పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/444

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము _ 8


పంతులుగారి వ్యావహారిక భాషోద్యమమునకు అప్పారావు గారు కుడిభుజమై నిలిచిరి. గిడుగువారి లక్షణములకు అప్పారావుగారి రచనములు లక్ష్యము లయ్యెను.

అప్పారావుగారు ఉపన్యాసకులుగా నుండినప్పుడే 1898 లో క న్యాశుల్కమను నాటకమును, సంఘసంస్కర ణోద్యమమును బలపరచుటకును, తెలుగు భాష నాటక రంగమునకు అనుకూలమైనది కాదు, అను అపోహ నెదు ర్కొనుటకును తాము వ్రాసినట్లుగా చెప్పుకొన్నారు. గిరీశం పాత్ర అప్పారావుగారి సృష్టి. ఆంధ్రదేశ మా పాత్రము నెన్నటికిని మరువజాలదు. ఇతివృత్త స్వీకరణము తన్నిర్వహణము, హాస్యరసపోషణము, పాత్రోన్మీలనము, ఇత్యాద్యంశముల యందు తెలుగు నాటకములలో కన్యా శుల్కము అత్యుత్తమ మైనదని విమర్శకుల అభిప్రాయము. సాంఘిక వాస్తవికత దర్పణమునందువలె య థాత థ ముగా ప్రతిబింబించిన కళాఖండ మిది. కొండు భట్టీయ మనునది కూడ క న్యాశుల్కము వలెనే సామాజి కేతివృత్త మును స్వీకరించి, హాస్యరస ప్రధానముగా రచింపబడిన మరియొక సంపూర్ణ నాటకము. ఈ రెండింటికిని పోలిక లనేకములు గలవు. సంపూర్ణమైనచో విషాదాంతముగా పరిణమించి యుండెడి నాటక మిది. అప్పారావుగారు రచించిన మరియొక అసంపూర్ణ నాటకము బిల్హణీయము. ఇది ప్రాచీన శృంగార కథాసంబంధి యైనను పాత్ర ములు మాత్రము యథార్థ ప్రపంచమునుండి గ్రహింప బడినట్లు పండితుల అభిప్రాయము. అప్పారావుగారి సమ కాలికులైన విజయనగరాస్థాన కవిపండితుల ప్రవృత్తులు, ఈర్ష్యాసూయలు బిల్హా ణీయమున చిత్రింపబడినవని పరిశో ధకులు అభిప్రాయపడిరి. పూర్వ సంస్కృతాంధ్ర బిల్హ ణీయ కథలకన్న అప్పారావుగారి బిల్హణీయకథ భిన్న మును ఉదా త్తమునునై యున్నది. అప్పారావుగారు ఆంగ్లమున చిత్రాంగి నాటకమును రచించినారు. ఆధు నిక కథానికా రచనమున కాద్యు లెవరు?- శ్రీ గురుజాడ వారా? శ్రీ మాడపాటివారా? అనునది పరిశోధింప దగిన విషయము. గురుజాడ వారి డైరీలు, లేఖలు, ఇంగ్లీషు కవిత్వము మున్నగు రచనలను విశాలాంధ్ర ప్రచురణాలయమువారు ఇటీవల ఆరు సంపుటములుగా ప్రచురించినారు. తాము పరిశోధించి వ్రాయదలచిన 395 గురుత్వాకర్షణము పూసపాటి గజపతుల చరిత్ర, విశాఖ చాళుక్యుల చరిత్ర, కళింగ చరిత్ర మున్నగు వాటికి కావలసిన వస్తుజాతమును గురుజాడవారు ప్రోగు చేసిరట ! కాని చరిత్ర రచనము మాత్రము జరగలేదు. ఆధునికాంధ్ర వాఙ్మయాకాశము నకు అరుణోదయముగా భాసిల్లిన శ్రీ గురుజాడ మన జాతికి ప్రాతస్స్మరణీయుడు,

బి. రా.

గురుత్వాకర్షణము (Gravitation) :

ఎట్టి ఆధారము లేని భౌతిక పదార్థము క్రింద పడు నను విషయము అంద రెరిగినదే. అంద రెరిగినదే అయి నను, పదార్థ విజ్ఞానశాస్త్రములో మార్గదర్శకులైన పెక్కురకు ఇదియొక పరిశోధన విషయమై యున్నది. ఇది భౌతిక శాస్త్రాభివృద్ధిలో అత్యంత ప్రముఖ మైన విషయము. రాకెట్లు, స్పుట్ నిక్కులు గల ఈ కాల మందు గూడ ఈ ప్రాథమిక సమస్యకు పరిష్కార మేర్పడి యుండలేదు. గురుత్వాకర్షణ మనునది స్పష్టముగా గుర్తింపబడవలసిన ప్రకృతిశక్తులలో మొట్టమొదటిది యై యున్నను, దాని స్వభావము ఇంతవరకును బోధపడ లేదు. ఒక భౌతిక పదార్థము మరియొక భౌతిక పదార్థ మును ఆకర్షించుటకు గల అసలు కారణమేదియో ఇప్పటికిని మనకు తెలియనే తెలియదు. సర్వసామాన్య గురుత్వాకర్షణ సూత్రమును కని పెట్టిన గౌరవ ప్రతిష్ఠలు న్యూటనుకే దక్కవలసి యున్నను, గతిశాస్త్రమందు (Dynamics) గెలిలియో కావించిన ప్రతిభావంతములై న పరిశోధనములను, కెప్లర్ దీర్ఘకాలము శ్రమచేసి అను మే యించిన (deduced) గ్రహసంబంధ (planeto) చలనము లను గూర్చిన ప్రయోగ సిద్ధసూత్రములను (empirical laws), ఇతడు ఉపయోగించుకొనకున్నచో, ఇతని ప్రయ త్నములు నిష్ఫలములై యుండెడివి. పైన పేర్కొన్న శాస్త్రజ్ఞులకు తాను ఋణపడియున్నట్లు న్యూటన్ అంగీక రించెను. “నేను నా పరిశోధనములో ముందుకు పోగలిగి యుండుటకు కారణము, నేను మహామేధావులగు శా శాస్త్ర జ్ఞుల భుజముల పై నిలచి యుండుటయే" అని అత డొప్పు కొనెను. ఐనప్పటికిని న్యూటన్ భిన్నభిన్న క్షేత్రముల నుండి సంపాదించిన జ్ఞానమును సంశ్లేషణ మొనర్చి ప్రముఖ భావో పేతములైన అట్టి సూత్రములను జయ