పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/519

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోలకొండ పట్టణము సంగ్రహ ఆంధ్ర

సేవక సంఘసభ్యుల విధ్యుక్తధర్మములలో నొకటియని ఇతడు వక్కాణించెను. ప్రాథమిక విద్యాచట్టము పై ప్రసంగించుచు విద్యాగంధము లేనిచో ప్రజలలో మిత వ్యయము, కార్మికులలో పారిశ్రామిక సామర్థ్యము పెంపొందజాలవని వచించెను.

గోఖలే యొక్క హితోపదేశములను ఆనాటి ప్రభుత్వము పెడచెవిని పెట్టెను. కాని ఇతడు ఆశావాది. భవి ష్యత్తుపై విశ్వాసము గలవాడు. కావుననే "ఈతరము నకు చెందిన మేము మా అపజయముల ద్వారముననే దేశ మును సేవింపవలయును. తమ విజయముల మార్గమున దేశమునకు సేవచేయు ధన్యులు భావికాలములో రాగలరు" అని ఇతడు వాక్రుచ్చెను. ఇతని కలలు ఫలించినవి. ఇతడు వచించిన మూడున్నర దశాబ్దులకే భారత దేశము పారతంత్ర్య శృంఖలములనుండి విముక్తి పొందినది.

ఆర్. ఎన్. ఎస్.


గోలకొండ పట్టణము : దక్షిణాపథ చరిత్రమునందు గోలకొండ సామ్రాజ్య చరిత్రమున కొక ప్రత్యేకస్థానము కలదు. ఆంధ్రుల చరిత్రలో ఇది యొక భాగము. దాదాపు మూడు శతాబ్దముల వరకు ఈ సామ్రాజ్యము అఖండైశ్వర్యము ననుభ వించి భోగభాగ్యముల నోలలాడినది. గోలకొండ నేలిన సుల్తానులు కుతుబుషాహీ వంశస్థులు. వీరికి రాజధానియగు గోలకొండ సామ్రాజ్య రక్షక దుర్గముగ కీర్తిగాంచినది.

గోలకొండ దుర్గమునందు నగరము క్రమాభివృద్ధి నొందినది. గోలకొండ దుర్గము, నగరము అవినాభావ సంబంధము కలవియై విలసిల్లినవి. 'ఇది దుర్గము' 'ఇది నగరము' అని గీతగీసి నిర్దేశించుటకు అలవిగానట్లుగ అవి వర్ధిల్లినవి. ప్రాథమికదశయందు దుర్గప్రాంతము, నగర ప్రాంతము విడివిడిగ నుండెను. కాలక్రమమున గోలకొండ సుల్తానులు దేశరక్షణమును, ప్రజా సౌక ర్యములను దృష్టియందిడుకొని దుర్గాభివృద్ధి - నగరాభివృద్ధులకొరకు తమ శక్తి నెల్ల ధారపోసిరి. దుర్గ ప్రాంతమున గూడ నగరము విస్తృతమైనది. ఇంతేకాదు. హర్మ్యములు, ప్రాసాదములు, వేసవి కనుకూలమగు విశ్రాంతి గృహ ములు, విలాసమందిరములు, నగరమునకు కొన్ని మైళ్ళ దూరమున నిర్మితములై నవి. ఇవన్నియు గోలకొండ నగర పరిధిలో జేరినవై యుండెను.

తెలంగాణ ప్రాంతమునకు గవర్నరుగ నియమింపబడిన

చిత్రము - 122

పటము - 1

"బాలాహిస్సార్" 470