పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/309

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గణితశాస్త్ర చరిత్రము

సంగ్రహ ఆంధ్ర

యూరపు ఖండములోని మధ్య యుగపు గణితశాస్త్రము: విజ్ఞానాభి వృద్ధికి క్రైస్తవమత మొనరించిన అపకారము మరే మతమును చేయలేదు. ప్రజలలో విజ్ఞానాభి వృద్ధి కలిగినచో అది మత విశ్వాసములకు గొడ్డలి పెట్టై తమ ఆధిపత్యము తలక్రిందగునని మతాధికారులు భయమందిరి. అందుచే వారు దాని వినాశమునకు చేయ గలిగినదంతయును చేసిరి. గ్రీకు విజ్ఞానము వారి ఈర్ష్యాగ్నికి ఆహుతియై పోయెను. ఐతే ఏడవ శతాబ్దినుండి ఇస్లాము మతము వెల్లువవలె పై కుబికి, ప్రాచీ, ప్రతీచీ భూఖండములను ముంచివేసెను. ముసల్మానుపాలనములో పరిస్థితులు కొంతవరకు మెరుగుగా నుండెను. వారి ఏలుబడిక్రిందనున్న ప్రదేశములలో అచ్చటచ్చట మరల గురుకులముల వంటివి ఏర్పడి పరిశోధనలు సాగనారంభించెను. కాని అప్పటికే గ్రీకులు రచించిన గ్రంథములన్నియు నష్టములై పోగా, వాటి అరబ్బీ భాషాంతరీక రణములు మాత్రము ఉపలబ్ధములగుచుండెను. కాని అవియన్నియు అరబ్బీ భాషలో నుండుటచేతను, ముసల్మానుల అధీనములో నుండుటచేతను, ఇతరులకు అందుబాటులో లేకుండెను. అప్పటి యూరపు ఖండమున వెలసిన మత విద్యాసంస్థలలో, గణితశాస్త్రము గూడ బోధనావిషయముగ నున్నను, అది నామమాత్రమే. ఆ విద్యాప్రణాళికయు విజ్ఞాన తృష్ణను అణచివేయునదే గాని, ఉత్తేజకరమైనది కాదు. ఇట్టి పరిస్థితులలో కొందరు విజ్ఞాన పిపాసువులు అతికష్టము పై అరబ్బుల నుండి గ్రీకువిజ్ఞానమును గ్రహింప గలిగియుండిరి. క్రీ. శ. 1120 లో 'అడెల్ హార్డ్ ఆఫ్ బాత్' (Adelhard of Bath) అను ఆంగ్లేయుడు ముసల్మాను విద్యార్థి వేషమున సంచరించి యూక్లిడ్ రచించిన “ఎలిమెంట్స్" (Elernents) ను సంపాదించి, దానిని లాటిను భాషలోనికి వెంటనే అనువదించెను. దీని మూలముననే యూక్లిడ్ యొక్క “ఎలిమెంట్స్" యూరపు ఖండమునకు పరిచయమైనది. లియనార్డో అను నొక వర్తకుడు తన వర్తక వ్యాపారమునకై ప్రాచ్యదేశమున సంచరించి కొంత గణితశాస్త్ర జ్ఞానమును ప్రాచ్య దేశీయుల నుండి సంపాదించి "లిబర్ అబాసి” (Liber Abaci) అను బీజగణిత గ్రంథమును 1202 లో రచించెను. 1220 లో "ప్రాక్టికా జామెట్రికా" (Practica Geometrica) అను క్షేత్రగణిత గ్రంథమును రచించెను. ఇతడు 'ఆల్-ఖవారిజోమి' (Al-khawarizomi) అను గ్రంథముల నుండి అనేక ఉదాహరణము లిచ్చెను. ఇట్లే రానురాను గ్రీకు విజ్ఞానము, హిందూ విజ్ఞానము, అరబ్బు విజ్ఞానము యూరప్ ఖండమునకు పరిచితము గాజొచ్చెను. 15 వ శతాబ్ది యందలి గణిత శాస్త్రజ్ఞులలో అగ్రగణ్యుడు కానిగ్జ్ బర్గ్ (konigsberg) నగర నివాసియగు 'జాన్ మిల్లర్ ' అనునాతడు. ఇతనినే 'రెజిమోంటేనస్ ' (Regimountañus) అని యందురు. ఇతడు అనేక గ్రీకుగ్రంథములను అరబ్బీ భాష నుండి లాటినులోనికి అనువదించెను. వాటిలో ముఖ్యమైనవి అపోలోనియస్, (Apollonius) ఆర్కిమిడిస్ (Archimedes), హెరన్ (Heron) ల యొక్క కృతులు. ఆ కాలమున చెప్పుకోదగిన గొప్ప గణితశాస్త్రజ్ఞు లెవ్వరును లేరు. అప్పుడు వృద్ధిబొందిన వ్యాపారముచే, నిపుణులైన అక్కౌంటెంట్లకును, రాకపోక లెక్కువైనందున ఇంజనీర్లకును ఎక్కువ గిరాకి తగిలెను. అందుచే స్థాపత్య శాస్త్రము, దాని కనుబంధరూపమగు స్థితిశాస్త్రము, ద్రవస్థితిశాస్త్రము, యంత్రశాస్త్రము మున్నగునవి కొన్ని వృద్ధిబొందెను. 'లియనార్డో-డ-విన్సీ' (Leanardo - da - Vinci) అను నాతడు (1450) ఒక గొప్ప చిత్రకారుడు, ఇంజనీయరు, యంత్ర నిర్మాత, గణితశాస్త్రజ్ఞుడు. ఇతడు భౌతిక శాస్త్రాభివృద్ధికి చాలా తోడ్పడుటయేగాక, యంత్రశాస్త్రమును గట్టి పునాదులపై నిర్మించెను. ఇంచుమించుగా ఈ కాలముననే (1473) కొపర్నికస్ అను శాస్త్రజ్ఞుడు, ఈ విశ్వమునకు కేంద్రము సూర్యుడనియు, సూర్యుని చుట్టును భూమి మున్నగు గ్రహము లన్నియు తిరుగుచున్నవనియు ఊహించెను. అయితే, ఇది ఊహమాత్రమే గాని, దాని కత డేమియు ఉపపత్తి నీయ జాలకపోయెను.

కాలానుగతముగా యూరపు ఖండమం దంతటను గొప్పపట్టణములు వెలసెను. ప్రాచ్యదేశములతో వ్యాపారము వృద్ధిచెందెను. కొన్ని కొన్ని వ్యాపార కేంద్రములలో విద్యాసంస్థలును వెలసెను. ఇట్టి విద్యా సంస్థలలో ముఖ్యమైనవి కొన్ని ఇటలీదేశమున నున్నవి. అచ్చటి 'బొలోనా' (Bologna) విశ్వవిద్యాలయము చాల ప్రసిద్ధి వహించి, యూరపు ఖండము యొక్క ప్రతిభాగము

264