పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/431

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గుజరాతుదేశ చరిత్రము 382 సంగ్రహ ఆంధ్ర

దోచుకొ నెడి వారు. ఈ సమూహమునకే 'బందిపోటు దొంగలు' అని పేరు. మధ్యకాలమున 'చావడా' అను (రాజపుత్రులకు సంబంధించిన ఒక జాతి) వారు గుంపులుగా బయలు దేరి సముద్రతీరమున ఓడలను దోచుకొనుచుండెడి వారు. ఇట్టి కృత్యములు చేయువారు మొన్నటివరకు కూడ ఉండిరి. ఇప్పటికిని కొన్ని ప్రదేశములలో గజ దొంగలు కలరు. కాని వీరిసంఖ్య అల్పము .

శ్రీకృష్ణుడు ఈ ప్రాంతమందు గల ద్వారకను రాజ దానిగా జేసికొని పరిపాలించెను. వీనిని 'యాదవ గణ రాజ్య'మనికూడ వ్యవహరించిరి. శ్రీకృష్ణునకు పూర్వము ఈ ప్రాంతమున దైత్యులు నివసించిరి. వీరు కౄర కర్మములు జేయుచు ప్రజలను బాధించెడివారు; అంద మైన ఆడవారిని అపహరించుకొని పోయెడివారు. శ్రీకృష్ణుడు పరిపాలనకు వచ్చిన తరువాత, రాక్షస కృత్యములు జేయువారిని హతమార్చి, వారు అపహరించి తెచ్చిన స్త్రీలను విముక్తుల జేసెను. ఇట్లు అపహరింపబడిన స్త్రీలలో కొందరు అస్సామునకు చెందినవారై యుండిరి. వీరు అస్సామునకు పోవక, సౌరాష్ట్రమునందే నిలచి పోయిరి. ఇట్టి వారికి శ్రీకృష్ణుడు నివసించుటకు తగు వసతులను కల్పించెను. ఈ అస్సాము యువతులు నృత్య కళయందు ప్రవీణలు. వీరి నృత్యమునకు శ్రీకృష్ణుని వేణు నాదము చక్కనిరూపమును ఏర్పరచినది. కాన నీ ప్రాంత మున కొంత అస్సాము నాగరికత వ్యాపించెను. ఈ ప్రాంత మునకు రాసక, హల్లీసక నృత్యములు శ్రీకృష్ణు డొసగిన దివ్యకళ. నేటికిని ఈ నృత్యములు ప్రచారములో నున్న వి. శ్రీకృష్ణుని పౌత్రుడైన అనిరుద్ధుని భార్య పేరు ఉష ; ఈమె 'లాస్య'మను నృత్యమును, గానవిద్యను, చిత్ర కళను పోషించి, వాటి నందరకు నేర్పెను. లాస్యనృత్య మును ఇప్పుడు 'గజరా' అని వ్యవహరించుచున్నారు. 'ఉషా చిత్రకళ' యను పేరుతో నేటికిని సౌరాష్ట్ర మందు విచిత్రములై న చిత్రములు కన్పడును. శ్రీకృష్ణయుగము నకు అంధ కారయుగమని యనిరి. తగుచరిత్రాధారములు లేకపోవుటయే ఇందుకు కారణము. కాని కొందరు చరిత్ర కారులు ఈ కాలమున మౌర్యులు పరిపాలించిరనియు, దీనిని కౌటిల్యుడు గణరాజ్య మని తన అర్థశాస్త్రమున తెల్పెననియు వాదింతురు. అశోకుడు ఈ ప్రాంతమున బౌద్ధ మత ప్రచారము గావించి, స్తంభములపై శాసనములు చెక్కించెను. మౌర్యుల అనంతరము 'క్షాత్రప'వంశ మునకు చెందిన పదునెనిమిదిమంది రాజులు పరిపాలించిరి. వీరిలో 'రుద్రదామన్' అను వాడు ప్రసిద్ధికెక్కెను. రాజకీయ, సాంస్కృతికదృష్టితో చూచినచో, సౌరాష్ట్రముతో రాజ స్థాన, మాళవ దేశ ములకు ఎక్కువ సంబంధముగలదని తెలి యును. వాత్రపులతరు వాత గుప్తవంశపురాజులగు సముద్ర గుప్తుడు, సంధగుప్తుడు, కుమారగుప్తుడు ఇచ్చట పరిపా లించినట్లు దేవాలయములను బట్టియు, విగ్రహములను బట్టియు తెలియుచున్నది. గుప్తరాజుల పతనానంతరము గుప్త సర్దారైన 'భట్టాంక్ ' అనువాడు వలఖియందు తన రాజధానిని స్థాపించి, హిందూ సంస్కృతిని వికసింపజేసి సౌరాష్ట్రమును విస్తృతినొందించెను. సౌరాష్ట్రమందు తమ శిల, నలందలతో పోల్చదగిన విద్యాపీఠములుండెను. విదేశ ములనుండి వచ్చిన విద్యార్థులు అందువిద్యలనభ్యసించి తిరిగి స్వదేశమునకు వెళ్ళెడివారు. విద్యావిధానము, మహాకవి 'భట్టి' నుండి ప్రారంభమై క్రమముగా వర్థిల్లుచు 1916 వరకు సక్రమ స్థితిలో వికసించెను. వలభిరాజ్య పతనాంత రము దేశమున అశాంతి ప్రబలెను. రాజకీయముగ అనేక ములైన మార్పులు వచ్చెను. ఇంటి పరిస్థితులను పురస్క రించుకొని సమయమునకు తగు లాభమును పొందుటకై “చావడా, ఔఠనా, చుడాసమా, ఝాలా, యాదవ, రాజపూత్" వంశములు వచ్చి కొన్ని గ్రామములను వశ పరచుకొని, సంస్థానాధీశులవలె నిలిచిపోయిరి. “చుడా సమా” వంశజులు 'నూనాగఢ్'ను రాజధానిగా జేసికొని ఆ ప్రాంతమును పాలించిరి. సౌరాష్ట్రమున ఈ విధముగ చిన్న చిన్న రాజ్యములు ఏర్పడుటచే ఆ ప్రాంతము అంతః కలహములు కాలవాలమయ్యెను. క్రొత్తగా వచ్చిన వంశజులు తమ ప్రతిభను చూపించుటకై కలహించు చుండెడివారు. ఈ కాలముననే ఈ ప్రదేశము ఆంగ్లేయుల హస్తగతమయ్యెను. ఆంగ్ల ప్రభుత్వము ఈ ప్రాంతమున ఏర్పడినప్పటికిని వారి సంస్కృతి ఎక్కువగా విస్తరించ లేదు. బౌద్ధ, జైన, ఆర్యసమాజ్ మొదలగు మతములు ప్రబలములై యుండుటచే, ప్రజలు హిందూధర్మమునకు దూరము కా లేదు.

మహాగుజరాతునందు కలిసిన 'కఛ్' ప్రదేశమును