రమముగ మూసీనది తీరమం దొక క్రొత్తనగరమును సుందరో ద్యానములతో నిర్మింప వలయునను సుల్తానుసంకల్పమునకు మరింత దోహదము కల్పించినవి. దీని ఫలితముగ భాగ్యమతి పేర భాగ్యనగర నిర్మాణము అచిరకాలముననే పూర్తియైనది. గోలగొండ సౌధములను మించు సౌధ రాజములు, రాజభవనములు, అంతఃపురములు, దర్భారుహాలులు, న్యాయశాలలు, విద్యాలయములు, వై ద్యాలయములు, లెక్కకు మించిన ఉద్యానవనములు నిర్మితములైనవి. జనసంకీర్ణమయిన గోలకొండనుండి కుతుబుషాహిసుల్తానులు పదునారవ శతాబ్ది ప్రాంతమున, రాజధానిని హైదరాబాదు నగర మునకు మార్చిరి. ఐనను, గోలకొండ, సైనిక కేంద్రముగ తుదికాలమువరకు సుల్తానుల అధీనముననుండి అభివృద్ధి పొందినది. హైద రాబాదునకు తూర్పున సుల్తాన్ మహమ్మద్ ఆరంభించిన సుల్తాన్ నగర నిర్మాణము ఆతని మరణముతో పరిసమాప్తమై భాగ్యనగర మేకైక రాజధానియయ్యెను. భాగ్యనగరము రాజధాని కాక పూర్వము మహమ్మద్ కులీ కాలమున దర్బారు 'దౌలత్ ఖానా' లో జరిగెడిది. ఖుదా దాద్ మహల్ వంటి సౌధములు రాజకీయ కార్యకలాప ములకు ఉపయోగించినవి.

గోలకొండ నగరవర్ణనము, గోలకొండ శ్మశానవాటి కల వర్ణనములేనిది పూర్తి కానేరదు. లంగర్ హౌజునకు కార్వాన్ సరాయికి సమీపమున విశాలమైన ఆవరణమున గోలకొండ సుల్తానులు, రాజబంధువులు, పట్టపు రాణులు, రాజుల ప్రియురాండ్రు మున్నగువారి సమాధులన్నియు నిర్మింపబడి నేటికిని కుతుబుషాల కాల స్మృతిచిహ్నములై యున్నవి. ప్రపంచమునం దెచ్చటను, ఇన్ని సమాధులు, రాజులకు సంబంధించినవి, ఒక్కచో వినిర్మితములైనవి. లేవని గోలకొండను సందర్శించిన వర్నియర్ అను ప్రముఖుడు తమ అనుభవములందు | వ్రాసెను. గోలకొండ సుల్తానులకు తమ జీవిత కాలమునందే తగిన గుంబదులను నిర్మించుకొనుట పరిపాటయినది. ప్రశాంత వాతావరణ మున గల ఈ గుంబదులన్నియు, గోలకొండ సుల్తానుల కాలమున చక్కని ప్రాకార కుడ్యములతో భద్రపరచ బడినవి. అన్ని వేళలందు జనసామాన్యమునకు ఈ గుంబదు లందు ప్రవేశ సౌకర్యములు లేకుండెను. హైదరాబాదు ప్రభుత్వమువారిలో సాలారుజంగు ఈ గుంబదుల రక్షణ మున ప్రత్యేక శ్రద్ధను చూపెను. ఔరంగజేబు దాడివలన గోలకొండ శిథిలమైనది కాని, ఈ గుంబదులు మాత్రము చెక్కు చెదరక నిల్చియున్నవి. దండయాత్ర లొనర్చినవా రెవరును గుంబదు భవనములను నాశనము చేయుటకు పూనుకొనలేదు. ఇవన్నియు హిందూ - మహమ్మదీయ శిల్పకళా సమ్మేళనమునకు తార్కాణములుగ నిల్చి యున్నవి. గోలకొండ సుల్తానులు తమ జీవిత కాలమున మహోన్నత సౌధ రాజములను నిర్మించుకొని, అందు సుఖించినటుల, మరణించిన తరువాతగూడ, పారలౌకిక సుఖాసక్తులై సుందరతర శిల్పములతో నొప్పు సమాధు లందు దీర్ఘనిద్రనొందిరి. గోలకొండ గుంబదులలో గల పెక్కు సమాధులలో కొన్నిటిపై ఆయా వ్యక్తుల యొక్క మరణ కాలముకూడ వ్రాయబడినది. కొన్నిటిపై ఎట్టి లిఖితాధారములు లేవు. అవి ఎవరివో తెలిసికొనుట కష్టసాధ్యము. మొ త్తముమీద రాజాధి కారులు, `రాజ బంధువులు, ప్రియురాండ్రు మున్నగువారి కొరకే ఈ సమాధులు నిర్మితము లై వవనినిశ్చయముగ చెప్పవచ్చును.