పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/437

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుణగ విజయాదిత్యుడు 388 సంగ్రహ ఆంధ్ర

ములో మరణించెను. పాండురంగడు మొట్ట మొదటిసారి వేంగీ సామ్రాజ్యపు దక్షిణ సరిహద్దులలో బోయలతో జరిగిన యుద్ధములలో ప్రముఖపాత్ర వహించి మహా రాజును ఆకర్షించెను. పాండురంగని శక్తి సామర్థ్యములు, స్వామిభక్తి పరాయణత గుర్తించి మహారాజు ఇతనిని దక్షిణసీమకు పాలకునిగా నియమించెను. తరువాత చాల కాలము వరకు పాండురంగని వంశ్యులు ఈ ప్రాంతము లోనే వేంగీ చాళుక్యుల ఉద్యోగులుగా ఉండుచు వచ్చిరి. కందుకూరు ముఖ్యపట్టణ ముగా పాండురంగడు ఈ ప్రాంతమును పాలించుచు తన విజయములకు సూచక ముగా నేటి నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోట ద్వీపమునకు సమీపమున తన పేర పాండురంగము అను గ్రామమును కట్టించెను. ఈ గ్రామములోనే ఒక శివాలయము కూడ కట్టించి అక్కడ తన పేర పాండురంగేశ్వరుని ప్రతిష్ఠిం చెను. అంతటినుండి తన తండ్రివలెనే ఇతడు కూడ గుణగ విజయాదిత్యుడు సాగించిన యుద్ధము లన్నిటిలోను మహా రాజునకు కుడిభుజముగా ఉండెడివాడు. ఈ విధముగ ఆ మహారాజు ఆర్జించిన అనేక విజయములకు ఇతడు కారణము అయ్యెను. కృతజ్ఞతా సూచకముగ మహా రాజు ఇతనికి ద్వితీయ భీభత్సుడను బిరుద మును ప్రసాదించెను.

విజయాదిత్యునకు ఎక్కువగా సహాయపడిన వారిలో అతని ఆశ్రితవర్గములోని వినయడిశర్మ మరియొకడు. ఇతడు కౌశిక గోత్రుడు, ఆపస్తంబ సూత్రుడు, తైత్తి రీయ శాఖాధ్యాయి అయిన తుక్కశర్మకు పౌత్రుడు. దామో దర శర్మకు పుత్రుడు. ఉప్పుటూరు గ్రామవా స్తవ్యుడు. వేద వేదాంగములలోను, రణవిద్యలోను అసమాన పాండి త్యము, ప్రతిభకలవాడు. ఇతడు, గుణగ విజయాదిత్యుడు నొలంబ రాజైన మంగితో చేసిన యుద్ధములో అమూల్య మైన సలహా నిచ్చి మహారాజు యొక్క విజయమునకు కారణ మయ్యెను. ఈ సహాయమునకు తన కృతజ్ఞత వెలిపుచ్చుచు మహారాజు ఇతనికి గుర్ర వాడ విషయములో త్రాండీపఱ్ఱు అను గ్రామమును అగ్రహారముగా ఇచ్చెను.

రాజాదిత్యుడను మరియొక బ్రాహ్మణసేనాని ఈకాల ములో ప్రసిద్ధుడుగా ఉండెడివాడు. ఇతనితండ్రి కుమార మూర్తి తొండమండలములో కాడువెట్టి అను పల్లవరాజు నకు ఆశ్రితుడుగా ఉండుచు అభిప్రాయ భేదము కారణ ముగా ఆ ప్రాంతమును వదలి వేంగీ రాజ్యమునకు వలస వచ్చి, ఉండి అను గ్రామములో స్థిరపడెను. రాజాదిత్యుడు విజయాదిత్యుడు చేసిన అనేక యుద్ధములలో చాల సహాయపడెను. ఈ సహాయమునకు కృతజ్ఞతా తా సూచక ముగ మహారాజు ఇతనికి కాట్లపఱ్ఱు అను గ్రామమును దానము చేసెను.

తన విజయపరంపరలకు, శాంతియుత పరిపాలనకు ప్రఖ్యాతులైన సేనానులు, మేధావంతులయిన అమా త్యులు ముఖ్య కారకులయినప్పటికిని, సచివాయ త్తసిద్ధులని వ్యపదేశ్లో క్తిగా చెప్పబడు మహా రాజులలో విజయాదిత్యుని ఒకనిగా పరిగణించుటకు వీలులేదు స్వయముగా ఇతడు మహాపరాక్రమశాలి, గొప్పసేనాని, దక్షుడైన రాజ్య పాలకుడు. తన పరాక్రమమునకు తన విజయములకు, వై భవ ప్రాభవములకు చిహ్నములుగా మనుజపరాక్రమ, రణరంగశూద్రక, పరచక్ర రామ, నృపతిమార్తాండ, వీర మకరధ్వజ, అరసంక కేసరి, గుణక్కెనల్ల, త్రిపురమర్త్య మహేశ్వర, భువనకందర్ప, సమస్త భువనాశ్రయ మొద లైన బిరుదములను ధరించెను.

పరాక్రమశాలి అయిన గొప్పసేనానిగా, దక్షుడైన పరిపాలకుడుగా మాత్రమేకాక, గుణగ విజయాదిత్యుడు కళాప్రియుడు గాను, విద్యాపోషకుడుగాను కూడ వాసి ను పెక్కు దేవాలయములు ఈ మహారాజు యొక్క కళాప్రియత్వమునకే కాక వేంగీ చాళుక్య యుగమునాటి వాస్తు, శిల్పకళాభివృద్ధికి కూడ చక్కని నిదర్శనములు. వేద వేదాంగములు, పురాణేతిహాస ములు మొదలయిన విద్యలలోను, ఇతర కళలలోను ప్రవీణులు, షట్కర్మనిరతులు అయిన బ్రాహ్మణోత్తము లకు సాతులూరు, ఉరవటూరు మొదలయిన గ్రామము లను అగ్రహారములుగా ఇచ్చి విజ్ఞానాభివృద్ధికి ఎంతో దోహదము చే సెను. విజయాదిత్యుడు ఎక్కువ ధర్మచింతన కలవాడు. దేవాలయములకు, మఠములకు ఎన్నో భూరి దాన ధర్మములు చేసెను. కల్పోక్తములయిన తులాభార దానములు అనేకములు చేసెను.

ఈ విధముగా ఉదాత్తక్షాత్ర మహితుడు, రాజనీతి ప్రవీణుడు. దయార్ద్రహృదయుడు, దానధర్మ పరాయ