పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/342

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గద్యవాఙ్మయము (సంస్కృతము)

చున్నది. సాయణాచార్యుల భాష్యగద్యము సరసము, సుబోధము. ఉదా :

'యోప్సు నావం ప్రతిష్ఠితాం వేదేత్యాది-యఃపుమా నప్సు ప్రతిష్ఠితాం స్థైర్యేణావస్థితాం నావం వేద, స స్వయం లోకే ప్రతిష్ఠాయుక్తో భవతి. కా౽సౌ ప్రతిష్ఠి తా నౌరితి సేయ ముచ్యతే. ఇమే వైదృశ్యమానా ఏవ భూరాదయో లోకా అప్సు స్థైర్యేణావస్థితా నౌస్థా నీయాః అతః సర్వలోకాధార భూతా ఆప ఇతి వేద నేన ప్రతిష్ఠాప్రాప్తిః . నద్యాధిషు పరతీరగమనాయ జనై ర్యానౌః సంపాద్యతే సా జలే ప్రతిష్ఠితా న భవతి గమనాగమ నాభ్యాం చంచలత్వాత్. సర్వలోక సంఘరూపా తు నౌః న కదాచిదపి చలతి, కింత్వప్సు స్థైర్యేణావతిష్ఠ తే. ఆవరణ సహితం బ్రహ్మాండం ఘనోదాఖ్యే మహాజలే౽వతిష్ఠత ఇతి హి పౌరాణిక ప్రసిద్ధిః (శ్రీమత్సాయణాచార్య విరచితము. కృ. య. తై. ఆరణ్యక భాష్యము ప్రపా. 1 అను 22.)

లౌకిక సంస్కృత గద్యావిర్భావము సాక్షాత్తుగాగాని, పారం పర్యముగాగాని, వైదిక సాహిత్యమునుండి ఏర్పడినదని తెలియుచున్నది. భాసకాళిదాసాది మహాకవులు సంపూర్ణముగ గద్యమయములైన కావ్యములను రచించియుండ లేదు. ఐనను వారి రూపకములందు కనిపించు గద్యము సజీవమై, సరసమై, సరళమై, మనోహరమై ఒప్పారుచున్నది. ఉదా:

భాసుని స్వప్న వాసవదత్తమునందు ప్రథమాంకమున గల


“పద్మావతీ - ఆర్యే వందే.
 తాపసీ – చిరంజీవ. ప్రవిశ, జాతే! ప్రవిశ!
            తపోవనాని నామ అతిథిజనస్య గేహం.
 పద్మావతీ - భవతు భవతు ఆర్యే! విశ్వస్తాస్మి.
            అనేన బహుమానవచ నేనానుగృహీ తాస్మి.
 వాసవదత్తా - (స్వగతం) న హి రూపమేవ, వాగపి
            ఖల్వస్యా మధురా!"

అను వాక్యములును, కాళిదాసకవి సార్వభౌముని అభిజ్ఞాన శాకుంతలమునందు పంచమాంకమున గల-


“రాజా - అవహితోస్మి.
ఋషయః - (హస్తముద్యమ్య) విజయస్వ రాజన్ !
రాజా - అఖిలానభివాదయే వః.
ఋషయః - స్వస్తి భవతే. ఇష్టేన యుజ్యస్వ.
రాజా - అపి నిర్విఘ్నతపసో మునయః"

అను వాక్యములును, ప్రకృతమునకు తార్కాణములు. ఒకానొకప్పుడు రసోచితముగ ప్రౌఢగద్య సరణియు రూపకములందు కనవచ్చుచున్నది. ఉదా:

వేణీ సంహారమున, తృతీయాంకమున ఉత్ఖాతఖడ్గుడై కలకల మాకర్ణించుచు ప్రవేశించిన అశ్వత్థామయొక్క క్రోధస్ఫోరకములైన వాక్యములు—

“కథమవధీరితక్షాత్రధర్మణాం, ఉత్సృష్ట వీరపురుషో చిత లజ్జావకుంఠనానాం, విస్మృత స్వామిభ క్తి సత్కార లఘుచేతసాం, అగణితకులబలసదృశప్రభావానాం, ఆత్మధైర్యమజానానాం, తురగరథద్విప పాదచారిణాం సమరభూమే రపక్రమతామయం నాదోబలానాం.”

“ఓజ స్సమాస భూయస్త్వం ఏతద్గద్యస్య జీవితం" సమాస ప్రాచుర్యము ఓజస్సు. ఇది గద్యమునకు జీవితము. ఇట్టి లక్షణముచే లక్షితమయిన గద్యము ప్రాచీన శిలా శాసనములందు కనిపించుచున్నది. ఉదా :


"మహారాజాధిరాజ శ్రీ సముద్రగుప్తస్య కీర్తిమతః
త్రిదశపతి భవన గమనావాప్త లలిత సుఖవిచరణ
మాచక్షాణ ఇవ భువో బాహురయ ముచ్ఛ్రితః
స్తంభః". (ప్రయాగ విజయస్తంభే)

పంచతంత్రాది కథాగ్రంథములందు లభించు గద్యము మిక్కిలి సుబోధము, సరసము, సరళము, సంక్షిప్తవాక్య విరాజితము. ఉదా :


"మేఘవర్ణ ఆహ తాత! కాని తీర్థాని ఉచ్యంతే ?
 కతిసంఖ్యానిచ, కీ దృశాః గుప్తచరాః? తత్సర్వం
 నివేద్యతాం "

సంస్కృతాఖ్యాయికలు విద్వజ్జనోద్దిష్టములై యున్నట్లు కనిపించును. అవి క్రీస్తుశకారంభమునకు మిక్కిలి పూర్వ కాలముననే పుట్టినట్లు తెలియుచున్నది. మహాభాష్యమున భగవత్పతంజలి" వాసవదత్తా - భై మరథీ - సుమనోత్త రాది - ఆఖ్యాయికలనుచ్చర్చించెను. కాని, గ్రంథకర్తల నామములను తెలిపియుండలేదు. బాణమహాకవి తన హర్ష చరితమున, కొందరు ఆఖ్యాయికా కర్తలను, 'వాసవదత్త' అను నొక ఆఖ్యాయికను ప్రశంసించెను. జయాదిత్యుడు కాశికయందు 'ఉర్వశి' యను కావ్యమును

297