పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/475

ఈ పుటను అచ్చుదిద్దలేదు

426 సంగ్రహ ఆంధ్ర

తెలియవచ్చినది. వీటిని నివారించుటకు శ క్తిమంతములైన టీకామందులు లభ్యమగుచున్నవి. కాని వీటివలన రోగము నివారణమైనట్లు తెలియదు. ఆన్ థ్రాక్స్ (anthrax) గొట్టె మశూచి (sheep-pox), మేక మశూచి (goat-pox) అను వ్యాధులనుండి రక్షించుటకై గొట్టెలకు, మేకలకు సంవత్సరమున కొకసారి, టీకాలు వేయ బడును. రాజస్థాన్, పంజాబువంటి ప్రదేశములయందుగల ట్రైపానా సోమియాసిస్ (trypana somiasis) అను ప్రాంతీయ రోగములనుండి ఒంటెలను, గుఱ్ఱములను, గాడిదలను రక్షించుటకు ప్రతిసంవత్సరము వాటికి ఔషధము లివ్వబడును. కుక్కలకు సంక్రమించు రోగము లన్నిటిలో "పిచ్చికుక్క కాటు" (rabies) అత్యంత ప్రమాదమైనది. ఈరోగము ఇతరకుక్కలకును, మనుష్యులకును వ్యాపించును. ఇందులకు రోగని వారక మగునట్టియు (prophylactic), రక్షక మగునట్టియు (protective) టీకాలు లభ్యము కాగలవు. పిచ్చికుక్క కాటు (Rabies) నుండి రక్షించుటకై కుక్కలకు 9 మాసముల కొక సారి టీకాలు వేయవలెను. మనఃక్షోభము (distenper) వలన కలుగు పిచ్చితనము కుక్కలకు కలుగు మరి యొక ప్రమాదకరమైన రోగము. 24 మాసముల వయస్సుగల కుక్కపిల్లలకు టీకాలు వేయవచ్చును. ఒక్కొక్కప్పుడు కుక్కనోటిలో మొటిమలవంటి పొక్కులు (nodules) లేచును. మందులవలన అప్పుడప్పుడు ఇవి అణగిపోవును. అట్లు కానిచో, శస్త్రచికిత్సవలన తాత్కాలిక ఉపశమ నము కలుగగలదు. ఇట్లే, ఆడ, మగకుక్క ల యొక్క జననేంద్రియముల (genitalia) మీద గ్రంధులు (tumors) విరివిగా లేచును. సంయోగముద్వారా ఈ సుఖ సంకట వ్యాధి వ్యాపించును. శస్త్రచికిత్సవలన వీటిని రూపుమాపుట ద్వారానే తాత్కాలికోపశమనము కల్గును.

ముఖ్యముగా మశూచికము వలనను, నులిపురుగుల వలనను, ఇంకను పెక్కు జాడ్యములవలనను కోళ్ళు మరణమొందు చున్నవి. కోళ్లు రెండుమాసముల వయస్సులో నున్నపుడు కొన్ని ఔషధములను సమ్మేళనము చేసి టీకాలుపొడుచుటద్వారా వీటిలో కొన్ని రోగములను నివారింపవచ్చును. పై వాటిలో స్పిరోచటోసిస్ (spirochatosis)అను వ్యాధినుండి కోళ్ళను రక్షింపవలెనన్న చో-

'టిక్ ' అను రక్తము పీల్చు నొకవిధమగు కీటకములను, కోళ్ళను దాచు ప్రదేశములకు చేరకుండునట్లు అరికట్ట వలెను. ఈరోగము సోకినపుడు, పాషాణసంబంధమగు ఔషధములచే (arsenical drugs) చికిత్స చేయవలెను. కోళ్ళు తరచుగా అంగిలివాపు (Diptheria) వలన బాధపడును. అట్టి సమయములో ఒక విధమైన జిగట పదార్థము గొంతుకు అడ్డము తగిలి ఉచ్ఛ్వాస నిశ్వాసము లను అరికట్టును. జిగటపదార్థమును పటకారుతో తీసివైచి, 'పెనిసిల్లిన్ ఇంజక్షన్లతో బాధను నివారణ చేయవచ్చును. కొక్కిడియోసిస్ (coccidiosis) అనబడు రోగము, త్రాగెడు మంచినీటితో స్వల్పముగా 'సల్ఫాస్' (sulfas) ను కలిపినయెడల కోళ్ళకు సోకజాలదు. అప్పు డప్పుడు కడుపులోనికి మందుల నిచ్చుటద్వారా కోళ్ళను క్రిమికీటక ముల, నులిపురుగుల బారినుండి తప్పింపవలెను.

యస్. వెం.


గెటే (Goethe) :

జర్మన్ వాఙ్మయమునందు నవయుగోదయమునకు మూలపురుషుడై, యూరోపియన్ సాహిత్య ప్రపంచమునకు మకుటము లేని మహారాజని సమకాలికులచే కొనియాడబడిన జర్మన్ రచయిత జొహాన్ వుల్ఫ్ గాంగ్ వాన్ గెటే క్రీ. శ. 1749 ఆగస్ట్ నెల 28 వ నాడు జర్మనీ దేశము నందలి 'ఫ్రాంక్ ఫర్ట్-ఆన్ ది మెయిన్' పట్టణమున సంపన్నుల యింట జన్మించెను. న్యాయవాదియైన తండ్రినుండి చిత్తస్థైర్యమును, రసజ్ఞురాలైన తల్లివలన చక్కని కవితాశ క్తియు అతని కలవడెను. అతని బాల్యము సంస్కృతి సూచకములైన పుస్తకములతో, చిత్రములతో, సంగీతముతో నిండిన వాతావరణము నడుమ గడచెను. పిన్ననాటనే గెటే ఇంగ్లీష్, ఫ్రెంచి, లాటిన్ భాషల నభ్యసించెను. అప్పుడు ఫ్రాంక్ ఫర్ట్ లో ప్రదర్శింపబడిన ఫ్రెంచి నాటకము లతనికి రంగస్థలముపై నభిమానమును కలిగించెను. క్రైస్తవ మతగ్రంథ మగు బైబిల్ లోని కథ లాతనిని అమితముగ ఆకర్షించెను. పది సంవత్సరముల ప్రాయమునందే గెటే కవిత్వ రచన మారం భించెను.

తండ్రి కోర్కెపై, గెటే పదునారవ యేట న్యాయ శాస్త్రము నభ్యసించుటకు లైవ్ జిగ్ విశ్వవిద్యాలయ