పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/361

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గర్భధారణము - ప్రసవసమస్యలు

సంగ్రహ ఆంధ్ర

ఆనినకొలదియు, ఆ ద్వారము గుండ్రని ద్వారముగా మారును. సాధారణ పరిస్థితులలో తల ముందుగా బయటకు వచ్చును. అది క్రిందికి వంగియుండును. తీవ్రమైన నొప్పులచే యోని ద్వారమున తల వెలుపలికి బలవంతముగా రప్పింపబడును. మెడ వెనుకకు చాపుటవలన తల త్వరగా బయటికివచ్చును. తల వెలుపలికి వచ్చినతరువాత కొంచెము కాలవ్యవధి యుండును. నొప్పులు మరల ప్రారంభించును. సామాన్యముగా శిశువు యొక్క తల తల్లియొక్క కుడివైపునకు తిరుగును. దాదాపు వెంటనే శిశువు యొక్క మొండెము, క్రింది అవయవములు వెలుపలకు వచ్చును. ఆ పిమ్మట ఒక్కసారిగా లోన మిగిలిన ద్రవము బయటకు వచ్చును. ఇది యంతయు జరుగుటకు 2-3 గంటల కాలము పట్టును. ఎక్కువ కాన్పులు అయిన వారికి ఇది త్వరితముగానే జరుగును.

మూడవ దశ : ఇది కొలది నిమిషములనుండి ఒక గంట వరకు ఉండును. కొలదికాలము తర్వాత నొప్పులు ఆగగానే గర్భాశయము (యుటిరస్) మరల సంకోచము చెంద నారంభించును. లోపలనున్న మావి వేరుకాగానే కొద్దిగా రక్తము చిమ్మును. తర్వాత మావి బయటకు వచ్చును.

ప్రసవించుచున్న స్త్రీల విషయమున వహించవలసిన జాగ్రత : స్త్రీ నొప్పులుపడునపుడు క్రిమిరహితములైన తువాళ్ళు, గాజుగుడ్డ మొదలగునవి వాడవలెను. శిశువుయొక్క బొడ్డును శుభ్రపరచి, క్రిమిరహితముగా చేయబడిన కత్తెరతో దానిని కోయవలెను. అట్లు చేయని యెడల క్రిమిజన్య విషదోషమే గాక ధనుర్వాయువు (titanus) అను వ్యాధికూడ వచ్చు ప్రమాదముకలదు . యోనిస్థానమును సాధ్యమైనంతవరకు పరిశీలించకూడదు. పరిశీలనము అవసరమైనచో ముందుగా చేతులు శుభ్రము చేసికొని, వాటికి డెట్టాల్ వంటి క్రిమిసంహారకద్రవమును పట్టించుకొన వలెను. ప్రసవించు స్త్రీ యొక్క పెరీనియము పగులకుండుటకు దూదిమడతను పెరీనియమువద్ద నొక్కవలెను. పగులుట అనివార్యమని తోచినయెడల దానిని సుస్పష్టముగా క త్తెరతో కత్తిరించి, ప్రసవము జారిన తరువాత దానిని తిరిగి కుట్టవలెను. మావి పడిపోయిన తరువాత అది పూర్తిగా పడినదో, పడలేదో యని పరీక్షింపవలెను. మావియొక్క ముక్కలు ఇంకను లోపల మిగిలిపోయి యున్న యెడల అవి స్వయముగానే బయటకురావచ్చును. లేక అవి విస్తరించియున్న యెడల వాటిని తీసివేయవలసిన అవసరము కలుగవచ్చును. బాలెంతను ప్రసవానంతరము శుభ్రపరచి, నడికట్టుతో మంచముమీద పరుండ పెట్టవలెను. కొందరు స్త్రీలకు ప్రసవానంతరము నొప్పులు ఎక్కువగానుండును. ఆ నొప్పులకు చికిత్స చేయవలయును. స్రవించుట సాధారణముగా 7 వ లేక 8 వ రోజున ఆగిపోవును.

పుట్టిన బిడ్డను గూర్చి తీసికొనవలసిన జాగ్రత్త : శిశువునకు ఆలివ్ నూనె పట్టించి, నులి వెచ్చని నీటితో శుభ్రముగా కడుగవలెను. ఒడలు తుడిచిన పిమ్మట మల ద్వారము లేకుండుట, తొఱ్ఱ యుండుట మొదలగు అవలక్షణములను జాగ్రత్తగా పరిశీలించవలెను. ఉన్నచో వాటి విషయములో తగుచర్యలు తీసికొనుట అవసరము కావచ్చును. 1/2% సిల్వరు నైట్రేటు చుక్కలను గాని, సల్ఫసెటమైడ్ చుక్కలనుగాని శిశువు కండ్లలో వేయవలెను. మొదటిరోజున తల్లి స్తన్యమిచ్చు స్థితి వచ్చువరకు శిశువునకు గ్లూకోసు నీళ్ళు పోయవలెను. పుట్టగానే సరిగా శ్వాసపీల్చలేని నీలివర్ణముగల పిల్లలకు వారి నోటిని శుభ్రపరచి ప్రాణవాయువును ఎక్కించవలెను. ప్రాణవాయువు లభ్యముకానిచో, నోటితో గాలిని ఊది శిశువునకు తెలివిని కల్పించవలెను.

ప్రసవకాలమున బాధలు లేకుండ చేయుట : ఈరోజులలో అనేకమంది స్త్రీలు సుఖముగా ప్రసవించవలెనని కోరు చున్నారు. టైవీన్ లేక నైట్రస్ ఆక్సయిడ్‌లో ప్రాణవాయువును (oxygen) కలిపిగాని, లేక తిడిన్‌తో స్కోఫలమైన్ కలిపిగాని ఇయ్యవచ్చును ఇట్టి పనులను వైద్యుల పర్యవేక్షణక్రింద జరుపవలెను. మోతాదుకు మించి ఇచ్చిన ఎడల శిశువునకు ప్రమాదము కలుగవచ్చును. ప్రసవానంతరము శిశువు బ్రతుకుట కష్ట సాధ్యమగును.

శిశువు అసహజస్థితిలో వెలుపలికి వచ్చుట: సహజస్థితిలో జన్మించిన శిశువుయొక్క తల ముందునకు వంగివచ్చును. ఆసహజస్థితిలో ముఖము వెలుపలికి వచ్చుటయో, లేక కాలు వచ్చుటయో, లేదా పిరుదులు, భుజము లేక చేయి

316