పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/51

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కేంద్రకణ భౌతికశాస్త్రము సంగ్రహ ఆంధ్ర


రూధర్ ఫర్డ్ కనుగొనెను. అతడు వాటికి ఆర్ఫా (a), బీటా (B), గామా (X) కిరణములని పేరు పెట్టెను. ఆల్ఫాకిరణములు ధనవిద్యుదా వేళమును, బీటాకిరణములు ఋణవిద్యుదా వేశమునుకలిగియున్నవి. గామాకిరణములు తటస్థమైనవి. బీటాకిరణములు ఎలక్ట్రానులని తరువాత కనుగొనబడెను. గామాకిరణములు అయస్కాంతిక విద్యుత్ క్షేత్రములలో వంగవు. ఆల్ఫా కిరణములు ద్రవ్యములో అతి తేలికగా లీన మగును (Absorbed). ఇవి కాగితముగుండా చొచ్చు కొని బయటకు రాజాలవు. బీటాకిరణములు కొన్ని మిల్లీ మీటర్ల దట్టముగల అల్యూమినియం రేకును చొచ్చుకొని ఈవలకు రాగలవు. గామా కిరణములకు చొచ్చుకొని రాగలశ క్తి (Penetrating Power) చాల ఎక్కువ. ఆల్ఫాకిరణములకు అయనీకరణ సామర్థ్యము మెండు. బీటాకిరణములకు వాటికంటే అయనీకరణశక్తి తక్కువ. ఈ శక్తి గామాలకు చాల తక్కువ. అతి తక్కువ అయనీ కరణమునకు ప్రోద్భవించునప్పటికిని, వాటికిగల హెచ్చగు చొచ్చుకొను శక్తి చే గామా కిరణములు జీవులకు ఎక్కువ ౨ హాని చేయును. ప్రాయోగిక నిదర్శనమునుండి, సాడీలును, ఆల్ఫా కిరణములును ద్విగుణముగా (doubly) అయనీకృత మైన హీలియం పరమాణువులే నని రూధర్ ఫర్డు 1903 లో స్పష్టీకరించెను. (ఎలక్ట్రానుమీది ఆవేశము ఒకటిగా తీసి కొని ఇతర అణువుల (Particles) ఆవేశమును ఇన్ని ఎలక్ట్రాను ఆవేశములని చెప్పుట వాడుక). రేడియో ఆక్టివ్ క్షయము (Radioactive Decay) ; రేడియో ఆక్టివ్ శ్రేణులు (Radioactive Series) : రేడియో ఆక్టివ్ ద్రవ్యములు స్థిరముగా ఎక్కువకాలము ఉండవు. వివిధ ద్రవ్యములు వివిధ రీతులుగా క్షీణించును (disentegrate) కొన్ని అతి శీఘ్రముగా క్షీణించును. మరికొన్ని క్షీణించుటకు కొన్ని లక్షల సంవత్సరములు పట్టును. ఒక రేడియో ఆక్టివ్ ద్రవ్యము దానిలో సగము వరకు క్షీణించు కాలమును దాని అర్ధజీవిత మందురు (Half-life). కొన్ని రేడియో ఆక్టివ్ ద్రవ్యములు క్షీణించునపుడు వాటి నుండి ఉద్భవించు నూతన ద్రవ్యములు గూడ

ఆక్టివ్ గా నుండును. కొన్ని ముఖ్య లక్షణము లను బట్టి ఈ శిథిల ఫలితము (Decay products) అన్నింటి మధ్య ఒక వంశ సంబంధము స్థిరపరుపబడెను. ఒకే మూల ద్రవ్యము (element) నుండి ఉద్భవించిన ఈ శిథిల ఫలిత ముల నన్నిటిని ఒక రేడియో ఆక్టివ్ శ్రేణి (series) యందురు. ప్రస్తుతము అటువంటివి నాలుగు ముఖ్య L శ్రేణులు గలవు. అవి యురేనియం, థోరియం, ఆర్జీనియం, నెప్తూనియం శ్రేణులు. ఇవి చివరకు సీసముగా మారును. ఒక మూల ద్రవ్యమును సాధారణముగా రెండం కెలచే సూచింతురు. ఉదా: 92- 2 లో 92 యు రేనియం యొక్క పరమాణు అంక ము (atomic number), 238 పరమాణు భారము (atomic weight). ఒక మూల ద్రవ్యము యొక్క పరమాణు అంకము (2) ఆవర్త క్రమ పటిక (periodic table) లోని ఆ మూలద్రవ్యము యొక్క స్థానమును తెలియబరచును. ఆ సంఖ్య ఆ మూల ద్రవ్యము యొక్క రాసాయనిక లక్షణములను నిర్ణయించును. ఒక మూల ద్రవ్య పరమాణు భారము (A లేక W), ఆ మూల ద్రవ్య పరమాణువు ఉదజని పరమాణువు కంటే ఎన్ని రెట్లు భారమైనదియు తెలియజేయును.

మిణుకు

కొన్ని పరికరములు (Instruments) దర్శకము (scintfilloscope), అయనీకరణ మందిరము (Ionization chamber), గైగర్ మొల్లరు గణిత్రము (Geiger Muller Counter), విల్సన్ మేఘమందిరము (Wilson cloud chamber), ఛాయాచిత్ర పద్ధతి మొద లగునవి బీజ భౌతిక శాస్త్ర పరిశోధనలలో ఉపయోగపడు సాధనములు. మిణుకు దర్శక ములోనున్న ప్రస్ఫురణ తెర మీద ప్రతి ఆల్ఫాకణము ఒక మిణుకును కలుగ జేయును. ఈ మిణుకు లన్నిటిని నగ్నచదువులతో చూచి లెక్క వేయుదురు. అయనీకరణ మందిరము, గైగరు పద్ధతులు లోని మూల సూత్రము, ఆల్ఫాకణము గాలిని ఎక్కువ సామర్థ్యముతో అయనీకరించుటే. గైగర్ ముల్లరుగణిత్ర సహాయమువలన ఎలక్ట్రానులను గామా కిరణములనుకూడ లెక్క పెట్టవచ్చును. విల్సన్ మేఘ మందిరములోని అతి సంతృప్త బాష్పముల (Supersaturated Vapours) లో అయనులు తమ మార్గములను సూచించును. ఈ మార్గములను (tracks) తేలికగా చూడవచ్చును; ఫొటో 13