పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/474

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వీజ్ఞానకోశము = 8 గృహజంతువులు, పెంపుడుజంతువులు


ప్రాక్తనజాతి (protozoam) క్రిమికీటకములు శరీర మును కృశింపజేసి నిర్వీర్యము చేయును. ఇట్టి పరాన్న జీవులచే (parasites) ఉత్పన్నమగు దాదాపు అన్ని రోగ ములను శ క్తిమంతముగా నివారింపవచ్చును. కాని అట్టి రోగములు సంక్రమింపకుండ అరికట్టుటకు ఇతోధిక ముగా కృషిచేయవలసి యున్నది. జంతుజాల మంతయు, చెడుగాలులు వీచుతరుణములో నెమోనియా (ఊపిరితిత్తుల వాపు) జాడ్యమునకు గురి యగును. అల్పజంతువులు చికిత్స చేయబడక పూర్వమే మృతి జెందును. సల్ఫానమైడులు (sulphanamides), ఆంటిబయటిక్సు (antibiotics) ప్రయోగము వలన ఈరోగము నివారణ మగును.

పశువులలోను, గొట్టెలు, మేకలలోను పొదుగువాపు (Mastitis) విరివిగా గోచరించును. ఇట్టి జాడ్యముల వలన సంసారులకు ఆర్థికముగ నష్టముగలుగుట యధార్థ మైన విషయము. ప్రారంభదశలో ఈ పొదుగు వాపును ఆంటీబయటిక్సు సహాయముతో నివారించనిచో, పొదుగు శాశ్వతముగా నిరుపయోగమై చెడిపోవును. రోగగ్రస్త మైన అట్టి పొదుగునుండి తీసినపాలను త్రాగినచో, గొంతు వ్రణములును, క్షయరోగములుకూడా ప్రాప్తించును.

ప్రేగు సంబంధమైన రోగములవలన, గుఱ్ఱములకును, గాడిదలకును తీవ్రమైన శూలనొప్పి (colic) జనించును. వి రేచనము కావించుట చేతను, ఔషధములిచ్చుట చేతను. ఈ బాధనుండి వాటికి విముక్తి కలిగించవచ్చును. శ్రమించి పనిచేయు జంతువులకు ఏర్పడు కుంటితనమును నివా రించుట యొక సమస్యగా పరిణమించినది. ఈ కుంటితనము అనేక కారణములచే సంభవించుచున్నది. ఈ రోగ కారణ ములను నిపుణులైన వై ద్యులు నిర్ణ యింపవలసియున్నది. సాధారణముగా ఇది కౌంటర్ ఇర్రిటేషను (counter- irritation) వలన నివారణ మగును.

కుక్కలు అజీర్ణరోగమునకు గురియగును. వీటికి చికిత్స చేయ వీలగును. కోళ్ళయొక్క గొంతు క్రింది భాగము విస్తరించుటచే, (enlargement) ఒక్కొక్కప్పుడు గింజలు తిను సమయమున అవి గొంతుకకు అడ్డుపడి ఊపిరియాడక బాధపడును. పక్షులుగూడ అట్టి సందర్భమున అటునిటు కొట్టుకొనును. అడ్డుపడిన గింజలను శస్త్రచికిత్సచే లాగి వైచి వాటి బాధను బాపవచ్చును. ఒక్కొక్క తరుణ మున గ్రుడ్లు పెట్టునపుడు అవి అతుకుకొనును. ఆ ప్రదేశ మున గ్లిజరిన్ వంటి జిగురు పదార్థమును ప్రయోగించినచో గ్రుడ్డు సులభముగ బయటకు వచ్చివేయును. ఆహార కార ణము వలనను, విషపునీరు, క్రిమికీటకాది పరాన్న జీవుల వలనను, అన్నిజాతుల జంతువులలో సామాన్యముగా నీళ్ళ వి రేచనములు (diarrhoea) జిగటవి రేచనములు (dysen- tery) సంభవించును. క్రమబద్ధమైన ఆహారము వలనను, సల్ఫాస్ (sulfas), ఆంటీబయటిక్స్ (anti-biotics), క్రిమి సంహారకౌషధముల వలనను ఇట్టి రోగములను నివారణ చేయవచ్చును. రోగ

క్రిమి, విషపునీటి రోగములు (Bacterial of Viral diseases):—పైన పేర్కొనిన సాధారణ జాడ్యము లే క్రిమి కాక, జంతువులు కొన్ని నిర్ణీతకాలములలో ములకును (bacterial) విషపునీటి (Viral) రోగము లకును గురియగును. దాదాపు క్రిమిసంబంధ మైన జాడ్యము లన్నియు సల్ఫాస్, ఆంటిబయటిక్స్ ఔషధములను ప్రయోగించుటవలన నివారణమగును. కాని విషపునీటి రోగములలో ( Viral diseases) ఏదియును ఔషధముల వలన నివారణ కాజాలదు. టీకాలు పొడిపించుట వలనను, ఆంటిసీరా (antisera) ను ప్రయోగించుటవలనను పెక్కు రోగములు చికిత్సచే లొంగుట కవకాశముగలదు.

ఒకసారి టీ కాలుపొడుచుట వలననే జీవితములో ఎన్న టికిని జంతువులకు రిండర్ పెస్ట్ (rinderpest) అను అంటు వ్యాధి సోకకుండునట్లు రక్షణచర్యలు తీసికొన వచ్చును. ప్రతి సంవత్సరము తొలకరి వర్షములు ప్రారంభమగుటకు పూర్వమే బ్లాక్ క్వార్టర్ (Blackquarter), హెమ రాజిక్ సెప్టిసీమియా (hemorrhagic septicemia) అను రోగములను జంతువులకు టీకాలు వేయుటవలన నివారింప విధములయిన టీకాలు సాధ్యమగును. ఈ మూడు జంతువులను అంటురోగములనుండి కాపాడగలుగును.

స్ట్రాంగిల్సు (Strangles), ఫార్సియా (Farcia) అను రోగములనుండి గుఱ్ఱములను రక్షించుటకై ప్రతి సంవత్స రమును వాటికి టీకాలు పొడిపించవలెను. ఇటీవల ఒక విధ మగు ఆఫ్రికా గుఱ్ఱపుజాడ్యములు అంటురోగ రూపములో భారత దేశమున పలు ప్రాంతములందు తలయెత్తినట్లు