పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/449

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గురుత్వాకర్షణము యందున్న ఒక పదార్థము యొక్క చలనమును ప్రతి రోధించుశక్తి). సీసపుకడ్డీ, తుల్య జడత్వముగల యొక గ్లాసుముద్దకు గల ఆకర్షణశక్తినే కచ్చితముగ కలిగి యున్నది. ఐన్స్టన్ ఈ సుప్రసిద్ధమైన అపేక్ష ణాత్మక పేక్షణాత్మక సత్యమును (observational fact) - ఒక పదార్థము యొక్క ఒ కేగుణము ఒక పరిస్థితియందు జడత్వముగా ఆవిష్కృతమగు ననియు, మరియొక పరిస్థితియండు బరువుగా ఆవిష్కృతమగు ననియు అర్థము ధ్వనించు నట్లుగా వివరించెను. గురుత్వాకర్షణశక్తి లేనపుడు త్వరణము (acceleration) తో చలించు నొక ప్రణాళిక కును (system) గురుత్వాకర్షణశక్తి విశ్రాంతియందున్న మరియొక ప్రణాళికను భేదము చూపుట అసంభవమని ఆతడు ఊహించెను. "గురుత్వాకర్షణ - జడత్వముల సమత్వ" సూత్రము నాధారముగ గొని ఐన్ స్టైన్ 'డూర క్రియ' (action at a distance) అను న్యూటన్ సిద్ధాంతమును రద్దుపరచుటకై గురుత్వాకర్షణ సంబంధి క్షేత్రసిద్ధాంతమును (a field theory of gravitation) విశదపరచెను. న్యూటన్-ఐన్ నుల భావముల యందలి భేదము, ఒక్కొక్కప్పుడు ఒక బాలుడు నిమ్నోన్నత మైన భూమిపై గోలిగుండు లాడుకొను సన్ని వేశమును చిత్రిం చుట ద్వారా స్పష్టపడుచున్నది. ఒక ఎత్తయిన కట్టడము యొక్క పై భాగమునుండి చూచువానికి నేలపై నున్న హెచ్చుతగ్గులు కనిపింపవు. కావున అతడు గోలిగుండు సదా నేలపై కొన్ని భాగములవైపు కదలుటను చూచి, గురుత్వాకర్షణశక్తి ఈ దిశలయందు పనిచేయుచున్నదని అనవచ్చును. నేలపై నుండి చూచినవానికి మాత్రము గోలిగుండు యొక్క మార్గము కేవలము నేలయొక్క ఏటవాలు పై ఆధారపడి యున్నదని తెలియగలదు. ఐన్ స్టైన్ నేల పై నుండి చూచువానివలె క్షేత్ర వక్రత యందు గురుత్వాకర్షణమును ఆరోపించును. ఐన్ స్టెన్ సిద్ధాంతము బుధగ్రహముయొక్క చలనమందుగల భేదము నకు హేతువులుచూ పెను. ఈ సిద్దాంతము దీప కిరణము గురుత్వాకర్షక క్షేత్రములో వంకర తిరుగవలెననియు సాంద్రగురుత్వాక ర్షక క్షేత్రములో నుండి వచ్చు వెలుతురు నందలి విచ్ఛిన్న కిరణ రేఖలు (spectranal lines) దీర్ఘ తర తరంగ దైర్ఘ్యము వైపు వంకరగ తిరుగవ లెననియు సంగ్రహ ఆంధ్ర జోస్యము చెప్పెను. ఈ ఫలితములు అత్యల్పపరిమాణము కలవి అగుటచే వాటి ద్వారా రెండవసారి చెప్పిన రెండు విషయములతో ఐన్ స్టెన్ సిద్ధాంతమును సరిచూచుట గుణ సంబంధి స్వభావమే కాగలదు. మాక్ సూత్రము . తదంతరార్థములు: మాక్ అను నాతడు గురుత్వాకర్షణము వలె జడత్వము (inertia) కూడ పదార్థముల మధ్య గల పారస్పరిక క్రియపై ఆధారపడియుండునను అభిప్రాయమును ప్రతిపాదించెను. వారము కొరకు పరిశోధనమున కుపయోగపడు ఒక అణువు తప్ప విశ్వమందలి తక్కిన పదార్థమంతయు నశించినదనుకొనుము. ఈ అణువులో జడత్వము కలదా? లేదా? దానిలో జడత్వమే లేదని మాక్ అభిప్రాయము. అనగా జడత్వము పదార్థము యొక్క సహజ ధర్మముగా మాక్ పరిగణింపడు. విశ్వమందు గల సర్వ పదార్థమును పరిశోధన వస్తువు (test body) తో ఘటిల్లిన అంతర క్రియా ఫలితార్థముగా అతడు భావించును, మాక్ యొక్క ఆలోచనావిధానమును బట్టి ఈ క్రింది ఫలితములు అపేక్షింపబడినవి : 1. భారము గల రాసులు సమీప ప్రదేశమున దొంతు లుగా పెట్టబడినపుడు పదార్థము యొక్క జడత్వము అధికము కావలయును. 2. సమీపమందున్న పదార్థములు త్వరణము నొంది నపుడు పదార్థము త్వరణ శక్తిని అనుభవింపవలయును. వాస్తవమునకు ఆ శక్తి త్వరణమున్న దిశ యందే నడువ వలయును. లి. పరిభ్రమించు ఒక బోలు పదార్థము తనలో నొక కొరియోలిస్ (coriolis) క్షేత్రమును సృష్టింపవ లెను. ఆ క్షేత్రము (పరిభ్రమణార్ధమున) చలించు పదార్థములను వ్యాపారమునకు సంబంధించిన సాధారణ మధ్యారంభి క్షేత్రములను (radial centrifugal fields) వి క్షేపింప జేయును. పై ఫలితములు సాధారణ సాపేక్షత్వ సిద్ధాంతము వలన గూడ లభించును. అవి చాల స్వల్ప పరిణామము గలవి. అందుచేత ఐన్ స్టెన్ వచించినట్లు వాటిని పరిశోధన శాలాప్రయోగముల మూలమున ధ్రువ పరచుటకై యత్నించుట ఆలోచనీయమే కాదు. 400