పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/348

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గద్యవాఙ్మయము (సంస్కృతము)

లికా ప్రాయము (3) వృత్తగంధి అనునవి. అందు కఠోరాక్షరములు లేనిదియు, స్వల్ప సమాసములు కలదియు మనోహరమైనదియు నగు గద్యరచన వృత్తకము. ఉదా :

“స హి త్రయాణామేవ జగతాం గతిః పరమ పురుషోత్తమో దృప్తదానవ భరేణ భంగురాంగీ మవని మవలోక్య కరుణార్ద్రహృదయ స్తస్యా భార మవతార యితుం రామకృష్ణ స్వరూపేణాంశతో యదువంశే౽వత తార, యస్తు ప్రసంగే౽పి స్మృతో౽భ్యర్చితో వా, గృహీతనామా, పుంసాం సంసారసాగరపార మవలోక యతి.”

(2) సమాసాఢ్యమును దృఢాక్షరోపేతమును నైన గద్యరచన ఉత్కలికాప్రాయ మనబడును. ఉదా :

"ప్రణిపాత ప్రవణ సప్రధానాశేష సురాది బృంద సౌందర్య ప్రకట కిరీటకోటి నివిష్ట స్పష్ట మణిమయూఖ చ్ఛటాచ్ఛురిత చరణ నఖచక్ర విక్ర మోద్దామ వామపాదాం గుష్ఠ శిఖరఖండిత బ్రహ్మాండ వివర నిస్సరచ్ఛరదమృత కరప్రకర భాసుర సురవాహినీ ప్రవాహ పవిత్రీకృత విష్టపత్రితయకైటభారే! క్రూరతర సంసారసాగర నానా ప్రకారా వర్తమాన విగ్రహం మా మనుగృహాణ.”

(2) వృత్తైకదేశ సంబంధముగల గద్యము వృత్తగంధి యనబడుచున్నది. ఉదా :

“జయ జయ జనార్దన ! సుకృతి మనస్తడాగ విక స్వర చరణ పద్మ ! పద్మపత్ర నయన! పద్మాపద్మినీ వినోద రాజహంస ! భాస్వర యశఃపటల పరిపూత భువనకుహర! హరకమలాసనాది బృందారకబృంద వందనీయ పాదార వింద ! ద్వంద్వనిర్ముక్తయోగీంద్ర హృదయ మందిరా విష్కృత నిరంజనజ్యోతి స్స్వరూప! నీరదరూప ! విశ్వ రూప ! అనాథనాథ ! జగన్నాథ! మా మనవధి భవదుఃఖ వ్యాకులం రక్ష! రక్ష ! రక్ష !"

అనుగ్రహ చూర్ణికోదాహరణము :

“నిజభక్తజనానుగ్రహకారణ శ్రీదేశిక స్వరూపిణి ! శ్రీమహా త్రిపురసుందరి! పాహిమాం, పాహిమాం, నమస్తే, నమస్తే, నమస్తే, నమః"

స్తవోదాహరణము :

“నమోస్తు పురుషోత్తమాయ పరమరిపు పరపుర హరణ పరాక్రమాయ ............. జాగ్రత్సుప్తతూర్య చతుర్భుజాయ నారాయణాయ, నరసింహ వామనాయ ............ గంధర్వ మధురగీత - సురవిద్యాధర ఋషిప్రభృతి సేవితాయచ ..... పురుషో౽నంత సముద్రాశ్రయః ....... శ్రీప్రియో ధనదప్రియో వైశ్రవణాంగకో౽స్మాన్‌రక్షతు, ఆస్మాన్ గోపయతు స్వాహా".

దండకోదాహరణము :

“జయ జయ జగదంబ ! దాసో౽స్మ్యహంతే రమావాసకాంతే త్వమేవాఖిలస్య ప్రపంచస్య మాతేతి వాణ్యా పురాణ్యా మహత్యాపి సత్యాపితం సో౽హమేవం భవత్యాః కిశోరో౽స్మి భృత్యో౽స్మి దాసో౽స్మి తస్మాత్కృపాంగై రపాంగైః ప్రసన్నం శిశుం మాం కుర్వహం చానవద్యాత్మ భక్తో౽స్మి సంద్యోత సేత్వం పరం జ్యోతి రిత్యంబ! మహ్యందయేథాః సుధారాశికన్యే ! రమే! పద్మహస్తే ! ప్రసీద ! ప్రసీద ! ప్రసీదాంబ! మే.

ఇట్లు సంస్కృతగద్యము నానాశాఖా పరిపుష్టమై, వేదములందు ఛాందస ప్రయోగబహుళమును, బ్రాహ్మణారణ్య కోపనిషత్తులందు ఉత్తరోత్తర క్రమముగ సుపరిష్కృతమును, సుగమమును; మహాభారతాది యందు స్వల్ప సులభ వాక్యయుతమును, కారక మర్యాదోపేతమును; నాట్యశాస్త్రాదులందు ఒకించుక ప్రౌఢమును; పురాణసాహిత్యము నందు మనోహరమును; ఋగాది సంహితా బ్రాహ్మణారణ్యకాది భాష్యము లందు సుగమమును, కూలంకషమును, సకలార్థ బోధకమును; దార్శనిక భాష్యములందు ప్రౌఢోదాత్తమును, అనర్గళమును, విస్మయావహమును; రూపకములందు ప్రాయికముగ సజీవమును, సరళమును, సరసమును; శాసనములందు, ఆఖ్యాయికలందు, చంపువులందు, ఉత్కలికాదులందు, ప్రౌఢమును, ఓజోగుణ భూయిష్ఠమును; కావ్యనాటకాది వ్యాఖ్యానములందు సులలితమును, మనోజ్ఞమును; అర్వాచీన గద్య కావ్యములందును, పత్రికలందును, సులభమును, సుబోధమునునై సంస్కృత గద్యము విరాజిల్లు చున్నది.

గద్యరచనము పద్యరచనమంత సులభసాధ్యమైనది కాదు. నిర్దుష్ట సరస గద్యరచనము. కవికి అత్యంతోత్కర్షా ధాయకము. కావుననే, 'గద్యం కవీనాం నికషం

303