పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/433

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుడివాడ. 384 సంగ్రహ ఆంధ్ర

అచ్చటచ్చట గన్పడును. ఇచట ధర్మమే ప్రధానసూత్ర ముగాగల హిందూ, మహమ్మదీయులు గలరు. వీరికి పౌరాణికాచారముల పైననే యెక్కువ నమ్మకము. కావున నే ఆధునిక యుగ ప్రభావము వారిపై ఎక్కువగ పడ లేదు.

ఈ ప్రదేశమున చూడదగు స్థలము లెన్నియో గలవు. భూజనందు నారాయణాలయము శారదాబాగ్, అను నవియు, మాండవీలో 'దేవాదాండీ' అను కోటయు అంజా యందు బేసల్ తోరల్ యొక్క సమాధియు, ముంద్రాలో షాహమురాదు, పీర్ దర్గా మొదలగు నవియు చూడదగి నవి. ఇవియును గాక, జైనతీర్థ స్థలములు గలవు. ఇవి పంచతీర్థములని ప్రసిద్ధి. వీటి పేర్లు మాతానోమడ్, జభౌ, తేరా, నాలయాసుధీర్ అనునవి. ఈ ప్రాంతము ఖనిజ సంపత్తిని గూడ గలిగి యున్నది. ఇందు బొగ్గు, ఇనుము, పెట్రోలియం గనులు గలవు. కావుననే యిచట జనసంఖ్య ఎక్కువైనది.

గుజరాతు, సౌరాష్ట్రము, కఛ్ అను మూడు ప్రదేశ ములు కలిసియే మహా గుజరాతుగా నేర్పడినది. దీనినే గుజరాతు అని కూడ యందురు. ఇప్పుడు ఈ ప్రాంతము ఇతర ప్రాంతములతో సరిసమానమగు సంపత్తును కలుగ జేసికొనుచున్నది. ఇచ్చటి నాగరికత యందు కూడ నూత నత్వ మంకురించినది. ఇచ్చటి ప్రజలు మూఢ నమ్మక ము లను మాని, యితర ప్రాంతములతో సమాన ప్రతిపత్తిని సంస్కృతిని సంపాదించుకొని, సమగ్ర భారత దేశములో తన బాధ్యతలను నిర్వహింపగలదని ఆశింపవచ్చును.

ర. వి.

గుడివాడ :

ఆంధ్ర ప్రదేశమునందలి కృష్ణాజిల్లా నందుగల గుడి వాడ ఒక ప్రసిద్ధనగరము. గుడివాడ యూనియన్ బోర్డు 1937లో పురపాలక వ్యవస్థగా మార్చబడినది. 1958 ఆగస్టు 1 వ తేదీన ఈ పట్టణము ప్రథమశ్రేణికి చెందిన పురపాలక సంఘముగా గుర్తింపబడినది. సంవత్సరమునకు ఈ 'మునిసిపాలిటీ' ఆదాయము సుమారు 6 లక్షల రూపా యలు. సహకార ప్రణాళిక క్రింద ఇటీవల నిర్మింపబడు చున్న 'రాజేంద్రనగర్ ' కాక, మిగిలిన పట్టణమంతయు పూర్వపుపద్ధతిలో కట్టబడిన ఇరుకు సందులతో కూడి యున్నది. ప్రధానమయిన బాటలుమాత్రము విశాల ముగా సిమెంటు చేయబడియున్నవి. తాలూకా కేంద్రమే గాక ఈ నగరము రెవెన్యూ డివిజనుకుగూడ ముఖ్య స్థానము. ఈ డివిజనులో కైకలూరు, గుడివాడ తాలూ కాలు చేరియున్నవి. ఈ నగరము యొక్క జనసంఖ్య 1951 వ లెక్కలనుబట్టి 32,008

చారిత్రక ప్రసిద్ది - శిథిలావశేషములు : తూర్పు చాళు క్యులు వేంగీమండలమును పరిపాలించు రోజులలో, వేంగీ పట్టణమునుండి సముద్రతీరమునకు పోవు వర్తక మార్గ ములో గుడివాడ ఒక కేంద్రముగా నుండెడిది. అంతే గాక, 'కుదుర' రాజ్యపాలకులకు గుడివాడయే రాజ ధానిగా నుండెడిది.

గుడివాడకు పశ్చిమముగా - లాముపాడుదిబ్బ ప్రాంత ములో పూర్వము 99 గుళ్ళు, 99 తటాకములు ఉండెడి వని ఇతిహాసములు చెప్పుచున్నవి. ఈ లామపాడునం దే శాతవాహన రాజులనాటి నాణెములు, రోమక నాణెములు దొరికినవి.

పాతగుడివాడలో 'లంజదిబ్బ' అను పేరుతో వ్యవహ రింపబడు వృత్తాకారముగల దిబ్బఒకటి ఉన్నది. దీనిని కేంద్ర ప్రభుత్వమువారు పురావస్తు ప్రాముఖ్యముగల స్థలముగా ప్రకటించి సంరక్షించుచున్నారు. ఒకప్పుడు ఇక్కడ రాతి పెట్టె ఒకటి దొరికినదనియు, అందులో రత్నములు, బంగారు రేకులు మొదలైనవి యుం డెననియు తెలియుచున్నది. 1870 లో 'బాస్వెల్' అను దొర దీనిని చూచి, దీనికిని అమరావతి దిబ్బకును సన్నిహిత సంబంధ ముండవచ్చునని అభిప్రాయపడెను. 1878 లో 'సీవెల్ ' దొర ఈ దిబ్బను సందర్శించి, ఇక్కడి శిథిలములకు సాంచీస్తూప సామ్యమున్నట్లు పేర్కొనెను. తెలుగు దేశ ములో ఉన్న 'సానిదిబ్బ' 'లంజదిబ్బ' అను స్థలములు పూర్వము బౌద్ధభికురాండ్రుగు స్వామినులకు నివాస ములై ఉండెడిననియు, సంఘములో కట్టుబాటులు సడలి పోయి వారు అవినీతిపరులైన పిమ్మట నిరసన పూర్వక ముగా ప్రజలు ఆప్రదేశములకు ఈ పేర్లు పెట్టినట్లు చారిత్ర కుల అభిప్రాయము. ఇవికూడ అట్టి బౌద్ధస్తూపముల అవశేషములే యనుటలో సందేహము లేదు. ఇక్కడకూడ కొన్ని రోమక నాణెములు దొరకినవి.