పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/477

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గెలిలియో 428 ร సంగ్రహ ఆంధ్ర

రాజకీయ వ్యవహారము లతని కళామయజీవితమునకు అంతరాయమును కలిగించుచుండుటచే 1786 లో అతడు విహారార్థము ఇటలీ దేశమునకేగి, రెండేండ్లపాటచ్చట నుండెను. అతని కళాకౌశలమచట పునరుజ్జీవిత మై, “ఇఫి జీనియా”, “టాసో” వంటి ప్రశ స్తరచనల రూపమున వ్యక్తమయ్యెను. ఇటలీనుండి వీమార్ పట్టణమునకు తిరిగివచ్చినతరువాత గెటే ప్రభుత్వ కార్యనిర్వహణము నందు జోక్యము కలిగించుకొనక తన కాలమును శాస్త్ర సాహిత్య కార్యకలాపములలో గడపెను. “ఫాస్ట్" నాటకపు ప్రథమభాగము తొలిసారి 1790లో ప్రకటితమయ్యెను. ఆకాలమున విషయవాంఛలకు వశుడై తన భోగలాలసతకు బలిగా శరీరాత్మలతో సైతానునకు అమ్ముడుపోయిన జర్మన్ మాంత్రికుడైన జాన్ఫాస్టు యొక్క గాథ వివిధ భాషలలో బహుకావ్య నాటకముల రూపమున బహుళ ప్రచారము నందియుండెను. ఆ కథను తిరిగి గెటే తన నాటకమునకు ఇతివృత్తముగా గ్రహించి, సృష్టిరహస్యమును, జీవిత పరమావధిని గ్రహించుటకు విఫల ప్రయత్నములను గావించుచున్న ఫాస్ట్ హృదయావేదనలో యావన్మానవులు భావమధనమును ప్రతిఫలింప జేసి, ఫాస్ట్థకు విశ్వజనీనతను ఆపాదించెను. జీవిత చరమ లక్ష్యములను గూర్చిన శుష్కమైన యోచనలయందును, క్షణికమైన ప్రాపంచిక సుఖానుభూతుల తళుకులందును గడచు కాలము వ్యర్థమనియు, మానవుడు తోడి మాన వునకు సేవచేసిన క్షణమే సార్థకమనియు నొక సందేశము నందు అంతర్లీనమై యున్నది. గెటే తన యావజ్జీవితము ఈ నాటకమునకు మెరుగులు దిద్దుచునే యుండెననిన, అతనికీ నాటక మెంత యభిమానపాత్రమైనదో తెలియగలదు. తరువాత 1794 లో గెటేకు జర్మన్ రచయిత షిల్లర్ తో సఖ్యమేర్పడెను. అప్పుడే గెటే రచించిన నవలలలో మిక్కిలి ప్రసిద్ధమైన “విల్హెల్మ్ మెయిస్టర్” ప్రకటిత మయ్యెను. అతని భావగీతములలో అత్యంత మధుర మైనవి కొన్ని ఈ నవలలో నున్నవి. గెటే 1808 లో క్రిస్టియానే అను యువతిని పెండ్లియాడెను.

“ఫాస్ట్" నాటకమును కొంత సంస్కరించి ప్రథమ భాగమును 1808 లో మరల గెటే ప్రకటించెను. అంతకు ముందెన్నడును అంతటి విశిష్టమైన నాటకము జర్మన్ భాషలో రచింపబడలేదని విద్వాంసులు ఏకగ్రీవముగ నంగీకరించి, తమ హర్షమును వెలిబుచ్చిరి. అప్పుడే నెపోలియన్ దండయాత్రల మూలమున యూరప్ ఖండమంతయు కల్లోలితస్థితిలో నున్నను, గెటేమాత్రమిక రాజకీయములతో ప్రమేయము పెట్టుకొనక, తన కాల మును శాస్త్రపరిశోధనయందును, సాహిత్య సేవయందును గడిపెను. "నా జీవితమునుండి కవిత్వము - సత్యము” అను శీర్షికతో అతడు తన యాత్మకథను అపుడే ప్రక టించెను. తుదినాళ్ళలో నతడు తన దృష్టినంతను “ఫాస్ట్ " నాటకముపై కేంద్రీకరించి, 1831 లో ద్వితీయ భాగమును కూడ పూర్తి చేసి లోకమున కర్పించెను. తరువాత కొలది కాలమున కే 1892 మార్చి నెల 18 వ నాడు గెటే మరణించెను. రచయితగా గెటేలో ముఖ్యముగా ప్రశంసింపదగినది అతని విశ్వజనీనదృష్టి. దైనందిన జీవితములోని సామాన్య సంఘర్షణల వెనుక దాగియున్న చిరంతన సత్యములను అతడు సునిశితముగ పరీక్షించి, తన నవలలలోను, నాట కములలోను వెల్లడించెను. కాళిదాస మహాక వికృత మైన శాకుంతల నాట కానువాదమును చదివి గెటే వెల్లడించిన యానందోత్సాహములు అతనిని మన కత్యంత సన్ని హితుని గావించినవి.

అ. రా.


గెలిలియో :

మొట్టమొదటి సారిగా మానవునిలో పరిశోధనాభి లాషను, వైజ్ఞానిక జిజ్ఞాసను రేకెత్తించిన మహామేధావి గెలిలియో. వైజ్ఞానిక విషయములలో పలువురు మహామహులు తమతమ నమ్మకము లాధారముగా ప్రవచించిన పెక్కు సిద్ధాంతములకన్న ఒక సామాన్య వ్యక్తి నిదర్శనాత్మకమైన ప్రయోగదృష్టితో నెలకొల్పిన స్వల్ప విషయమైనను వేయి మడుంగులు విలువక లిగి యుండునని చాటిన ధీరు డాతడు. గెలిలియో ఇటలీ దేశమున ఒక నిర్థన గౌరవ కుటుం బములో క్రీ. శ. 1564 సం. ఫిబ్రవరి 18వ తేదీన జన్మించెను. చిన్న నాటినుండియు అతనికి ఆటవస్తువులు, యంత్రములు మొదలైనవానిని తయారు చేయుటయందు అధిక మైన ఆసక్తి ఉండెడిది.