విజ్ఞానకోశము - 3
గుహావాస్తువు
కొనును. ఐరోపాలో క్రైస్తవులు నిర్మించిన మహోన్నత దేవమందిరములును, ఉత్తరభారతమున తాజమహలును, కుతుబ్‌మీనారును, గులుంద్ దర్వాజాయును, దక్షిణభారతమునగల పెక్కుగోపురములును. కేవలము ఆశ్రయస్థానములుగా నిర్మింపబడిన కట్టడములు కావు. వీటిని నిర్మించినప్పుడు మానవుడు ఆనాడు ఉన్నతమయిన నాగరకతా దశయందున్న వాడని మాత్రము మనమంగీకరింతుము.
కేవలము గుహను నివాసముకొరకే ఏర్పరచుకొనిన ఆదిమ మానవునకు వాస్తుశిల్పదృష్టి ఎట్లుండగలదు ? ప్రాథమిక దశయందున్నప్పుడు మానవునకు గుహా వాసమే శరణ్యమయ్యెను. ఆతని ప్రకృతిలో కళాత్మక చైతన్య బీజములు సహజముగా నిమిడియుండెను. కాని అవి కళాబీజములుగా గుర్తింపదగినంత స్ఫుటముగా అంకురించి యుండలేదు. భారతదేశమునగల ప్రఖ్యాతము లయిన గుహలయొక్క చరిత్రపు జాడలను పరిశీలించినచో, వాటియందు పొడసూపు అద్భుతమయిన వాస్తుశిల్ప లాలిత్యము, మనలను ఆశ్చర్యచకితుల నొనర్చును.
భారతదేశమునందు మానవుడు ప్రాథమిక దశలను దాటి ప్రగతితో, వివేకమానవదశను పొందినప్పుడు ఆతడు భగవంతుని ధ్యానించుకొనుటకై పిచ్చిపోకడలు పోవు జనసమూహపు వ్యర్థ కలహ వాతావరణమునకు దూరముగానుండు లాగున, ప్రశాంత వాతావరణముతో కూడిన ప్రదేశమును సంపాదించుకొనుట యందు ఉత్సుకుడయ్యెను. ప్రస్తరములను, బండరాళ్ళను, పర్వతములను జీవచైతన్యవంతములుగా నుండునట్లు గుహలుగా తొలుచుటలో మరియొక యుద్దేశము కూడ కలదు. అది నిర్మాణములను దృఢమైనవిగను, బ్రహ్మాండ మయినవిగను చేయు తలంపే. అన్యమతముల స్పర్ధనుండి దూరముగ నుండగోరుట కూడ గుహ నిర్మాణపు ఉద్దేశములలో మరియొకటియై యున్నది.
అయితే స్థపతియొక్క కళాహృదయము వాటిని అత్యంత రమణీయములుగా నొనర్చెను. దీనినిబట్టి కేవలము ఆశ్రయాన్వేషణమే (ప్రధాన) లక్ష్యము కాదని తెలియగలదు. ఇట్లే పర్వత గుహలకును, వాస్తు శిల్పమునకును పరస్పర సహసంబంధము ఏర్పడెను. కొన్ని గుహలయందు విశాలములైన పడసాలలు, బ్రహ్మాండ మయిన స్తంభములు, స్తంభావళులు, వరండాలు, గ్యాలరీలు, ద్వారబంధములపైని బల్లరాళ్ళు అబాక్యూసెస్ (abacuses), తోరణములు (arches). గోడలయందలి గూళ్ళు, లోకప్పులు, మెట్లు, శిఖరములు, మూర్తి నిర్మాణములు, చిత్రపటములు, కుడ్యచిత్రములు రూపొందింప బడినవి. అవన్నియు ఆనాటి శిల్పికి గల రమ్యమయిన శిల్పకళాచాతురికి నిదర్శనములు. గుహలకు దృఢతరమయిన పునాదులు సహజముగా నుండెను. అందుచేత వాస్తుశిల్పికి దృఢతరమయిన పునాదులను గూర్చి ఆలోచింపవలసిన అవసరమే లేకుండెను.
ఈ గుహా నిర్మాణములలో గోచరించు పెక్కు వివరములను బట్టి స్థపతులు కొయ్యతో మలచబడిన నమోనాలను తమ ముందుంచుకొని వాటి ననుసరించి గుహలను నిర్మించెడివారని కొందరు కళాభిజ్ఞులు విశ్వసించుచున్నారు. బీహారులో బార్హూత్‌వద్ద నున్న లోమకఋషి గుహల యొక్కయు, బొంబాయి నగరములో భజ వద్దనున్న గుహ యొక్కయు పురోభాగములు ఈ అంశమును స్పష్టముగా సూచించుచున్నవి. ఈ గుహలను పెక్కు విధముల వర్గీకరింపవచ్చును. కాని ఆ యా స్థానములను బట్టి వాటిని వర్ణించి వర్గీకరించుటయే ఉత్తమమార్గము. బౌద్ధమత గుహలు. జైనమత గుహలు, బ్రాహ్మణమత గుహలు అనునవి వర్గీకరణమున మరికొన్ని భేదనిరూపకాంశములై యున్నవి.
కాని వాస్తు శిల్ప దృష్టిచే, ఇట్టి విభాగాంశములకు ప్రాధాన్యములేదు. సాధారణముగా మందిరనిర్మాణము అడుగుభాగము నుండి ఆరంభమయి శిఖరము (పై భాగము) వరకు కొనసాగును. కాని గుహా వాస్తువునందు నిర్మాణము అడ్డముగనో లేక కైలాస గుహలందు వలె పై నుండి అధోముఖముగనో నిర్మాణ ప్రగతి జరుగును.
బౌద్ధమతము ఉత్తర భారతమున గల మగధ నుండి బయలుదేరెను. కావున ఆదిమమైన గుహలు ఉత్తర భారతదేశమున బుద్ధభగవానుని జన్మస్థలమునకు సమీపముననే కలవు .
బార్హూత్ గుహలు 'గయ' నగరమునకు ఉత్తరముగా 16 మైళ్ల దూరమున 'ఫల్గు' నదీ తీరమునకు ఎడమ వైపున
409