పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/525

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోలకొండ పట్టణము సంగ్రహ ఆంధ్ర

చున్నవి. కోహినూరు వజ్రముకథ ప్రపంచ ప్రసిద్ధమైనది. -గోలకొండ నుండి ఆ వజ్రము పయనించి ఎందరినో సామాన్యులను, ధనికులను, చక్రవర్తులను, తన్మకుట ములను వరించినది. ఇట్టి గాథ లనంతములుగ గలవు. గోలకొండలో వజ్రములను పరీక్షించు నిపుణు లెందరో ఉండిరి. వజ్రముల పరీక్షించు పద్ధతులుకూడ పలువిధము లయినవి. కొందరు చూచినంతమాత్రమున, కొందరు తాకినంతమాత్రమున, మరికొందరు వాసన చూచినంత మాత్రముననే వజ్రముల మంచిచెడుగులను తెలిసికొ నెడి వారట. వజ్రముల గనులు రాజాధికారులయొక్కయు, ధనికులయొక్కయు స్వాధీనమున ఉండినవి. విదేశీయము లైన కంపెనీలకు ఈ గనులపై యాజమాన్యము లేకుండ, గోలకొండసుల్తానులు కట్టుదిట్టములు కావించిరి. అక్కన్న మాదన్నలు ఈ విషయమున ప్రత్యేక శ్రద్ధ వహించి విదేశీయములయిన కంపెనీలకు ఎట్టి యాజమాన్యము లేకుండ ఆంక్షలు విధించిరని తెలియుచున్నది. డచ్చివారు వజ్రముల వ్యాపారములో ప్రముఖులుగ నుండిరి.

సుగంధ ద్రవ్య వ్యాపారసంబంధములు రెడ్డి రాజుల కాలమునుండియు విదేశములకును, ఆంధ్రదేశమునకును మధ్య ప్రగాఢముగ నుండెను. గోలకొండలో అవచి తిప్పయ సెట్టివంటివా రెందరుండిరో చెప్పుట కష్టము. వర్తకులు తెచ్చిన సుగంధద్రవ్యములు గోలకొండ విఫణి వీథులందు కొన్ని గంటలలోనే అమ్ముడు పోవుచుం డెడి వట. ఇక్షడకు సుగంధాదివస్తువులు తెచ్చి అమ్ముడుపోక, నిరాశాహతులై నవా రెవ్వరును లేకుండిరి. మహమ్మద్ కులీ కాలమున సుగంధ ద్రవ్యములను దెచ్చిన వర్తకు డొకడు తనసరకు నమ్మలేక పోయెనట. నాటికే రాజుగారి యొద్ద, ధనికుల యొద్ద . అట్టి సుగంధ ద్రవ్యములు రాసు లుగ నుండెనట. ఆ వర్తకుడు నిరాశాహతుడై వెళ్ళు చున్న వార్త గూఢచారులవలన రాజుగారి కందినది. రాజు ఆ వస్తువులను కొని రాజసౌధములం దుంచుటకు స్థలము లేక పోయినది. అందుచే, ఆ చక్రవర్తి తక్షణమే వర్తకునియొద్ద కొన్న కస్తూరిని అపుడపుడే హైదరాబాదు ప్రాంతమున నిర్మాణదశలో నున్న సౌధపు పునాదు లం దు వేయ నాజ్ఞాపించెనట. అప్పటినుండి ఆ సౌధము 'మిల్క్ మహల్' అనగా కస్తూరిభవనము అని ప్రసిద్ధి పొందినదని వా

జనశ్రుతి కలదు. ఇందలి సత్యాసత్యము లెట్లున్నను, గోలకొండ గొప్ప వర్తక కేంద్రమనియు, ఆచట ఎంత సుగంధ సామగ్రినైనను కొనుటకు శక్తిసామర్థ్యములు కలవారుండిరనియు, గోలకొండ విఫణివీథులందు సుగం ధాది ద్రవ్యములు అమ్ముడుపోకుండుట లేనేలేదనియు, గోలకొండ ప్రభువులు వర్తకులకు తగిన సౌకర్యములను కూర్చుచుండిరనియు తెలియుచున్నది. లేక

గోలకొండ ప్రజలు వివిధోత్సవములను మహా వై భవ ముగ జరుపుకొనుచుండిరి. జాతిమత వర్గ భేదములు గోలకొండ నగరమునందలి ప్రజలు రాజుగారి పట్టాభి షేక _ జన్మదినోత్సవములందు పాల్గొనుచుండిరి. నౌరోజా ఉత్సవము, వసంతోత్సవము, మృగశిరాప్రవేశోత్సవము, ఇత్యాది ఉత్సవములందు సమధికోత్సాహమున చక్రవర్తు ప్రజలందరు సంతోషమునొందు చుండిరి. ఈ ఉత్సవములు మహమ్మద్ కులీ కాలమునుండి ద్విగుణి తో త్సాహమున జరుగుచుం డెను. లతోపాటు

ఈ ఉత్సవములందు రాజు, రాజాధి కారులందరు, మద్యపాన మత్తులై సుఖములండోలలాడుచుండిరి. ఆట కత్తెలు వివిధ నృత్యములచేత రాజునకు వినోదమును కూర్చుచుండిరి. చెలిక త్తెలందరు పుష్పాలంకృత లై కోలా టము లాడుచు మైమరచి ఇతరులను మురిపించుచుండిరి.

రాజుగారి పట్టాభి షేకోత్సవము నగర ప్రజలక పర్వ దినము. ఈ సందర్భమున నగరమంతయు సుందరముగ అలంకరింపబడుచుండెను. అంతఃపురములోని చెలిక త్తెలు చెరకుగడలతో అమర్చిన పుష్పమంటపమును చేతులతో బట్టుకొ నినీలవర్ణ ఛత్రచ్ఛాయలందు సుల్తాను నాసీనుని గావించుచుండిరి. నీలవర్ణము కుతుబుషాహీల అభిమాన వర్ణము. రాజునకు దృష్టితీయుట, కండచక్కెర తిని పించుట, పుష్పములు, చందనము, సుగంధ ద్రవ్యములు సమర్పించుట, రాజు పాదములను పారాణితో నలంక రించుట, సురటీలు పట్టుట మున్నగు కృత్యములు మహా వైభవముతో జరుగుచుండెను. సన్నాయిలు నగరాలు వీటి మ్రోతలచే దిశలు ప్రతిధ్వనించుచుండెను. ఈ ఉత్స వమున పాల్గొనువారందరును, రాజును వెండి పూలుగల పల్లకియందు ఊ రేగించుచుండిరి. చక్రవర్తి జన్మదినోత్స వములందు ప్రజలకు కండచక్కెరను పంచి పెట్టుచుండిరి.