పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/295

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గణిత భూగోళము

సంగ్రహ ఆంధ్ర

ఖస్వస్తిక దూరము (Zenith distance = నతాంశము) అక్ష రేఖను తెలుపును. అత్యున్నతస్థాన ప్రాప్తి (Culmination) ఉచ్ఛస్థానమునకు (Zenith) దక్షిణముగా నున్నపుడు, ఉచ్చస్థాన దూరముయొక్కయు, నక్షత్ర దిక్పాతము (declination of the star) యొక్కయు మొత్తము ఆ పరిశీలన స్థానమునందలి ఉన్నతాకాశము యొక్క (zenith) అక్షరేఖను తెలుపును. నక్షత్రముయొక్క ఉత్తరదిశ యందలి అత్యున్నతస్థాన ప్రాప్తి యందుకూడ ఇదేవిధమగు సూత్రమును అక్ష రేఖానిర్ణయమునకై నిర్మింపవలెను. ఉన్నతాకాశముయొక్క సరియగు స్థానమును తెలుపు బిందువును, ఆకాశములో సుమారు 90° ఉన్నతస్థాన భేదముగల ఏవేని రెండు నక్షత్రముల గరిష్ఠదూరములను (zenith distances) పరిశీలించుచు స్థిరముచేయవచ్చును. 'త్రికోణమితి' లెక్కల ననుసరించి విషువాంశమును, ఉన్నతస్థాన ప్రాప్తిని (culmination) సులభముగా తెలిసికొనవచ్చును. ఉన్నత స్థానముయొక్క అక్ష రేఖ లేక మార్గము తెలిసినచో, నక్షత్ర కాలమునుగాని (sidereal time) ఉన్నతాకాశము యొక్క విషువాంశము (Right Ascension) గాని, తూర్పు లేక పడమరయందు ఉన్న ఒక నక్షత్రము యొక్క నతాంశమును (zenith distance) గాని, ఒకేసారి పరిశీలించి ఎప్పుడైనను నిర్ణయింపవచ్చును.

ఒక బిందువు (Point) యొక్క నిట్ట నిలువుగా నుండురేఖను క్రిందికి పొడిగించినచో, అది గురుత్వాకర్షణముయొక్క దిశను (direction of gravity) చూపును. అది అక్షమును (axis) గురుత్వ కేంద్రమువద్ద (centre of gravity) ఖండించును. దానిని పైకి పొడిగించినచో అది ఉన్నతస్థానము (Zenith)లో ఆకసముతో కలియును. ఒక స్థానము (బిందువు) వద్దనున్న నిట్టనిలువు రేఖయొక్క సమతలములు ఆ బిందువుయొక్క సమతలములేయగును. నిట్రపు సమతలము (Vertical plane) దాని సమాంశ రేఖ సాహాయ్యమున నిర్వచింపబడును. సమాంశమనగా, నిట్రపు సమతలము యామ్యోత్తర రేఖల సమతలముతో నేర్పరచు కోణము. ఒక స్థానము (బిందువు) యొక్క ఖగోళ సమాంశము లేక భూగోళ సమాంశము అనునది ఆ ప్రదేశముయొక్క యామ్యోత్తరతలముచేతను, నిట్రపు సమతలముచేతను ఏర్పడు కోణము. ఉపరితలమును స్పృశించు సమతలమును దృశ్యక్షితిజతలము (Horizon) . అందురు. భూ కేంద్రముగుండా పోవు దీనికి సమాంతరముగా నుండు సమతలమును పరిమేయక్షితిజ సమాంతరము (Rational horizon) అందురు. ఇది భూమియొక్క కేంద్రమునుండి పోవుచుండును. ఒక స్థలమందు ఒక నక్షత్ర దిశను చూపు రేఖచేతను, నిట్రనిలువు రేఖచేతను ఏర్పడు కోణము ఆ నక్షత్రముయొక్క అత్యున్నత దూరమును తెలుపును. ఆ నక్షత్ర సూచక రేఖచేతను క్షితిజసమతలముచేతను ఏర్పడు ఊర్ధ్వకోణము ఔన్నత్యమును తెలుపును.

భూభ్రమణ ప్రమాణములు: భూమి పడమర నుండి తూర్పునకు 24 గంటలలో ఒక ఆత్మ ప్రదక్షిణమును పూర్తిచేయును. ఈ భ్రమణముయొక్క అక్షము భ్రమణ కక్షాతలమునకు 661/2 ° కోణము నేర్పరచును. ఏకాంతరిత క్రమములో జరుగుచుండు సూర్యోదయ సూర్యాస్తమయములు, భిన్న యామ్యోత్తర రేఖలందుండు కాలభేదము, గ్రహాదులల (Heavenly bodies) యొక్క పశ్చిమాభిముఖమగు దృశ్యమాన చలనము, పోటుపాటుల వెల్లువ (tide flows) - ఈ అంశములు భూభ్రమణమును గూర్చి స్పష్టముగా తెలుపుచున్నవి. ఏ వస్తువుగాని భూమిపైన నిట్ర నిలువుగా పడకుండుట, లోలక గడియారము నిరక్ష రేఖవద్ద (equator) కాలమును కోల్పోవుట, తీగ త్రాసుతో (Spring balance) వస్తువులను తూచినపుడు ధ్రువములవద్ద వాటి బరువు అధికమగుట, పవనములు ఏటవాలు దిశలందే వీచుచుండుట - ఈ సంఘటనలకు భూభ్రమణమే కారణము, భూభ్రమణము ప్రశాంతమైన దగుటచేతను, భూమిమీదనుండు వస్తువులన్నియు భ్రమణ వేగముతో చలించుచుండుట చేతను, ఆచలనము మనకు గోచరించుటలేదు. మిక్కిలి ఎత్తుగానుండు వాతావరణము కూడ ఈ భ్రమణముతో భ్రమించుచుండును.

భ్రమణ వేగము : భూమిమీది ప్రతిస్థానము 24 గంటలలో చుట్టు తిరుగుచుండును. కాని భ్రమణ వేగము అన్ని చోట్ల ఒకే విధముగా నుండదు. సమాంతర అక్ష రేఖల వ్యాప్తి (Extension) ధ్రువ ప్రాంతములకు పోవుకొలది తక్కువ అగుటనుబట్టి భ్రమణవేగము క్రమముగా తగ్గుచు

250