గణితశాస్త్ర చరిత్రము
సంగ్రహ ఆంధ్ర
కొనదగినవాడు కార్ల్ ఫ్రెడ్రిక్ గావూస్ (Carl Friedrich Gauss-1777-1855).
గావూస్, బ్రన్స్‌విక్ అను జర్మను పట్టణములో జన్మించి, గాటింజిలోను, హెల్ముస్టాట్ (Helmstadt) లోను విద్య నభ్యసించి 1807 మొదలు 1855 వరకు (తన జీవితాంతమువరకు) గాటింజ్‌న్ విశ్వవిద్యాలయమున కనుబంధరూపమున నున్న ఖగోళశాస్త్ర పరిశోధనాలయ సంచాలకుడుగా పనిచేసెను. శుద్ధగణితమునను, అనువర్తిత గణితమునను ఈతనికి ఉండు ప్రావీణ్యము, తరచు లాటిను భాషను వాడుచుండుట మున్నగువానిచే నీతని సనాతన తత్త్వాభిలాష సూచితమైనను ఈతని పరిశోధనల యందెల్లెడల నూతనయుగపు సరిక్రొత్త భావముల శక్తి సామర్థ్యములు ప్రస్ఫుటము లగుచున్నవి. ఈతడు చిన్నతనమునుండియే యనేక క్రొత్తవిషయములను గనుగొన మొదలిడెను. ఆధునిక అంకశాస్త్రము ఈతనినుండియే మొదలిడిన దనవచ్చును. దీనిలో నీతడు పరస్పరవర్గ సిద్ధాంతమును (Law of quadratic reciprocity) కనుగొనెను. బీజసమీకరణ మూలముల అస్తిత్వమును ఈతడే ప్రథమమున రుజువు చేసెను. క్లిష్ట సంఖ్యలు (Complex numbers), వాటి గుణములు, వాటి ప్రమేయము, మొదలగువాటిలో ఆతని ప్రావీణ్యము అనల్పము. "అతి జ్యామితిశ్రేణి” (Hypergeometric series) నాతడు కనుగొని, దాని సంభిన్నతను (convergence), దానిసాధన (Solution) గుణములను అతిక్షుణ్ణముగ చర్చించెను. ఇదిగాక దీర్ఘవృత్త సంకలన విలోమక్రియచే (By the process of inversion of elliptic integrals) ద్విధాపర్యాదిక ప్రమేయములు (Doubly periodic functions) ఉద్భవించునని యాతడు గ్రహించెను. అయూక్లిడ జ్యామితి (Non Euclidian Geometry) యొక్క మూలభావములు ఆతనికి తెలియనివి కావు. చతుష్ఫలములు (Quarternions) ఆత డెరుగును. ఇక అనువర్తిత గణితశాస్త్రములో నాతని కింతయే సామర్థ్యము కలదు. క్రొత్తగా కనుగొనబడిన సీరీసు (series) అను గ్రహకము (Planetoid) యొక్క చలనమును సంపూర్ణముగ లెక్క వేసి కనుగొనెను. భూతల విజ్ఞానకృషిలో (Geodesy) ఆతడు కనుగొనిన తలవక్రతా (Curvature of surfaces) గణనవిధానము అంద రెరిగినదే. అయస్కాంతశాస్త్రములో ఆతని పరిశోధనలు శాశ్వతకీర్తి నార్జించినవి విద్యుచ్ఛక్తి సహాయముతో టెలిగ్రాఫును కనుగొనవలెనని యీతడు ప్రయత్నించెను. ఆకర్షణ శాస్త్రములో ఆతని పరిశోధనలు తరువాత 'పొటెన్షియల్ థియరీ' (Potential Theory) కి ప్రాతిపదిక యాయెను. ఇతడు ప్రపంచ మేధావులలో నొకడుగా లెక్కింపదగినవాడు.
జర్మనీ దేశములో ఇట్లు గావూస్ పరిశోధనలు సాగిపోవుచుండగా, ఫ్రాన్సు దేశమునను గొప్ప గణితశాస్త్ర ప్రగతి జరిగెను. గావూస్ స్పృశించిన శాఖ లన్నిటి యందును లెజాండర్ (Lezandre- 1752-1838) పరిశోధనలు జరిపెను. ఈతనిచే నిర్మింపబడిన లెజాండర్ ప్రమేయములును ప్రసిద్ధములే. ఆకాలమున ఫ్రాన్సు దేశములో నుండిన బహుసాంకేతిక (Polytechnic) పాఠశాలలలో గొప్ప గణితజ్ఞు లుండిరి. అట్టి వారిలో ముఖ్యుడు మాంజె (Monge) అను గణితజ్ఞుడు. ఈతని కృషిఫలితముగ ఫ్రాన్సుదేశమున అనేకులు గణితజ్ఞు లుద్భవించిరి. వీరందరికిని క్షేత్ర గణితము అభిమాన పాత్రము. ఈ కాలమున పాఠశాలలలో బోధన కుపయోగించు పాఠ్యపుస్తకము లనేకములు వెలసినవి. మాంజె యొక్క ప్రభావముచే ఆతని శిష్యులనేకులు జ్యామితి శాస్త్రమున అత్యంత ప్రావీణ్యమును గడించి దానిలో చాలా ముఖ్యపరిశోధనలను గావించి యీ శాస్త్రమును ఫ్రెంచి విశ్వవిద్యాలయము లన్నిటియందును అత్యంత వ్యాప్తిలోనికి తెచ్చిరి. అట్టి వారిలో ముఖ్యుడు విక్టరు పాన్సిలెట్ (Victor Poncilet). ఈతడు విక్షేపక జ్యామితి (Projective Geometry) శాస్త్రమునకు సృష్టికర్త. అప్పటి ఫ్రెంచి విద్యాలయములలో లెగ్రాంజ్ రచించిన విశ్లేషక యంత్రశాస్త్రము అతిక్షుణ్ణముగా పఠింప బడుచుండెను. ఆ కాలపు మహామేధావులలో పేరెన్నిక గన్నవారు లెగ్రాంజ్, మాంజే. తరువాత చెప్పుకొన దగినవారు జోసెఫ్ ఫోరిన్, అగస్టిన్ కాంచి (Joseph Fourin, Augustin Canchy) అను వారు. ఫోరియర్ (Fourior) రచించిన ఉష్ణశాస్త్రములో మొట్టమొదట ఫోరియర్ శ్రేఢి చర్చింపబడెను. ఈ కాలమున ఈ ఫోరి
270