పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/471

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గృహజంతువులు, 'పెంపుడుజంతువులు సంగ్రహ ఆంధ్ర


ఈ పెంపుడు జంతువుల ఉత్ప త్తి విషయములో 'జాతి' (breed) ప్రధాన మైనట్టి, నిశ్చితమైనట్టి పాత్ర వహిం చును. సరియైన ఆహారము నొసగి, సమర్ధవంతముగ వాటిని పెంచి పోషించిననే గాని, వాటి ఉత్పత్తి పాట వము శ క్తి మంతము కాజాలదు. పెక్కు మేలిరకములకు చెందిన పెంపుడుజంతువుల ఉనికి కొన్ని నిర్ణీత ప్రాంతము లకే పరిమితమై యున్నది. అట్టి నిర్ణీత ప్రాంతముల యందు పెంచుటవలననే, వాటి పాటవము అభివృద్ధి నొందగలదు. దాదాపు విస్పష్టమైన పన్నెండు జాతులకు చెందిన భారతీయ జంతుసంతతి ప్రముఖముగ పేర్కొన బడుచున్నది. పని చేయుటకై నను లేక పాలనిచ్చుట కై నను పనికివచ్చు మేలిజాతి జంతువులను వాటి జన్మస్థలము నుండియే యేరుకొని తేవలయును. అచ్చటి జంతువుల యందు శుద్ద రక్తము హెచ్చు శాతములో నుండగలదు. దానికి తోడుగా, ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రముల యందును, ఇట్టి జంతువ్యాపారము చేయువారి యొద్దను సిసలైన శుద్ధజాతి జంతువులు లభ్యము కాగలవు. గుఱ్ఱము లకు సంబంధించిన ఇట్టి సమాచారము 'టర్ఎ బ్బుల' | యందు దొరకగలదు. అండోత్పత్తికి గాని, మాంసోత్ప _త్తికిగాని ఎల్లప్పుడును సిసలైన మేలుజాతి కోళ్ళనే ఎన్నుకొనవలెను. ఇవిగూడ ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రము లందును, కొందరు ఇతర వ్యక్తులవద్దను లభించును.

ఆధునిక కాలమున ప్రభుత్వ కేంద్రములయందు ఆవు లకును, గుఱ్ఱములకును, గొజ్జెలకును, మేకలకును మేలి జాతి జంతువులయొక్క శుక్ల ములతో ఉచితముగ కృత్రిమ గర్భధారణము బహుళముగా గావింపబడుచున్నది. ఉన్నత పశుసంపదాభివృద్ధికి ఇట్టి అవకాశములను వినియో గించుకొనవలసి యున్నది.

గృహవసతి : ఎట్టి ఆచ్ఛాదనముతో నిర్మించిన శాఖల యందైనను వివిధములైన గృహజంతువులను ఉంచ వచ్చును. ప్రధానముగా యజమానియొక్క ఆర్థిక పరిస్థితి ననుసరించి, మానవులకు వలెనే ఈ జంతువులకును వాస యోగ్యమైన ఆశ్రయము నేర్పరుప దగును. బలమైన గాడ్పులు వీచు ప్రదేశములలో ఈ శాలలకు గోడలు అవసర మగును. పాదములు దిగబడకుండునట్లును, జారు టకు వీలులేనట్లును నేల భాగమును రాతితోగాని, సిమెంటుతోగాని బలిష్ఠముగా నిర్మించవలెను. ఇట్లు చేసినచో పశువులశాల పరిశుభ్రముగ నుండగలదు. ప్రత్యేక ముగా అమర్చిన తొట్టెలయందు వీటికి ఆహారము నొసగెదరు.

కోళ్ళను వృక్షములుగల పశువుల దొడ్డిలో నుంచి, చుట్టును ఇనుపతీగచే అల్లికను నిర్మింపవలెను. ఆ ప్రాంత మంతయు నేలపై సున్నపు నీటిని చిలుకరించవలెను. గ్రుడ్లు పెట్టుటకై చిన్నచిన్న పేటికల నేర్పరుపవలెను. నడుమనడుమ కోళ్ళను ఇంటిగదులయందుగూడ నుంచ వచ్చును.

ఈ జంతువులకు సమీపముననే ఎల్ల వేళలయందును నీరు ఉంచవలెను. లేదా, దినమునకు అధమము సిద్ధముగా నాలుగు పర్యాయములయినను వాటికి దాహ మార్ప వలెను. ఒంటెవిషయములో ఈ నియమము అవసర ముండదు. ఈ జంతువునకైనను అవకాశ మున్నపు డెల్ల నీటిని అందించుచునే ఉండవలెను.

ఇతర జంతువులకంటే గేదెలకు, దున్నలకు భిన్నమగు లక్షణమొకటి కలదు. ఈ రెండుజాతుల జంతువులును ఉష్ణప్రాధాన్య లక్షణముగలవి. ఇవి త్వరగా వాటి శరీర ములనుండి ఉష్ణమును పోగొట్టుకొనజాలవు. అందుల కై ఇవి బురదగుంటలయందును, చెరువులయందును, కాలువల యందును వాటి శరీరమును శీతలమొనర్చుకొనుట కై తనివితీరునట్లుగా దీర్ఘ కాలము పడియుండును. సమాన

గృహజంతువుల పరిపోషణమునకై తమ తమ ఆర్థిక పరిస్థితికి తగినట్లు సౌకర్యముల నొనగూర్చుచుందురు. పెంపుడు జంతువుల విషయమున అట్లుగాక, పసిబిడ్డల రక్షణమునకు గైకొను శ్రద్ధాసక్తులే వాటియెడ లగూడ మనము చూ పెదము; అట్టి గారాబమే వాటియెడలకూడ చూ పెదము . పసిబిడ్డలకువలెనే వాటికిగూడ స్వేచ్ఛ నొనగెదము. సామాన్యముగ కుక్కలు, పిల్లుల కొరకు - ప్రత్యేకముగా పరుపులు కుట్టించి బెట్టుటయో, లేక మనప్రక్కలలో నే అవిపడుకొనుటయో జరుగుచుండును. సీమకుందేళ్లు, సీమపందికొక్కులు కొయ్య పెట్టెలయందును, గడ్డిపరుపుల మీదను పండుకొనును. కొన్ని అసాధారణమైన పెంపుడు జంతువుల నివాస మున కై, వాటి సహజగృహము (natural abodes) లను బోలు ఆశ్రయములు నిర్మింపబడును.. పరుండ