గొప్ప గ్రంథాలయములు
సంగ్రహ ఆంధ్ర
ధైర్యము వ్యవసాయదారునకు కలుగును, అట్టి ధైర్యముతో ఆతడు బావి త్రవ్వించుటకు ఉపక్రమింపగలడు. ఈ విధముగా అతడు అనవసరమయిన వ్యయమును తగ్గించుకొనగలడు.
బి. ఆర్. బి.
గొప్ప గ్రంథాలయములు :
గ్రంథాలయములనగా 'అచ్చుపుస్తకముల నిలయములు' అను నర్థము నేడు వ్యాప్తికి వచ్చినది. ఇది ఒక నాగరికతాచిహ్నముగ నున్నది. కాని వ్రాతప్రతులున్న తంజావూరు సరస్వతీ పుస్తక భాండాగారమునకును ఈ నామము తగియున్నది.
పూర్వకాలమున రాజుల చరిత్రములు, వీరులకథలు, గేయరూపమున తరతరములుగా గానము చేయబడు చుండెడివి. లేఖనము ప్రచారములోనికి వచ్చినతరువాత మత, రాజకీయ సంఘటనలను లిఖించి, ఆ వ్రాతలను దేవాలయములలో భద్రము చేయుచుండిరి. ఇట్లు దేవాలయములు ప్రథమ పుస్తక భాండాగారములుగను, అర్చకులు ప్రథమ గ్రంథాలయాధిపతులుగను వర్తిలినట్లు మనమూహింపవచ్చును.
గ్రంథాలయోద్యమముయొక్క లక్ష్యము సంస్కృతి యొక్కయు, విజ్ఞానముయొక్కయు వ్యాప్తియైయున్నది.
ప్రాచీన గ్రంథాలయములు :
అస్సిరియా : ప్రప్రథమ గ్రంథాలయ నిర్మాతలు అస్సిరియా దేశస్థులు. 1850 లో 'నినవే' వద్ద త్రవ్వకముల మూలమున బయల్పడిన అషుర బనిపాలుని (క్రీ. పూ. 668-626) గ్రంథాలయమునగల 1 మొదలు 12 అం. ల చతురముతో నొప్పు మట్టిపలకలలో లిఖితములు కొన్ని విరిగినవి కనుపించినవి. ఆచ్చటగల పదివేల ఉద్గ్రంథములు చక్కనిపద్ధతిలో అమర్పబడినవి; గ్రంథసూచి యొకటి కలదు. ఆనాడు ప్రజలందరకు గ్రంథాలయమును ఉపయోగింప నవకాశములుండెను. అందలి చాలభాగము బ్రిటిష్ మ్యూజియమున ప్రదర్శింపబడియున్నది.
ఈజిప్టు : ఈజిప్టునందలి ప్రాచీన గ్రంథాలయములను గూర్చిన విషయములు అసమగ్రముగా తెలియుచున్నవి. అచటి గ్రంథాలయములలో క్రీ. పూ. 6,000 సంవత్సరముల క్రిందటి రాజుల దినచర్యలు, గృహజీవితములు, వ్యాపారవిషయములు వ్రాయబడిన గ్రంథములు కలవు. ఇంతేకాక, మతగ్రంథములు, చారిత్రక గ్రంథములు, నీతి - వేదాంత - వైద్య - శాస్త్రగ్రంథములు, కథలు, హాస్యకథలు, సామెతల గ్రంథములుకూడ నుండెడివి. ప్రతి దేవాలయమందును మత, శాస్త్రములకు సంబంధించిన గ్రంథములుండెడివి. రెండవ 'పిరమిడ్' నిర్మాత యగు కూపూయొక్క గ్రంథాలయమును గూర్చియు, నాలుగవవంశపు రాజగు కూపూ గ్రంథాలయమును గూర్చియు లిఖిత పత్రములు గలవు. 'ఎడ్ఫూ' వద్ద దేవాలయపు గదియే గ్రంథాలయముగా నున్నది. గది గోడమీద పుస్తకముల జాబితా కలదు. 'యెండెన్ వద్ద కాల్చబడిన మట్టిపలకలే గ్రంథములు (charred books) గాగల భాండాగార మొకటి కలదు. ప్రఖ్యాత ద్వితీయ రామ్‌సేస్ (క్రీ. పూ. 1383-1236) గా గుర్తింపబడిన ఒసిమాండ్యాసునిగ్రంథాలయము "ఆత్మచికిత్సాలయము" అను పేరు కలిగియున్నట్లు డైడొరస్ నికలన్ అను నాతడు వ్రాసెను. ఆ గ్రంథాలయమొక కార్యాలయమువలె నుండెడిదట. అందు రాజునకు సంబంధించిన లిఖితము లుండెడివి. గ్రంథములను పెట్టెలయందును, జాడీల యందును భద్రపరచెడివారు. వాటిని తిరిగివ్రాయుట కొక విద్యాలయ ముండెడిది. మెంఫిస్‌వద్ద నొక పెద్ద గ్రంథాలయ ముండినట్లు చెప్పబడుచున్నది. పారసీకుల దండయాత్రా సందర్భములో ఇచ్చటి గ్రంథములను విజేతలు గొంపోయిరి.
గ్రీసు : గ్రంథములను సేకరించినవారిలో పిసిస్ట్రేటస్, పాలిక్రేటస్, యూక్లిడ్, నికోక్రేటస్, యూరిపిడిస్, అరిస్టాటిల్ అను ప్రాచీనులు ప్రముఖులు. స్నైడస్ వద్దగల గ్రంథాలయములో వైద్యగ్రంథములు కలవట. ఆలస్ గెలియస్ అనునాతడు మొట్టమొదటి జనతా గ్రంథాలయమును (Public Library) స్థాపించెను. ఈ గ్రంథాలయమును జెర్‌క్సెస్ (Zerxes) అను నాతడు (క్రీ. పూ. 485 - 465) పర్షియాకు తీసికొనిపోయెను. అనంతరము సెల్యూకస్ నికటార్ తిరిగి దానిని ఏథెన్స్ నగరవాసుల కిచ్చెనట. ప్లేటోవద్ద పెక్కుగ్రంథములు ఉండెనని తెలియుచున్నది. అరిస్టాటిల్ గ్రంథాలయము ఆతని శిష్య ప్రశిష్యులకు పరంపరగా దక్కినది. పెర్గమమ్ రాజుల యొక్క గ్రంథ లుబ్ధతకు జడిసి, అరిస్టాటిల్ ప్రశిష్యు
434