పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/329

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్యవాఙ్మయము (తెలుగు)

సంగ్రహ ఆంధ్ర

శతాబ్ది పూర్వార్థమున వర్ధిల్లినాడు. ఈ వచనముల నీయన స్వామివారి సన్నిధిలో నాలాపించువాడు. వీటికి తాళగంధి చూర్ణములని పేరుండుటచే ఇవి పాడుకొనుటకు కూడ నుపయుక్తములై యుండెనని చెప్పవలెను. ఈ వచనము లన్నింటియందును శ్రీ వేంకటేశ్వరస్వామి స్తుతింపబడినాడు. ఇందు విశిష్టాద్వైత మతసిద్ధాంతములు సర్వత్ర కనిపించును. దీనితో వచనరచనారీతిలో అనంతామాత్యుడు చెప్పిన గద్య (వచన) లక్షణము సరిగా సరిపోయినది. దూరాన్వయము, సమాస కాఠిన్యము, అనుప్రాస విన్యాస పరిశ్రమము ఇందు లేవు. కృష్ణమాచార్యుల వచన రచనారీతులు కొన్ని ఇందు కాన్పించును. ఉదా :


"శ్రీ వేంకటగిరిదేవా ! నా దేహంబు నీవుండెడి నిత్య నివాసంబు. నాజ్ఞాన విజ్ఞానంబులు నీ యుభయపార్శ్వంబుల దీపంబులు; నాముకుఁజెఱమల యూర్పులు నీ యిరు దెసలంబట్టెడి యాలవట్టంబులు; నా మనోరాగంబు నీకు చంద్రకావి వలువ. నీకు మ్రొక్క నెత్తిన నాచేతులు రెండును మకర తోరణంబులు. నా భక్తియె నీకు సింహాసనంబు. నా మేనం బొడమిన పులకలు నీకు గుదులు గ్రుచ్చి యర్పించిన పూదండలు. నేను నిన్ను నుతియించిన నుతుల యక్షర రవంబులు నీకు భేరీ భాంకార ఘంటా నినాదంబులు. నా పుణ్య పరిపాకంబులు నీకు నై వేద్య తాంబూలాదులు. మదీయ నిత్యసేవాసమయ నిరీక్షణంబు నీకు సర్వాంగంబు నలందిన తట్టుపునుంగు. నాసాత్త్విక గుణంబు నీకు ధూప పరిమళంబు. నీవు దేవదేవుండవు. నే నర్చకుండను. ఈ రీతి నిత్యోత్సవంబు నాయందు ఆవ ధరింపవే శ్రీ వేంకటేశ్వరా!"

‘వేంకటేశ్వరా’అను మకుట ముండుటచే నీ గ్రంథమునకు వేంకటేశ్వర వచనము లను పేరు కలిగినది.

ఇదికాక, 15, 16 శతాబ్దుల మధ్యకాలమున బయల్వెడలిన వాటిలో శఠకోప విన్నపములు, భవానీ మనోహర వచనములు లేక శంకర వచనములు, కాశికాధీశ్వర వచనములు, కాలజ్ఞాన వచనములు, సభాపతి వచనములు ముఖ్యములైనవి. రచనయందును, సంప్రదాయము నందును, ఇవి సింహగిరి వచనముల యొక్కయు, వేంకటేశ్వర వచనముల యొక్కయు ఛాయలందే నడచినవి. స్తోత్రరూపములుగా నీ కాలమున కొన్ని వచన గ్రంథములుకూడ రచితములైనవి.

వేదాంత వ్యవహారసార సంగ్రహము : మాహురి క్షేత్రమున ప్రసిద్ధుడై, దాసగోపాలస్వామి మొదలగు శిష్యులకు జ్ఞానమార్గోపదేశకు డగు దత్తాత్రేయయోగి ఈ గ్రంథమును రచించెను. వ్యాసకృత మగు బ్రహ్మసూత్రములకు శంకరకృత మగు శారీరకమీమాంసా భాష్యము ననుసరించి సంగ్రహరూపమున వ్యావహారిక భాషలో రచింపబడిన గ్రంథ మిది. ఇందలి శైలి ఇట్లుండును.

“వేదాంత మనగాను శారీరకసూత్ర భాష్యము. ఆ శారీరకసూత్ర భాష్యార్థము సంగ్రహించిన గ్రంథములన్నియు వేదాంతప్రకరణము లనంబడును. ఆ శారీరక సూత్రభాష్యానకు యే అనుబంధ చతుష్టయము కలదో, అదే వేదాంతసార సంగ్రహ మనేటి గ్రంథానకు ఆలోచించేటిదే అనుబంధ చతుష్టయ మనబడును. అనుబంధ చతుష్టయం బనగాను అధికార విషయసంబంధ ప్రయోజనాలును, అధి కారి అనగాను సాధ్య చతుష్టయ సంపన్ను డనంబడును..."

ఈ గ్రంథము సాహిత్య ప్రయోజనము కన్న ప్రచార ప్రయోజనమే హెచ్చుగా కలది కావున సులభ వ్యావహారిక శైలి చక్కగా రాణించినది.

భారత సావిత్రి : క్రీ. శ. 1511 - 1568 మధ్యకాలమున జీవించిన ఎల్లనర నృసింహకవి యీ గ్రంథమును రచించి నాడు. ఇతడు ప్రసిద్ధ వైష్ణవాచార్యుడు. తిరుమల లక్ష్మణమునికి శిష్యుడు. ఈ గ్రంథము భారతమునకు సంగ్రహ రచన. శైలి గ్రాంథికముగా నుండును. మచ్చునకు :

“కురుక్షేత్రంబు యజ్ఞ వేదియు, జనార్దనుండు యూపంబును, దుర్యోధనుండు పశువును, కర్ణుండు హవిస్సు, పాంచాలి యరణియు, భీమసేనుం డగ్నియు, నర్జునుండు హోతయు, భీష్మద్రోణు లాజ్యంబును, రణంబు యాగంబు గావించి, ధర్మరాజు యజమానుండును, గాండీవంబు సృక్‌స్రువంబులును, సమస్త రాజరాజసంఘంబులు కొనియాడ హోమంబు చేయించె."

పరమానంద బోధప్రకరణము : క్రీ. శ. 1560 ప్రాంత

284