పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/379

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాణపత్యము

సంగ్రహ ఆంధ్ర

“ఏకదన్త వక్రతుండదన్తి" స్వరూపము ధ్యేయకోటిలో ఉద్ఘాటింపబడినది. వేద భాష్యకారులుతొలుతనే “వాగీశాద్యా స్సుమనసస్సర్వార్థానా ముపక్రమే ॥ యంనత్వా కృతకృత్యాస్స్యుస్తం నమామి గజాననం" అనియు, "తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తంనో దంతః ప్రచోదయాత్" అనియు ప్రార్థించుటలో గాణపత్యముయొక్క ప్రాధాన్యమును సూచించినారు.

విఘ్నేశ్వరుని సేవచే విఘ్నములు తొలగుట యటుంచి, భూనాయక, ధననాయకులను ప్రార్థించు వారలు భూమిని, ధనమును పొందగలుగు విధముగా, విఘ్ననాయకుని సేవించువారలు విఘ్నములు వినా ఏమి పొందకలరు? అను దురూహచే కాబోలు, సాధారణ జనులు విఘ్నేశ్వరునికొక దండముపెట్టి తమదృష్టినంతను తదితర దేవతలపై కేంద్రీకరించుట కలదు. కాని ఇందులో విఘ్నేశ్వరుని యాధాత్మ్యమును ఎరుగజాలమివిచారింపదగినది.

బ్రహ్మవైవర్తపురాణ మందలి గణపతి ఖండములో 'విపత్తివాచకో విఘ్నః, నాయకః ఖండనార్థకః విపత్ఖండనకారం తం, ప్రణయే విఘ్ననాయకం' అను శ్లోక వివరణము కలదు. ప్రారంభించిన పనికి అంతరాయములు వాటిల్లకుండుటే కాక, సర్వానర్థనివృత్తులు కలుగ జేసి అనాది మాయాసుప్తుడగు జీవునికి పరబ్రహ్మాను సంధానమను ఆనందప్రాప్తి వైపు మొదటి అడుగు వేయించునది గణపత్యుపాస్తియే అని భావము. గణేశ, బ్రహ్మ, విష్ణు, రుద్ర, గౌరులు అను పంచలోక పాలకులను పూజించుటచే, క్రమముగా మనోనిగ్రహము, చిత్తశుద్ధి, ఈశ్వరభ క్తి, యోగసిద్ధి, జ్ఞానము అనుఫలములు ప్రాప్తించునందురు. కాని సాధకుని సమస్త ప్రయత్నములును మనోనిగ్రహ లక్షణాంతములే అని గ్రహింపదగి యున్నది. గణపత్యనుగ్రహము నందిన వానికి తక్కిన మహాఫలములన్నియు ప్రాప్తిప్రాయములే అనవచ్చును. శంకరాచార్యులవారు ఉపాసనలన్నియు సాధన చతుష్టయ ప్రాప్తికేనని చెప్పినారు. గణపత్యుపాసనయు నంతే. గణేశుని వశిత్వసిద్ధి ప్రఖ్యాతము. 'నపార్వత్యాః పరాసాధ్వీ, నగణేశా త్పరోవశీ, నచవిద్యాసమో బంధుః, నాస్తి కశ్చిద్గురోః పరః" అనువాక్యము ఈ ఊహను బలపరచుచున్నది.

గణపతి పురాణము నందును, లీలాఖండమునందును, ఉపాసనా ఖండము నందును కన్పట్టు వర్ణనలను బట్టియు గణపతియొక్క నిఖిల పురుషార్థ ప్రధాన సామర్థ్యము వ్యక్తమగుచున్నది. ప్రణవమే గణపతిగ రూపుదాల్చినదని పౌరాణికో క్తికలదు. ప్రణవము నుచ్చరించియే సకల శ్రుతిసూక్తులును ప్రవర్తించునట్లు, సర్వశాస్త్రములు ప్రణవపదమునే వివరించునట్లు, ప్రణవాత్మకుడగు గణపతి అర్చింపబడిన పిదపనే సకల దేవతా పూజలును సాగి, గణపత్యనుగ్రహముతోనే ఇతర దేవతాభిముఖ్యమును కలుగును.

గణపతి లీలలు ఇరవై యొకటి పురాణప్రసిద్ధములు. విష్ణువు యొక్క దశావతారములవలె ఇవియు భక్తజన మనోరంజకములై యున్నవి. గణపతి జన్మ వృత్తాంతము వివిధ ఘట్టములలో వివిధముగ పేర్కొనబడినది. గౌరీ గాత్రమలజనితు డని మత్స్యపురాణగాథ. శివుని జ్ఞానమహిమ చేతనే కలిగినాడని వరాహ పురాణ గాథ. ఈ రెండింటినుండి తేలు సారాంశమేమనగా : శివపార్వతుల అవినాభావము, సామరస్యము అంత గొప్పదను విషయము. శివభక్తుడగు పరశురామునకును, ఈశ్వరాంతఃపురమునకు ద్వారపాలకుడుగనున్న గణపతికిని ఒకప్పుడు అంతఃపురప్రవేశమునుగురించి వాదోపవాదము జరిగి, యుద్ధముగ పరిణమింపగా, గణపతియొక్క దంత మొకటి పరశురామునిచే పెకలింపబడినయంతట, గణపతి ఏక దంతుడాయెనని చెప్పెదరు. మరియొక పురాణ గాథ ననుసరించి గజాసురుని సంహరింప బూనిన గణపతికి సకలాస్త్రశస్త్రములు విఫలములైనందున తన దంతమునే తీసి దానితో రాక్షసుని సంహరించెనని తెలియుచున్నది. దేవీభక్తులకు పరమేశ్వరియొక్క తనయుడైనను ఎదిరింపగల శక్తి పొడముననియు, అసుర ప్రవృత్తిగలవా డెంత బలశాలియైనను, గణపతి బలమునకు లొంగితీరు ననియు ఈ రెండింటి నుండి తేలు సారాంశము.

గణపతి నేర్పరితనముగల లేఖకుడని ప్రతీతి యున్నది. వేదవ్యాసులు మహాభారత రచనకు ముందు గణేశుని తన లేఖకునిగ నెన్నుకొనెననియు, గణపతి లేఖిని నిలువ నవసరము లేకుండ వ్యాసుని కవితాధార కొనసాగె ననియు, వ్యాసుని అర్ధగాంభీర్యము, గణపతి సర్వజ్ఞత్వ

330