పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/339

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్యవాఙ్మయము (సంస్కృతము)

సంగ్రహ ఆంధ్ర

ఇతరులు వేద వివిధభాగములు గల గద్యమున నొక క్రమ వికాసమును లక్షించుచున్నారు. వేదగద్యము ఛాందస ప్రయోగబహుళము. బ్రాహ్మణారణ్యకము లందలి గద్యము వేదగద్యముకంటె స్వల్పముగ సరళముగ నున్నది. ఆరణ్యకములందలి గద్యముకంటె ఉపనిషద్గ్రంథములందలి గద్యము విశేషముగ సరళముగ కనిపించు చున్నది. క్రమోదాహరణములు :

భాషాకాఠిన్యోపేతమయిన వేదగద్యము:

ఆపోవా ఇదమగ్రే సలిలమాసీత్తస్మిన్ప్రజాపతిర్వాయుర్భూత్వా ౽చరత్స ఇమామపశ్య త్తాం వరాహోభూత్వా౽హరత్తాం విశ్వకర్మాభూత్వా వ్యమార్ట్ థ్సా౽ప్రథత, సాపృథివ్యభవ త్తత్పృథివ్యై పృథివీత్వం తస్యామశ్రామ్య త్ప్రజాపతి స్సదేవానసృజత వసూన్రుద్రానాదిత్యాన్తే దేవాః ప్రజాపతి మబ్రువ న్ప్రజాయామహా ఇతిసో౽బ్రవీద్యథాహం యుష్మాగ్ంస్తపసాజ౽సృక్ష్యేవం తపసి ప్రజనన మిచ్ఛధ్వమితి.

(కృ-యజు- కాం. 7-క్ర-అను వా. 5)

విధిబోధకగద్యము :


'వాయవ్యగ్గ్ం శ్వేతమాల భేత ’
'ఆదితేభ్యో భువద్వద్భ్యశ్చరుం నిర్వ పేత్ '
'ఆగ్నావైష్ణవమేకాదశ కపాలం నిర్వపేత్'
'అగ్నయేకామాయ పురోడాశమష్టాకపాలం

(నిర్వ వేత్.` (కృ. య. )

నిషేధబోధకగద్యము :


తస్యైతద్ర్వతం నా౽నృతంవదేన్న
మాగ్ం సమశ్ఙ్నీయాన్నస్త్రియ
ము పేయాన్నాస్యపల్పూలనేన వాసః
పల్పూలయేయుః । ఏతద్దిదేవా
స్సర్వన్నకుర్వంతి.

(కృ. య. కాం. 2)

స్తుతిపరగద్యము :


భూతికామోవాయుర్వైక్షేపిష్ఠా
దేవతావాయుమేవ స్వేన
భాగధేయేనోపధావతి స
ఏవైనం భూతిం గమయతి.

(కృ. య. కాం 2)


నిందాపర గద్యము :


యదశ్ర్వశీయ తతద్రజతగ్౦
హిరణ్యమభవత్తస్మాద్రజతగ్ ౦
హిరణ్యమదక్షిణ్య మసృజగ్ం
హియోబర్ హిషిదదాతి
పురాస్య సంవత్సరాద్గృహేరుదంతి.

(కృ. య. కాం. 1)

ఈ క్రింది గద్యము సరళమును సుగమమునై యున్నది :


అగ్నిర్వైదేవానామవమో విష్ణుః పరమస్తదంత రేణ
సర్వా అన్యాదేవతాః । ఆగ్నావైష్ణవం పురోడాశం
నిర్వపంతి దీక్షణీయ మేకాదశకపాలం సర్వాభ్య
ఏవైనం తద్దేవతాభ్యో౽నంతరాయం నిర్వపంతి.

(ఐతరేయ. బ్రా. 1-1)

ఆరణ్యకోదాహరణము :


యో౽పాంపుష్పం వేద । పుష్పవా న్ప్రజావా
న్పశుమాన్భవతి । చంద్రమావా అపాం
పుష్పం । పుష్పవాన్ప్రజావాన్పశుమాన్భవతి ।
య ఏవం వేద.

    యోపామాయతనం వేద ।

ఆయతనవాన్భవతి । అగ్నిర్వా అపామాయతనం
ఆయతనవాన్భవతి । యో౾గ్నే రాయతనంవేద ।
ఆయతనవాన్భవతి । ఆపోవా అగ్నేరాయతనం ।
ఆయతనవాన్భవతి । య ఏవం వేద ।
....... .......... ........ ......... ....... .........
యోపామాయతనంవేద । ఆయతనవాన్భవతి ।
సంవత్సరోవా అపామాయతనం ।
ఆయతనవాన్భవతి । యస్సంవత్సరస్యాయతనంవేద ।
ఆయతనవాన్భవతి । ఆపోవైసంవత్సరస్యాయతనం।
ఆయతనవాన్భవతి । యఏవంవేద ॥

       యో౽ప్సునావం ప్రతిష్ఠితాంవేద ।
ప్రత్యేవతిష్ఠతి । ఇమే వైలోకాఅప్సు ప్రతిష్ఠి తాః ।
తదేషా౽భ్యనుక్తా ।

(కృ. య. ప్రపా. 1. అనువా. 22)

ఈ ఆరణ్యక గద్యము సులభముగ సరళముగ, నున్నది. ఇట్లే క్రింది ఉపనిషద్గద్యము సరసము, సరళము. ఉదా :


యత్రనాన్యత్పశ్యతి నాన్యచ్ఛృణోతి
నాన్యద్విజానాతి తద్భూమా । అథయత్రా
న్యత్పశ్యతి అన్యచ్ఛృణోతి అన్యద్విజానాతి

294