పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/432

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము . 3 383 గుజరాతుదేశచరిత్రము

గూర్చి కొంత విచారింతము. 'కఛ్' భారత దేశమునకు పశ్చిమమున నున్నది. ఈ ప్రాంతపు చరిత్ర అతి ప్రాచీన మైనది. ఈజిప్టు దేశ చరిత్ర ఎంతటి ప్రాచీనమైనదో. ఇది కూడ అంతటి ప్రాచీన మైనదే. ప్రాచీన కాలమున “సమో " వంశమను రాజవంశ ముండెను. 'మహేంద్ర' అను రాజుయొక్క పౌత్రుడు 'సమాపత్' అనునాతడు, ఈ పేరునుండియే 'సమో' యను పదము వచ్చినది. ఈ వంశమునకు జెందిన 'లాభాదురారా' అను రాజునకు మానాయి, మోడ్ అను నిరువురు పుత్రులు గలరు. ఈ ప్రాంతమును సంపూర్ణముగా వీరు వశపరచుకొనిరి. 9వ శతాబ్దము వరకు వీరి వంశజులు, ఈ ప్రాంతమును పరిపాలించిరి. క్రీ. శ. 1007 నుండి 1148 వరకు చావడా వంశమునకు జెందిన పదు నెనిమిదిమంది రాజులు ఇచ్చట పరిపాలించిరి. తరువాత విక్రమశకము 16 వ శతాబ్ది మధ్య భాగము వరకు ఈ ప్రాంతమున అశాంతి ప్రబలెను.

క్రీ. శ. 1510 లో 'థెంగార్ ' అనునతడు అశాంతిని రూపుమాపి దానిని శాంతియుత రాజ్యముగా మార్చెను. తరువాత అంజారు, భూజా, మాండవీ వంశజులు పాలిం చిరి. వీరి వంశముల పేర్లతో 1546 సం. లో అంజారు, 1549 సం. లో భూజా, 1580 సం. లో మాండవీ అను పేర్లు గల పట్టణములను నెలకొల్పిరి. ఈ ప్రాంతమును 400 సంవత్సరములలో 15 రాజవంశములు పాలించెను.

ఈ ప్రాంతము 150 సం. లకు పూర్వము భూకంపము వలన చాల నష్టపడెను. ఈ ప్రాంతము సముద్రతీరమున నుండుట చే లఖ్ పత్, కోటేశ్వర, జాభే, మాండవీ, ముంద్రాతుణా, కండలా, భారీరోహర్ అను పేర్లు గల చిన్న రేవుపట్టణములు పెక్కులు వెలసెను. ఈ ప్రాంతము ఎనిమిది తాలూకాలుగా నున్నది. ప్రాంత మధ్యమున భూజా ; దక్షిణమున మాండవీ ముంద్రా, అంజారు ; తూర్పున రాఫర్, భచావు; పశ్చిమమున లభ్ పత్, అవ డాసా అను తాలూకాలు గలవు. ఇచటి జనసంఖ్య 5,00,000. భూజా, మాండవీ ముంద్రా, అంజారుల యందు కోటలు గలవు. అంజార్ నందలి కోట భూకం పము వలన నేలపాలై పోయినది. మిగిలినవి నేటికిని శిథిలావస్థలో నున్నవి. ఈ ప్రాంతము చిన్న దై నను ఇందు నదులు, అడవులు, పర్వతములు, ఇసుక మైదానములు, గడ్డిబీళ్ళును చాల కలవు. ఇది చూచుట కెంతో ఆకర్షవంతముగా నుండును. ఇచ్చటివారి నాగరికత అతి ప్రాచీనమైనది. నాటినుండి నేటివరకు వారి నాగరికత యందు ఎక్కువ మార్పులు రాలేదని చరిత్ర కారులు చెప్పుదురు. భారత స్వాతంత్ర్యమునకు పూర్వము ఇచ్చటి రాజులను 'మహారాజులు' అనుచుండెడి వారు. ఇవి మొగలు లొసంగిన బిరుదులట ; 'రాజ, మహారాజ, ఆ మీర్ ఝా' అనునవి కూడ రాజబిరుదములు. ప్రజలు బిరుదులచే ఆ రాజులను పిలుచుచుండిరి. జహంగీరు కాల మున నీ ప్రాంతమును 'రాజశ్రీ భారమల్లు' అనునతడు పాలించుచుండెను. ఇతడు మహావీరుడు ; మంచి ప్రతిభ గలవాడు. జహంగీరు ఈతనికి స్వంత నాణ్యములు చెలా మణి చేసికొనుటకు అనుమతి నొసగెను. రాజశ్రీ భార మల్లు మహాదేవనాకుమీ అనుచోట టంకశాలను స్థాపించి బంగారు, వెండి నాణెములను తయారు చేయించెను. 'కోరీ, పాంచియో, అరధియో' యను పేర్లుగల నాణె ములు తయారు చేయించి చెలామణి చేసెను.

ఈ ప్రాంతమున విద్యావ్యాప్తి గావించినవాడు మహా రాజశ్రీ దేశల్ జీ (క్రీ. శ, 1851) ప్రామగల్లు' రాజు పాల నములో విద్య సవ్యమైన బోధనాపద్ధతులతో నడచెను. ప్రస్తుతదశలో 'భూజ్' యనుచోట నొక కళాశాల కలదు. ఇచటి ముఖ్య సాహిత్యకారులు నారాయణ్ విసనీ, ఠక్కుర్, దులేరాయ్, కారాణీ, డుంగరశీ, ధరమశీ, సంపత్, మొదలగు వారలు. ముఖ్య పండితులు కర్మవీర్, వ్యాపారీ అనువారలు. కఛ్ భాషకు మొదట లిపి లేద నియు, దానికి సింధీ భాషతో సంబంధము గలదనియు భాషా శాస్త్రవేత్తల అభిప్రాయము. ఈ ప్రాంతమునకు రాజధాని 'భూజ్'.

ఇచటి స్త్రీల వస్త్రాభరణములు మార్వాడీ స్త్రీల వస్త్రాభరణములను పోలియుండును. విద్యతక్కువగుటచే వీరి యందు అజ్ఞానము మెండు. పురుషులకు కూడ విద్య యందు ఎక్కువగా శ్రద్ధలేకపోవుటయే వారిలో అజ్ఞానము పెంపొందుటకు కారణము. కాని వారి హృద యము నవనీత తుల్యమైనది; భగవద్భక్తి మెండు. ఇచట ఆడపిల్లలను విక్రయించుట, భార్య యుండగా మరియొక భార్యను చేసికొనుట, మున్నగు దురాచారములు నేటికిని