ఈ పుట అచ్చుదిద్దబడ్డది
విజ్ఞానకోశము - 3
గుహావాస్తువు
చిత్రము - 107
పటము - 2
భజ—బౌద్దగుహాలయము
కూడ చూపబడినవి. విహారములనునవి వాసస్థానములు. బొంబాయిరాష్ట్రములోని భజ, బెడ్సా, కార్లీ అను తావు లందు గల గుహలలో దారుశిల్పము అధికముగా కన నగును. 'సోనీభండార్ ' అను గుహ జీర్ణావస్థలో నున్నది. దానియొక్క పైకప్పు భాగము నెఱ్ఱెలు విచ్చియున్నది. కాని బల్లలు అమర్పబడిన కంతలుమాత్రము నేటికిని కనిపించుచునే యున్నవి. ఆ గుహ పొడవు 22 అడుగులు, వెడల్పు 17 అడుగులు.
'రాజగృహ'కు ఈశాన్యదిశగా మూడుమైళ్ళ దూరమున 'గృధ్రకూటము' అను నొక కొండకలదు. అచ్చట కొన్ని గుహలు కలవు. అవి అంత నయనాకర్షకములు కావు. కాని అందు బుద్ధభగవానుడు తన సహచరుడయిన ఆనందునితో నివసించెనని తెలియుచున్నది. ఈ గుహా సముదాయములో 'సీతామర్హి' అను మరియొక మిక్కిలి పురాతనమయిన గుహయున్నది. ఇది దీర్ఘ చతురస్రాకారమున 15 అ. 9 అం. పొడవును, 11 అ. 3 అం.
411