పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/302

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గణిత భూగోళము

యామ్యోత్తర రేఖల మధ్య నుండు దూరము, హెచ్చుచుండు సామ్యములో (proportion) అక్షాంశముల మధ్య నుండు దూరములు ధ్రువముల వైపుకు పోవుకొలది తగ్గును. కనుక గదులు (nets) సమాన విస్తీర్ణము కలిగి యుండును. స్తూపాకారపు సువిక్షేపము (cylindrical or thomorphic) లేదా 'మర్కేటరు' విక్షేపము (Mercator's projection) సరియగు ఆకారము గల

చిత్రము - 88

పటము - 5

చిత్రము - 89

పటము - 6ఎ

పటము - 6బి

ప్రపంచ పటములు గీయుట కొరకు ఉపయోగింపబడును. (పటము 6 బి) దీని యందు ఆంక్షాంశరేఖల మధ్య నుండు దూరములు క్రమముగా ధ్రువముల వైపునకు హెచ్చు చుండును. ఉత్తర దక్షిణపు వ్యాప్తులు తూర్పు పడమరల వ్యాప్తులసామ్యము (proportion) లో ఉండును. ఇట్లు ఈ విక్షేపము సరియగు ఆకారమును కలిగి యుండును.

చిత్రము- 90

పటము - 7ఎ

చిత్రము - 91

పటము 7బి

(2) శంక్వాకారపు విశేపములు: ఉత్తర, దక్షిణములందు కొలది వ్యా ప్తిగల నిరక్షరేఖామండలముల పటములను గీయునపుడు వాడబడును. శంకు విక్షేపము యొక్క అల్లిక (Net) ను పొందుటకై ఒక ప్రమాణిత అక్షాంశరేఖతో భూగోళమును తెలుపుటకై ఒక వలయము గీయబడును. (పటము 7ఎ) ఒక శంకువును ఆ ప్రమాణిత (standard) అక్షాంశముమీద ఉంచుదురు. ఉదా : 50 అక్షాంశము. ఆ ప్రమాణిత అక్షాంశమును తెలుపుట కై P' కేంద్రముగా తీసికొని (ప. 7 బి) P A కు సమానముగా నుండు విక్షేపక వ్యాసార్థముతో ఒక చాప రేఖను గీయవలెను. P' M (ప. 7 బి) అనునది మధ్య నుండు యామ్యోత్తర రేఖ. Q అను కోణమునకు సరియగు చాపదూరములు గ్రహింపబడును. విభాజక బిందువులగుండా గీయబడు ఏక కేంద్రక చాపరేఖలు ఇతర ఆక్షాంశములను తెలుపును. రేఖాంశములను పొందుటకై వాటి మధ్యనుండు సరియగు చాపదూరములను ప్రమాణిత అక్షాంశము పొడుగున నిర్దిష్టమగు అంతరములలో గుర్తులు పెట్టబడును. ఆ విభాజక బిందువులను కలుపగా అల్లిక పూర్తియగును. దీనియందు అక్షాంశరేఖల మధ్యనుండు దూరములు కచ్చితముగా నుండును. కాని యామ్యోత్తర రేఖల మధ్యనుండు దూరములు ఉత్తర దక్షిణముల వైపునకు హెచ్చుచు పోవును. ఇట్లు ఈ అల్లిక (Net) ఆకారమునకుగాని, వైశాల్యమునకుగాని సరిపడి యుండదు. ప్రామాణిత అక్షాంశ ద్వయముతో కూడిన విశేషము ఇదేవిధముగా లోపములతో కూడియున్నదైనను తరతమ భావముచే దోషము తక్కువగా నుండును. బొన్నీ (Bonne's), పాలీకోనిక్ (బహుశంకుక) ఈ తరగతికి చెందిన ఇతరములగు ముఖ్య విశేపములై యున్నవి.

257