పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/366

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గాంధి (ఆర్థిక సిద్ధాంతములు)

నెరవేర్చుటలో ఆటంకములు కలుగుట, ఎండోక్ట్రెన్ కల్లోలములు ఇందులకుగల కారణములు. గర్భస్రావము సహజముగా కలుగవచ్చును; లేదా కృత్రిమముగా వైద్య కారణములచే తల్లి ప్రాణమును కాపాడుటకై కల్పింప బడవచ్చును. లేక చట్టవిరుద్ధముగా తెచ్చిపెట్టుకొన్నది కావచ్చును. ఒక్కొక్కప్పుడు గర్భస్రావము కలుగునను భయమును కల్గించు సూచనలు - అనగా నొప్పి, కొద్దిగా రక్తస్రావము—కలుగును. సరియైన విశ్రాంతిని, చికిత్సను ఏర్పాటు చేసినయెడల అట్టి పరిస్థితిలో గర్భస్రావమును నిరోధింపవచ్చును. గర్భాంతర్గత భాగములు యోని యొక్క ముఖము గుండ ముందునకు వచ్చినచో గర్భస్రావము అనివార్యము. గర్భాశయమునందలి భాగము లన్నియు స్వచ్ఛందముగా వెలుపలికి వచ్చిన యెడల, అపుడు దానిని పూర్తి గర్భస్రావమందురు. అసంపూర్ణమైన గర్భస్రావ విషయమున ఆ భాగములలో కొన్ని స్వచ్ఛందముగా బయటకు వచ్చును. కొన్ని లోపలనే ఉండును వాటిని లోపల ఉండనిచ్చినయెడల రక్తస్రావము కుళ్లి చీముపట్టుట కూడ జరుగవచ్చును. వాటిని సాధ్యమైనంత త్వరలో బయటికి తీసివేయవలెను. తప్పిపోయిన గర్భస్రావమనగా, గర్భస్రావపు చిహ్నములు గోచరించి ఏమియు బయటకు రాకుండ తప్పిపోవుట. ఇది ఒకటి రెండుసార్లు జరుగవచ్చును. కొన్ని వారముల తర్వాత శుష్కించిన పిండము గర్భమునుండి బయటికి వచ్చును. ఆపిండ మిదివరకే మొదటిదెబ్బలోనే చనిపోయి యుండుట వాస్తవము. పిండము ఎండిపోవుట, బొమ్మవలె అగుట సంభవించును.

గర్భధారణ కాలములో కలుగు రక్తజన్య విషదోషము: తేలికయైన కేసులో గర్భవతి ఏమియు చెప్పకుండును. పరీక్షించిన యెడల హెచ్చుస్థాయిలో రక్తపుపోటు, మూత్రములో ఆల్బుమిన్ చిహ్నములు లేక కొద్ది పాటి కాళ్ళవాపు కూడ ఉండవచ్చును. కాని తీవ్రమైన కేసులలో రక్తపుపోటు మిక్కిలి ఎక్కు వయగును. తలనొప్పి, శరీరమందంతటను వాపు, కన్నులు తిరుగుట, వాంతులు, మూత్రములో హెచ్చుగా ఆల్బుమిన్ ఉండుట, మూర్ఛలు వరుసగా వచ్చి పడిపోవుట సంభవించును. గర్భాశయములోని శిశువునకు హానికలుగు అవకాశము కలదు. శిశువు కూడ చనిపోవచ్చును. ఈ పరిస్థితిని ఎంత ఎక్కువకాలము నిర్లక్ష్యము చేయుదుమో, మూత్ర పిండములు అంత ఎక్కువగా చెడిపోవుటకు అవకాశము కలదు. దానిని త్వరగా గుర్తించి సాధ్యమైనంత త్వరితముగా చికిత్స చేయుట అవసరము. కాలేయముకూడ చెడిపోవు అవకాశము కలదు. వ్యాధి చిహ్నములు తీవ్రముగా నున్న యెడల గర్భాశయమును కాళీచేయించవలెను. అట్టి పరిస్థితి కలుగకుండుటకై తల్లి మరల గర్భధారణ చేయకుండ హెచ్చరింపబడవలెను. తలిదండ్రులలో నొకరు గర్భనిరోధక చికిత్స పొందవలెను.

విపరీతాకారముగల శిశుజననము : హెనన్ కఫాలిక్ - విపరీతాకారముగల శిశువు, అనగా చిన్న తల కలిగి, మెదడులేని శిశువు ; నాలుగు తలలు గల శిశువు; ఒకే కన్నుగల శిశువు పుట్టుట జరుగును. ఇట్టి శిశువు పుట్టిన వెంటనే మరణించును.

ఏ. యస్. ఆర్.


గాంధి (ఆర్థిక సిద్ధాంతములు) :

మోహన్ దాసు కరంచందు గాంధిగారి జీవితము సమగ్రమైనది. ఆతని ప్రతిభ సర్వతోముఖమైనది. రాజకీయ, తాత్త్విక సాంస్కృతిక రంగములలో వలెనే ఆర్థికరంగములో కూడ గాంధీ మహాత్ముడు తీవ్రమైన కృషి చేసెను. మానవుడు తిండికొరకే జీవింపరాదు; కాని తిండి లేకుండ జీవించుట కూడ మానవునకు సాధ్యమైన విషయము కాదు. ఈ సంగతి గురించియే మన పూర్వికులు అర్థమును చతుర్విధ పురుషార్థములలో నొకదానినిగ పేర్కొని యున్నారు. ప్రజానీకముయొక్క సౌభాగ్య సంక్షేమముల కొరకు అహర్నిశములు పరితపించిన గాంధీగారు ఇందలి సత్యమును గుర్తించియే "ఆకలితో అటమటించే వానిముందు రొట్టె రూపములోతప్ప మరొక రూపములో సాక్షాత్కరించు సాహసము భగవంతునకు కూడ ఉండదు." అని వాక్రుచ్చి యున్నాడు. దారిద్ర్యము, ఆర్థిక అసమానత్వము మొదలగు ఆర్థిక రుగ్మతలను నివారించుటకై కొన్ని మార్గములను అతడు సూచించి యుండెను. ఇవియే గాంధి మహాత్ముని ఆర్థిక సూత్రము లనబడుచున్నవి.

గాంధీమహాత్ముడు ఆర్థిక రంగములో ప్రవేశపెట్టిన

321