పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/473

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గృహజంతువులు, పెంపుడు జంతువులు 424 + సంగ్రహ ఆంధ్ర

గుచో, పశువై ద్యుని పిలిపింపవలెను. అట్టి సమయమున తెలిసీ తెలియని వైద్యము చేయుట తరచుగా హానిక ర మగును.

ప్రసవానంతరము మూడు, నాలుగు దినములవరకు పశువులకు తేలిక యైన ఆహార మియ్యవలెను. లేనిచో, ఒకొక్కప్పుడు శ్రమచేయు సమయములో గర్భాశయము వెలుపలికి పొడుచుకొనివచ్చును. ఏ కారణముచేత నై నను అట్లు వెలికివచ్చిన యెడల, దానిని వెంటనే సరిచేయ వలెను. లేనిచో గర్భాశయము తిరుగులేని తీవ్ర ప్రమాద మునకు గురియై,/ ప్రాణనష్టముగూడ సంభవింపవచ్చును. పాలిచ్చు పశువులకు పైన పేర్కొనిన అదనపు ఆహారము నియ్యవలెను. encarted .6%

దూడల రక్షణము : క్రొత్తగా పుట్టిన దూడల యొక్క ముక్కు రంధ్రములు రసితో నిండియుండి ఊపిరి యాడక బాధ పడుచుండును. పుట్టినతోడనే ముక్కులు పిండి. రసిని లాగి వేయవలెను. అనంతరము వాటి శరీరములను గో నెసంచితోగాని లేక వస్త్రముతోగాని తడి ఆరునట్లుగా తుడువవలెను. పుట్టిన వెంటనే దూడ తల్లి యొద్ద జున్ను త్రాగునట్లు సంభవించు బాలారిష్ట దోషములకు జున్నుపాలు విరుగు పాలు డుగా పనిచేయును. చేయుట అవసరము. సాధారణముగా పాలే

పుట్టిన కొలది మాసములవరకు దూడలకు ముఖ్యాహారముగ నుండవలెను. తరువాత అవి ఇతర పదార్థములు తినగల్గును. గురు

మొదటి ఒకటి, రెండు దినములవరకు కోడిపిల్ల లకు ఆహారమే అవసర ముండదు. తరువాత అవి బియ్యపు నూకలను, కాయకూరలను తినగల్గును.

సాధారణ రోగములు : అధిక సంఖ్యాకములైన జంతు వులకు ముఖ్యముగా అజీర్ణము, నులిపురుగుల బాధ, గాయములు సంభవించును. కాగా సూక్ష్మ విష క్రిముల (bacteria) వలనను, విషపునీరు (virus) వలనను కొన్ని కొన్ని ప్రత్యేకములై న జాడ్యములు వెంటాడును. కొన్ని జాతుల జంతువులను పట్టి బాధించు రోగములు చిత్ర విచిత్రములై నవి. ఉదాహరణమునకు, గుఱ్ఱములయందు కుంటితనము, ఆవులయందు స్తనపాకము (mastitis= పొదుగు వాపు) మున్నగునవి. ఉదయం ఉశివ్వ

ఒక్కొక్కప్పుడు పశువులు, గొట్టెలు, మేకలు అమి తముగా ఆహారమును తినుటచే, జీర్ణించుకొని సుఖముగా మలమును విసర్జింపజాలక యుండును. అట్టి సమయములో కృత్రిమముగా విరేచ నౌషధ మియ్యవలెను. ఒక్కొక్క సమయములో కొన్ని పదార్థములు గర్భములో పులిసి పోయి విషపూరిత మైన వాయువును విపరీతముగా సృష్టిం చును. ఇట్టి వాయువు బయల్వెడలజాలక పశువులకు తీవ్రమైనబాధ కల్గించును. ఇందువలన, విష వాయువు గర్భములో జీర్ణించి ఊపిరి సలుపక ప్రాణోపద్రవము కూడ సంభవింపవచ్చును. కర్పూర తైలము (turpen- ఈ బాధ ను tine), కార్బలి కామ్లము (carbolic acid). కొంతవరకు నివారింపగలవు.

రాయలసీమవంటి కొన్ని ప్రాంతములలో భూమి యందు అధిక మైన వారపదార్థము (calcium) లుండుట చే, జంతువుల మూత్రకోశమునందు సన్నని రాళ్లు ఏర్పడును. వరిగడ్డి తినుటచే ఇట్టిరోగములు ప్రకోపించును. శస్త్ర వైద్యముచే ఇవి నివారింపబడగలవు.

భారతదేశము నందలి పశువులకు మాంసకృత్తులు (proteins) పోషకపదార్థములు (Vitamin A) గల ఆహారములు లేక ఆరోగ్యమున కుంటుపడియున్నవి. మాంసకృత్తుల కొరత, చాలినన్ని పాలు లేకపోవుటచే సంభవించును. ఇందువలన కుక్క పిల్ల లకు బానకడుపు ఏర్పడును. ఈ బానకడుపు చికిత్సకు లొంగక తరచుగా మరణమునకు దారితీయును. ఇతర దేశములలో జంతు రోగములు భాస్వరము (phosphorus), దారము (calcium) తామ్రము, (copper) మణిశిల (cobalt) వంటి లోహపదార్థముల కొరతవలన సంభవించుచున్నవని తెలియుచున్నది. బలవర్థకాహారములు లేమిచే జనించు జాడ్యములను అట్టి పదార్థములచే పూరించి నివారణ చేయవచ్చును. ఆ తండ

పెక్కు రకములయిన పురుగులు (parasites) జంతు వుల నాశ్రయించుకొని జీవించుటవలన, అనేకము లై న జంతుజాతులు వర్దిల్ల లేక పోవుచున్నవి. ఈ పురుగులవలన వ్యవసాయదారునకు గూడ చాల నష్టము సంభవించును. ఒక్కొక్కప్పుడు ఈ పురుగులు ప్రాణాపాయముకూడ కలుగ జేయును. రక్తమునం దిమిడియుండు "కొన్ని