పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/452

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 వాగ్గేయ కారుడు గురుమూర్తి శాస్త్రి. ఇతడు అజరామర కీర్తి విరాజితుడు. గుఱ్ఱపు దళము : తి. న. చ. వేం. నా. 99 యుద్ధశాస్త్రమునకు సంబంధించిన చరిత్రను పరిశీలించి నచో యుద్ధ ప్రక్రియలో మొట్టమొదటిసారిగా గుఱ్ఱపు దళమును క్రీ. పూ. 1288 లో ఈజిప్టునకును “హిట్టీస్ ’ జాతివారికిని నడుమ జరిగిన 'కోడెష్ పోరాటమందు ఉపయోగించినట్లు తెలియుచున్నది. ఈ యుద్ధ మునకు చెందిన లిఖిత పత్రములనుబట్టి పదాతులుగా, రథికులుగా, విలు కాండ్రుగా, ఆశ్వికులుగా ఈజిప్టు సైనికనివహములు విభక్తములై యుండినట్లును, వారు ఆశ్వికదళ యుద్ధ పటిమను అత్యున్నతస్థాయికి కొంపోయినట్లును బోధపడు చున్నది. గ్రీకులకంటే, పర్షియనులకంటే, వేల సంవత్స రములకు పూర్వమే ఈజిప్షియనులు ఆశ్వికదళములను వాడుకలోనికి తెచ్చియున్నను, యుద్ధశాఖా పరిపాలన విధానమందును, గుఱ్ఱపు దళములను పార్శ్వ స్థానములు నుండి శత్రువులపై లంఘింపజేయు వ్యూహములందును, శత్రువును భ్రమింప జేయుటయందును, తదితర విషయ ములలోను గ్రీకులు ఈజిప్షియనులకంటే మిన్నగా వ్యవహ రించినట్లు ధ్రువపడుచున్నది. గ్రీకులు క్రీ. పూ. 500 సం. నాటికి రథ, తురగ సమూహములను యుద్ధమున కై ఆయత్తము చేసినట్లును, అత్యున్నతమైన చలనశక్తితో, నై పుణ్యముతో, నైతిక బలముతో, పర్షియను సైన్యము లను పెక్కు యుద్ధములలో ఓడించినట్లును తెలియు చున్నది. కాలక్రమమున ఆశ్విక యుద్ధ విధానమును గ్రీకుల నుండి రోమనులు అభ్యసించి అనుభవము గడించిరి. నై పూర్వము ఆశ్వికులు, పదాతులు అను ఇరు తరగతుల పై నికులు మాత్రమే యుండెడివారు. అశ్వికులు ఆసియాఖండములో జరిగిన యుద్ధములలోను, పదాతులు ఐరోపా యుద్ధములలోను పాల్గొనిరి. దక్షిణ ఐరోపా ఖండములో యుద్ధాశ్వముల పెంప కము చాల తక్కువ స్థాయియం దుండెడిది. అందువలన రోమక గ్రీసు దేశముల యొక్క ఆశ్వికదళములు బలహీన ములై యుండెను. ఆ కాలమున యుద్ధఫలితములు సైని కుల సంఖ్యాబలమును బట్టిగాని, అస్త్రశస్త్రముల పాటవ 403 గుఱపు దళము ස మును బట్టిగాని, సుశిక్షణమును బట్టిగాని నిర్ణయింప డెడివి. కాగా, ఒక ఆశ్వికదళము శత్రువుయొక్క ఆశ్వికదళమును ఢీకొన్నపుడు ఫలితము ఇదమిత్థమని నిర్ణయించుట అసాధ్య మయ్యెడిది. గ్రీసుదేశములోని పర్వత ప్రాంత మందలి ఆశ్వికదళము పదాతిదళము ఉక్కడచుటకు శక్తి చాలక యుండెడిది. క్రీ. పూ. 490- 479 నడుమ జరిగిన గ్రీసు - పర్ష్యా యుద్ధమందు ఈ విష యము ప్రత్యకముగ రుజువయ్యెను. కాని ఆసియా మైనరులోని మైదాన ప్రాంతములందు అశ్విక దళములు పదాతిదళములను మట్టు పెట్ట గలుగుచుండెను. ఈ రెండు యుద్ధాంగములకు స్వతస్సిద్ధమైన ప్రత్యేక లక్షణములు కలవు. అందువలన యుద్ధరంగమందు ఒక సేనాంగమందు గల లోపమును మరియొకటి సరిదిద్దగలిగి అవి రెండు అన్యోన్య సహకారముతో శత్రుసైన్యములతో తలపడ ఋ డి. గ్వేదమందు యుద్ధాశ్వముల యొక్కయు, అశ్వ ములు పూన్చిన యుద్ధరథముల యొక్కయు ప్రస్తావన గలదు. కాని ఆశ్వికదళముల ఏర్పాటు, వాటి శిక్షణము కొరకు అశ్వశాలల నిర్మాణము వేద కాలమునకు తరువా తనే జరిగియుండునని పలువురు పండితులు అభిప్రాయ పడుచున్నారు. చారిత్రకముగా మనకు తెలిసినంతవరకు సశాస్త్రీయమైన ఆశ్వికదళముల నిర్మాణము క్రీ. పూ. 12వ శతాబ్దిలో తొలిసారిగా అస్సీరియాలో జరిగిన దనుట వా స్తవముగ కన్పట్టుచున్నది. క్రీ. పూ. 20 వ శతాబ్దములో యుద్ధరథములున్నట్లు ప్రమాణము లున్నవి. కాని అశ్వములు లా గెడి యుద్ధ రథములు వేద కాలమందు న్నపుడు, ఆశ్విక శిక్షణశాలలు గూడ ఆ కాలమందుండి వా యుండవలయును. 99 కనుక, ఆశ్వికశిక్షణ, ఆకారణముగా అశ్వశాలలు వేద కాలపు భారతీయులకు తెలిసియుండుటకు తగిన కారణము లున్నవి. “మిటన్నీ” అను నొక తెగలో భార తీయుల ప్రసక్తి వచ్చియుండెను. “కిక్కులీ" అను పేరు గల ఒక "మిటన్నీ" తెగకు చెందిన యాతడు "హి "హి బ్రైట్” ప్రభువుల ప్రయోజనార్థము అశ్విక శిక్షణమును గురించి యొక గ్రంథమును రచించెను. ఇతని మాతృభాష “హు ల్రైట్”. ఇది 1938 లో ప్రప్రథమముగ ప్రచురింప