విజ్ఞానకోశము - 3
గోపమంత్రి నాదిండ్ల
ముగా "కృష్ణార్జున సంవాదము" రచించియున్నాడు. ఇది గయోపాఖ్యాన కథ.
ప్రారంభము :
శాంత మానసునకు జానకీపతికి
నెంతయుఁ బ్రీతిగా నే రచియించు
చారు కృష్ణార్జున సంవాదమునకు
నారఁ గథా సూత్ర మది యెట్టి దానిన
గ్రంథాంతము :
భాసురకీర్తి గోపప్రధానుండు
చారు కృష్ణార్జున సంవాద మొనర
గా రచియించె సత్కవులు నుతింప.
గయోపాఖ్యాన కథ మహాభారతమున గానరాదు. శ్రీకృష్ణునికి సంబంధించిన హరివంశమునగాని, భాగవతము నందు గాని యీ కథ యెంతమాత్రము గానరాదు. ఇది రామాయణ కథయందు, అవాల్మీకములవలె భారత కథయందు క్రొత్తగా చేరినకథ. కావుననే వీనిని కల్పిత కథలుగా పరిగణింతురు. గోపన సమకాలికుడైన చరిగొండ ధర్మనకవి రచించిన "చిత్రభారతము” న ఈ కథ గలదు. కృష్ణార్జున సంవాదములోని గయుని పేరునకుబదులు చిత్ర భారతమున చతుర్ధనుడని కలదు. గయుని నోటినుండి పడిన నిష్టీవనమునకు బదులు చిత్రభారతమున చతుర్ధనుడను రాజు ఆకాశ మార్గమున బోవుచుండగా ఆ రాజు ఎక్కిన గుఱ్ఱము నోటినుండి నురుగుపడెనని కలదు. ధర్మన తానీ కథను బ్రహ్మాండ పురాణమునుండి గ్రహించినట్లు వ్రాసియున్నాడు. కాని నేటి బ్రహ్మాండపురాణ ప్రతులలో నిది గానరాదు. గోపమంత్రి తన కాలములో ప్రచారమున నున్న గయుని కథను గ్రహించి కృష్ణార్జున సంవాదముగా రచించెనని చెప్పవచ్చును. ఈ కృతి విశేషములు.
1. ఇందు వర్ణనలకంటె కథకు ప్రధానస్థానము కలదు.
2. కావ్యశైలి, సంస్కృతాంధ్రములు సమపాళము గను, నిర్దుష్టముగను ఉన్నవి.
3. వర్ణనములు సముచితములుగ కావింపబడినవి.
4. జాతీయములు, సామెతలు సందర్భానుసారముగా వాడబడినవి.
ఇలపులి దాసర్ల కిడియెద ననిన
వలనేది నమ్మి పోవచ్చునే చెపుమ
చింతింప గతజలసేతుబంధనము
నలిని క్షీరోదక న్యాయమై యుండ
గోర్చుట్టమీద రోకటిపోటు
తంగేటిజున్ను రాధా భర్త మనకు.
5. ఇందలి ద్విపదలలో 'ప్రాసయతి' ప్రయోగములు లేవు సలక్షణమైన భాష. సాధారణముగ ద్విపదపాదము లొక దానితో నొకటి కులకముగ నేర్పడక విడివడి యుండును. శృంగారవర్ణనలు మచ్చునకైన లేక వీరరస స్ఫోరకమై, నీతి బోధకమై యున్నది.
కృష్ణదేవరాయల కాలములో ప్రబంధములే గాని యితర వాఙ్మయప్రక్రియలు లేవు అను నపవాద మొకటి సారస్వత లోకమున వ్యాపించి యున్నది. కాని గోపమంత్రి ద్విపదకృతి యా యభిప్రాయమునకే యపవాదము. ఈ ద్విపదకృతియే గాక కృష్ణదేవరాయల కాలమున భద్రకవి లింగకవి సానందోపాఖ్యానము, దేవాంగ పురాణము మున్నగు ద్విపదకృతులు వెలసినవి.
గోపమంత్రి రచన వెనుక గయోపాఖ్యాన కథ యెన్ని యో రూపములు వెలసినది.
ప్రబంధములు : కృష్ణార్జున సంవాదము : (1) వెలిచేరు వెంకటరామ ప్రధాని క్రీ. శ. 1700 ప్రాంతము. అముద్రితము.
(2) కస్తూరి రంగకవి క్రీ. శ. 1750 ప్రాంతము. అముద్రితము.
యక్షగానము : గయనాటకము : ఎమ్. కాశీపతి ఆచారి. ముద్రితము.
గయోపాఖ్యానము : ధేనువుకొండ వెంకయ్య (జంగం కథ) ముద్రితము.
హరికథ : గయోపాఖ్యానము: బాలాజీదాసు. ముద్రితము.
నాటకము : గయోపాఖ్యానము : చిలకమర్తి లక్ష్మీ నరసింహము, కాశీనాథుని వీరమల్లయ, డి. సీతారామారావు, పి. సూర్యనారాయణ.
వచనము: గయోపాఖ్యానము: పి.శివరామన్న, పి. రామబ్రహ్మము, ఎస్ . వెంకటసుబ్బశాస్త్రి, మావిపెద్ది కోటయ్య.
గయోపాఖ్యానమను పేరుతో నున్న గ్రంథములు ఏ వాఙ్మయ ప్రక్రియల ననుసరించినను కథమాత్రము
467