విజ్ఞానకోశము - 3
గొట్టపు బావులు
యొక్క స్వేచ్ఛాపతనమును గురించియు, ద్రవస్థితిని (Hydrostatics) గురించియు కావించిన పరిశోధనలు న్యూటన్ చలనసూత్రములకు (Laws of motion) మార్గదర్శకములుగా నుండి, ఆర్కి మెడీసు సిద్దాంతములను ధ్రువపరచుచున్నవి.
1636 లో “నూతనశాస్త్ర విజ్ఞానముపై సంభాషణము" అను గ్రంథమును ఇతడు వ్రాసెను. 1637 లో గెలిలియో చంద్రునిలోని పర్వతముల ఎత్తును నిర్ణయించెను. ఇవియే ఆయన జరపిన కడపటి పరిశోధనములు.
గెలిలియో ఆరోగ్యము త్వరగా క్షీణింప మొదలిడెను. ఆయనకు చెవుడు, గ్రుడ్డితనము కలిగెను. ఆరోజులలో ఆయనను చూచుటకు జాన్‌మిల్టన్ మొదలగు వారు వచ్చిరి. లోలకము, గడియారమును నిర్మించుటలో ఎట్లు పనికివచ్చునని జీవితాంతమువరకును ఆలోచించెను. కాని గృహచ్ఛిద్రములు, మతాధికారుల సాధింపులు, బెదరింపులు, అనారోగ్యము మొదలగువానితో కృశించి, చివరకు క్రీ. శ. 1642 జనవరి 8వ తేదీన గెలిలియో చనిపోయెను. చనిపోయినతర్వాతకూడ మతాధికారులు అతని శవ సంస్కారమునకు అనుజ్ఞ నీయలేదు. సమాధిపై స్మారక చిహ్నముంచుట 95 సంవత్సరముల పిదపగాని జరుగలేదు. మరణశాసనము చెల్లదనిరి; అముద్రిత గ్రంథములను నాశనము చేసిరి.
గెలిలియో ప్రపంచ ప్రఖ్యాత పురుషులలో నొకడు. విషయ పరిశీలనమునందు నిశితమైన ప్రశ్నలనిడు అతని దృక్పథమే అతనికి అధికమైన ప్రఖ్యాతిని తెచ్చి పెట్టినది. ఒక్కమాటలో చెప్పవలెనన్న, గెలిలియో మానవులకు విజ్ఞానమునేగాక, వైజ్ఞానిక దృక్పథమునుగూడ ప్రసాదించిన మహామేధావి.
ఎ. స. మూ.
గొట్టపు బావులు :
పశుపక్ష్యాది సమస్త జీవకోటికిని నీరు అత్యవసర మయిన పదార్థము. మానవుడు తన దైనందిన జీవనమునకై నీటిని ఉపయోగించుటతో పాటుగ, పారిశ్రామిక తదితర వ్యాసంగములయందు గూడ దానిని వాడుచున్నాడు. అన్ని పరిశ్రమలందుకంటె వ్యావసాయక రంగమందు పంటలు పండించుటకై నీరు ప్రాణాధారముగ భావింపబడుచున్నది.
నీరు నదులనుండియు, కాలువలనుండియు, చెరువుల యందు నిలువచేయుటవలనను లభ్యమగుచున్నది. పెక్కు దేశములందు ఈ విధమయిన నీటి వనరులనుండి ప్రత్యక్షముగ జలము లభించుటలేదు. ఈ కారణమున బావులు త్రవ్వుట అవసర మగుచున్నది.
అయితే నీరు పుష్కలముగా ఎక్కడ లభించునో తెలిసికొనకుండ గ్రుడ్డిగా బావులు త్రవ్వుచు పోయిన, వృథా శ్రమగా పరిణమించు నవకాశము గలదు. కావున “బోరింగు" (గొట్టములు దింపు) విధానము నుపయోగించి నీరున్న చోటును కనిపెట్టెదరు. ఈ బోరింగు విధానమువలన మూడు ప్రయోజనములు కలవు:
1. పెద్ద బావులు త్రవ్వుటకై స్థలనిర్ణయము చేయుట.
2. అదివరకే త్రవ్వబడియున్న బావులలో నీటి ఉత్పత్తిని అధికము చేయుట.
3. గొట్టపు బావులను నిర్మించుట.
వ్యవసాయదారుడు తాను బావి త్రవ్వుటకు పూర్వము త్రవ్వకము పూర్తి అగువరకు, మంచినీరు పుష్కలముగ లభ్యమగునో, కాదో అను విషయమును నమ్మకముగా చెప్పలేడు. త్రవ్వకము పూర్తియై నీరు పుష్కలముగా పడనియెడల తాను వ్యయపరచిన వందల రూపాయల వ్యయమంతయు వృథాయగును. అందుచే ఒకేసారి పెద్దబావి త్రవ్వబూనుట ప్రమాదముతో కూడిన సాహసకార్యము. ఇట్టి ప్రమాదములోపడి పెద్ద బావి త్రవ్వకమునకై ధనము వృథాచేయకయే, గొట్టపుబావులు దించుట శ్రేయస్కరము. పెద్దబావులవలె ఈ గొట్టపు బావులు వ్యయశీలమైనవి కావు. గొట్టపుబావులవలన వ్యవసాయదారుడు పుష్కలమయిన మంచినీరు నిర్ణీత మయిన స్థలమందు లభింపగలదో, లేదో నమ్మకముగా తెలిసికొనగలడు. పెద్దబావులు త్రవ్వుట మిగులఖర్చుతో కూడినపని. అందుచే రయితు 30 అడుగులకంటె ఎక్కువ లోతుగల బావిని త్రవ్వించలేడు. కాని అంతకంటె ఎక్కువ లోతు తెగిన బావులలో లభించునీరు ఆరోగ్యకరముగను, రుచికరముగను, పుష్కలముగను ఉండును. అందుచే బోరింగు పరికరములచే లోతు ప్రదేశములందలి నీటిని సాధింప సాధ్యమగును.
బోరింగు లేక గొట్టపు నూతులవలననే స్వచ్ఛమగు
431