గుహావాస్తువు
సంగ్రహ ఆంధ్ర
జర్మన్ సైనికాధికారులు విచారపడిరట! రెండవ ప్రపంచ సంగ్రామానంతరము సోవియట్ ప్రభుత్వము తన ఆశ్వికులను 50,000 సంఖ్యాకులనుగా అభివృద్ధిచేసి, వారి పాటవ శక్తినిగూడ సమగ్రముగను, క్రమానుగతముగను పెంపుచేసినదని తెలియుచున్నది.
టాంకుదళములకును, ఇతర యాంత్రిక సైనిక నివహములకును ఆశ్వికదళములు బలీయములైన అనుబంధములుగా పరిగణింపబడుచున్నవి. ప్రాదేశిక, వాతావరణాది స్థితిగతులనుబట్టియు, లెక్కించి అంచనా కట్టుటకును (logistics) బట్టియు, ఇతర యాంత్రిక అంగములకు అసాధ్యమగు కార్యకలాపములయందు ఆశ్వికదళములు ఉపయోగింపబడుచున్నవి. టాంకులు అతిస్వల్ప సంఖ్యలో మాత్రమే ఉపయోగపడు వానకాలమందు ఆశ్వికదళములు ఎంతయు ప్రయోజనము చేకూర్చును.
పై అంశములనుబట్టి ఆశ్వికదళముల యుపయోగము ఈ యాంత్రిక యుగములోకూడ కలదని స్పష్టమగు చున్నది. ఆశ్విక యుద్ధనిబంధనములను ప్రస్తుతకాలమునకు అనుగుణముగా నిబంధించి, ఆశ్వికదళముల శక్తి సామర్థ్యములను పెంపుచేసినచో, అశ్వము, ఆశ్వికుడు, ఆశ్వికదళము యుద్ధశాస్త్రము నందును సమరాంగణము నందును ప్రముఖపాత్ర వహించు ననుటకు సందేహము లేదు.
ప్ర. రా. సు.
గుహావాస్తువు (Cave Architecture) :
మానవుడు జీవశాస్త్రానుసారము కోతిగా, రాతియుగమునకు చెందిన ఆదిమానవుడుగా-ఇట్టి సోపానములనుండి క్రమపరిణామము చెంది భూమిపై సంచరింప మొదలిడిన పిదప, తీవ్రమయిన ఎండనుండియు, చలినుండియు, వాన నుండియు రక్షణము పొందుటకై ఆశ్రయముయొక్క అవసరమును లెస్సగా గ్రహించి యుండవచ్చును. రాత్రి యందు ఆతడు విశ్రమించునపుడు సైతము ఆ నివాస మతనికి రక్షణ మొసగవలసియుండెను. ఇట్టి ప్రయోజనముల నన్నిటిని ఆనాడు (పర్వత) గుహలు మాత్రమే చేకూర్ప గలిగెడివి. పర్వతము లుత్పన్నమగునపుడే గుహలు సహజముగ ఏర్పడియున్నవి. ఈ గుహాశ్రయములు మానవుని తినుబండారము వానవలన చెడిపోకుండ ఆతనికి తోడ్పడియుండవలెను. పిదప మానవుడు తన గుహాశ్రయమును పరులకు చేరరానిదిగాను, తనకును, తన స్నేహితులకును చేరదగినదిగాను చేయ నుద్దేశించి యుండెను. ఇట్టి ప్రయోజనముల నన్నిటిని చేకూర్పగల ఆశ్రయమే గృహ మనబడును.
ఆదిమానవుడు సాంస్కృతిక నిశ్రేణిని ఎక్కుటకు మొదలిడిన కొలది ఆతనికి ఈ సహజములయిన గుహా శ్రయముల విషయమున సంతృప్తి కలుగదయ్యెను. తన జాతి అభివృద్ధి అయినకొలది మానవుడు కొండలను త్రవ్వి గుహలను నిర్మింపసాగెను. మానవుని విశిష్టలక్షణమయిన హేతుదృష్టి ఆతనియందు కళాత్మకమయిన చైతన్యమును అవిర్భవింపజేసెను. పూర్వ చారిత్రకయుగమునకు చెందిన గుహలలోని వర్ణచిత్రములను పరిశీలించినచో వర్ణ, రేఖ, రూప, ప్రమాణ, రీతుల విశిష్ట సౌందర్యమును మానవుడు గుర్తించినట్లు తెలియగలదు. అనంతకాలమున ఆతడు ఆ చిత్రములయందు గతులను, భావజాలమును చేర్చెను. ఇట్లు మానవుడు క్రమముగా కళాప్రియుడుగా పరిణతి నొందెను.
లలితకళలలో వాస్తుశాస్త్ర మొకటియై యున్నది. వాస్తువిద్య మానవునియందలి భావప్రేరితములైన అంతఃకరణ ప్రవృత్తులను ఉద్దీపింపజేసి రసమయమొనర్చును. వాస్తుశాస్త్రము సర్వ కళానియమబద్ధమై యున్నది. ప్రేక్షకుని భావనాపటిమను హత్తుకొనిననే తప్ప గడ్డితో గాని, చెట్ల కొమ్మలతోగాని, అడుసుతోగాని, రాతితో గాని, సున్నము, సిమెంటు, కలప, ఇనుము మున్నగు వాటితోగాని ఏర్పడిన నివాసగృహము లేక, నిర్మాణము, కళాక్షేత్రముయొక్క పరిధిలో చేరజాలదు.
గృహమును నిర్మించుకొనుటయందలి ఉద్దేశము శీత వాతాతప విశేషముల బారినుండియు, చోరాది దౌర్జన్య పరులనుండియు ఆత్మరక్షణము గావించుకొనుటయే యై యున్నది. అందుచే నవి వాస్తుశాస్త్ర కళాసంపదకు చెందినవిగా నుండనేరవు. ఒకానొక కట్టడము ఉద్దిష్టము లయిన ప్రయోజన సిద్ధ్యర్థము నిర్మితమయ్యును, సౌందర్య విలసితమై, శోభా సంకలితమై, వైభవ సంపన్నమై బృహదాకార ఘటితమై 'ఓహో!' అనిపించుకొనగల కట్టడములు మాత్రమే వాస్తు కళాఖండము లనిపించు
408