పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/419

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు నగరము

సంగ్రహ ఆంధ్ర

వేలరూపాయల ఆదాయము వచ్చుచున్నది. ఈదరగావద్ద ప్రతి సంవత్సరము పెద్ద ఉత్సవము జరుపబడు చున్నది. ఈ ఉత్సవముయొక్క ప్రాముఖ్యమును గమనించి స్థానిక ప్రభుత్వమువారు ఒకరోజు సెలవును మంజూరు చేసి యున్నారు. రైల్వేశాఖవారు ఉత్సవదినమున ప్రత్యేకముగా రైళ్ళను నడిపించుచున్నారు. ఉత్సవమునకు జిల్లాలోని అన్ని భాగములనుండియు ప్రజలు తండోపతండములుగావచ్చి దరగావద్ద ముడుపులు చెల్లించి, కానుకల నర్పించి ప్రసాదమును గ్రహించి పోవుచున్నారు. ఈ దరగావద్ద జరుగు ఉత్సవమునకు అన్ని మతములవారును వచ్చి పూజలను గావించుచున్నారు.

1832 వ సంవత్సరమున గుంటూరునందు పెద్ద కరవు సంభవించెను. ఇట్టికరవు ఎన్నడును ఈ దేశమున ఘటిల్లి యుండలేదు. దీనినే నందనకరువనియు, డొక్కల కరవనియు చెప్పెడివారు. అప్పుడు ప్రజలు ఆకలిబాధకోర్వ జాలక సజీవముగనున్న జంతువులనుకూడ చంపి, పచ్చి మాంసమునే భుజించి రని చెప్పుదురు.

1844 వ సంవత్సరమున 'ఫాదర్ హేయర్' అను క్రైస్తవ మత ప్రచారకుడు ఇచటికివచ్చి క్రైస్తవమిషన్ అను నొక సంస్థను ఏర్పాటుచేసెను. ఇతనితర్వాత 'గన్' అనునతడు వచ్చి సర్కారువారికి దరఖాస్తుచేసి కొంత స్థలమును సంపాదించెను. ఇచట నొకబంగళానుకట్టించెను. ఈ బంగళా పాతగుంటూరునకు పోయెడి మార్గమున కృష్ణారావు అగ్రహారమునకు తూర్పుదిశయందు కలదు. ఇచటనే ఒక చర్చికూడ కట్టించబడెను. ఈ బంగాళాకు ఇప్పటికిని 'గన్ బంగళా' అనియు 'వుల్ఫ్ బంగళా ' అనియు పేర్లు కలవు. ఈ వుల్ఫ్ అనునాతడు క్రైస్తవ కళాశాలకు అధ్యక్షుడుగా నుండెను.

గుంటూరు పట్టణమున 1866 వ సంవత్సరమున ప్రప్రథమముగా పురపాలక సంఘము ఏర్పాటు చేయబడెను. అప్పుడు అధ్యక్షుడును, సభ్యులును ప్రభుత్వమువారిచే నియోగింపబడు చుండెడివారు. పురపాలక సంఘము స్థాపింపబడిన పిదప గుంటూరు నగరము అన్ని విధముల అభివృద్ధి గాంచినది. గుంటూరు పురమున బహుకాలికముగ నుండిన నీటికరవును నివారించుటకై సంగంజాగర్లమూడివద్ద బకింగ్ హామ్ కాలువనీటితో కృష్ణోదక జలాశయము నిర్మింపబడినది. ఈ జలాశయమునుండి గుంటూరు పట్టణమునకు ఇప్పుడు పుష్కలముగ మంచినీరు లభించు చున్నది.

గుంటూరు నగరము ప్రధానముగ పొగాకు, మిరపకాయలు, ధనియాలు, వేరుసెనగ, ప్రత్తి మొదలగు మెట్ట పంటలకు ముఖ్యమైన వ్యాపార కేంద్రముగా నున్నది.

ఈ పట్టణమున ప్రప్రథమముగా 1888 వ సంవత్సరములో రైలుమార్గము ఏర్పాటు చేయబడినది. అప్పు డీ పట్టణమునకు ఉత్తరభాగమున రైలుస్టేషను కట్టబడినది. స్టేషను నిర్మింపబడిన అనంతరము క్రొత్తపేటకును, రైలు స్టేషనుకును మధ్యనున్న అరణ్యప్రాంతము వాసయోగ్యముగా మార్చబడెను. దానికి రైలుపేట యని నామకరణము చేయబడెను. రైలుస్టేషనుకు ఉత్తరముగా నున్న ప్రాంతముకూడ ఒకప్పుడు అరణ్యముగా నుండెను. కాని క్రమముగా ఈ ప్రాంతమువరకు ఇండ్లు వ్యాపించెను. ఒకప్పు డీ జిల్లాకు క లెక్టరులుగా నుండిన అరండేల్, బ్రాడీ అను పాశ్చాత్యుల పేర్లనుబట్టి ఈ ప్రాంతమున అరండేల్ పేట (1890), బ్రాడీపేట (1905) అను రెండు పేటలు రూపొందినవి. ప్రభుత్వ కచేరీలు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు, వ్యాపారసంస్థలు మొదలగునవి నానాటికి అభివృద్ధిగాంచుటవలన నేటి గుంటూరునగరము అనేకములైన పేటలతో అత్యంతము విస్తృతమైయున్నది.

జాతీయ కాంగ్రెసు అగ్రనాయకులలో ఒకరైన శ్రీ 'దేశభక్త' కొండ వెంకటప్పయ్య పంతులు ఈ నగరముననే బాల్యమునుండి తన జీవితమును గడపి ఇక్కడనే పరమపదించిరి.

ఈ పురమున ప్రథమములో, 1837 వ సంవత్సరమున పాశ్చాత్యులచే ఒక పాఠశాల స్థాపింపబడెను. కాని ఆ పాఠశాల కొలదికాలమునకే అంతరించెను. పిదప 1842 వ సంవత్సరమున క్రైస్తవ మిషనరీవారిచే ఆంగ్లో-వర్నాక్యులర్ పాఠశాల ఒకటి స్థాపింపబడెను. ఈ పాఠశాలయే 1885 వ సంవత్సరమున అమెరికన్ ఇవాంజెలికల్ లూథరన్ మిషన్ కళాశాలగా మారి ఇపుడు ఆంధ్రక్రైస్తవ కళాశాల యైనది. 1864 వ సంవత్సరమున పురజను లెల్లరు కలిసి హిందూ పాఠశాల నొక దానిని స్థాపించిరి. అది 1870 లో ప్రభుత్వ పాఠశాల

370