పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/294

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గణిత భూగోళము

వైపుకు పోయిన కొలది యథాక్రమముగా చిన్న వగుచుండును. ధ్రువముల యొద్ద అవి బిందురూపమున అదృశ్యమగును. 1° ఆంతరముగా గీయబడినపుడు అవి యామ్యోత్తరరేఖయొక్క ప్రతి నాలుగవ వంతును 90 సమానచాపరేఖలు (arcs) గా విభజించును. ఒక్కొక్క చాపరేఖ, గోళముయొక్క కేంద్రమువద్ద 1° కోణము నేర్పరచును. సూర్యునియొక్కగాని, చంద్రునియొక్కగాని, నక్షత్రములయొక్కగాని స్థానమును పరిశీలించి అక్షాంశరేఖను తెలిసికొనవచ్చును. ధ్రువఊర్ద్వబిందువు (Zenith of the pole) నిరక్షరేఖవద్ద క్షితిజముపై నుండును. అక్కడినుండి 1° ఉత్తరముగావచ్చినచో ధ్రువ ఊర్ధ్వ బిందువు (Zenith of the pole) క్షితిజముకంటె 1° పై కి అగుపడును ఈ విధముగా ధ్రువోర్ధ్వ బిందువు క్షితిజమునుండి ఒక్కొక్క డిగ్రీ పెరిగినకొలది ధ్రువోర్ధ్వ బిందువు ఎత్తులో నొక్కొక్క డిగ్రీ పెరుగును. అది ధ్రువమువద్ద సరిగా నెత్తిపై నుండును. మిట్టమధ్యాహ్న మందలి సూర్యుని మూలమునగాని, ఇతర నక్షత్రముల మూలమునగాని అక్షాంశమును (Latitude) నిర్ణ యించుటకు క్షితిజముపైనున్న సూర్యునిగాని, నక్షత్రములనుగాని సెక్స్ టెంటు (Sextent) సహాయమున కొలిచి నావికుల పంచాంగమును (Nautical Almanac) ను చూచి నిర్ణయింపవచ్చును. 'బీమ్సు అండ్ రాడర్ ' అను పరికరములు మనకు సరియగు స్థానమును తెలుపును.

భూభ్రమణము కారణముగా నిరక్షరేఖమీద నుండు ఎట్టి స్థానమునకు సంబంధించిన ఖస్వస్తిక (Zenith) యైనను ఖగోళ నిరక్షరేఖ (celestial equator) అనబడు ఒక బృహద్వృత్తమును ఏర్పరచును. దక్షిణోత్తరము లందలి ప్రతి ఇతర స్థానముయొక్క ఏ ఊర్ధ్వబిందువు అయినను (Zenith) నక్షత్రములలో భ్రమణపు ఇరుసు (axis) ఆకాశమును కలియు స్థానము చుట్టును ఒక చిన్న వృత్తమును నిర్మించును. ఈ స్థానము వద్ద ఏదైన నక్షత్ర ముండుచో అది స్థిరముగా నుండినట్లు కనిపించుచు, ఒకే ఎత్తును, దక్షిణదూరమును (azimuth) చూపుచుండును. కాని నిజమునకు అదియొక చిన్నవలయము ఏర్పడునట్లు పరిభ్రమించు చుండును. ధ్రువనక్షత్రముకూడ ఉత్తర ధ్రువముపైన ఒక చిన్నవలయము నేర్పరచుచుండును.

నక్షత్రములయొక్క స్థానములు వాటియొక్క విషువాంశము (Right Ascension) ను బట్టియు (భూ రేఖాంశమునకు ప్రతిగా) వాటి దిశనుబట్టియు, లేక ఖగోళ నిరక్ష రేఖనుండి ఏర్పడినవాటి కోణదూరమును (angular distance) బట్టియు, నిర్ణయింపబడును. ఆకాశములో వ్యాపించియుండు ఒకే యామ్యోత్తర రేఖ (meridian) కు చెందిన నక్షత్రములు ఒకే విషు .వాంశమును (Right Ascension) కలిగియుండును. కాల పరిభాషలో తెలిపినచో సున్నగంట (Zero hour) నుండి 24 గంటలవరకు అని అర్థము. నాక్షత్రిక కాలము (Sidereal time) ఖస్వస్తికము (Zenith) యొక్క విషువాంశమగును. నాక్షత్రిక ఘటికాసూచి (Sidereal clock) కాలమునే కాక నక్షత్రములయొక్క విషువాంశ మునుకూడ చూపును.

చిత్రము - 85

పటము - 2

2 వ పటములో, రెండు చిన్న ఏక కేంద్ర వృత్తములు (Concentrics) వాటి వ్యాసార్ధములు మొత్తము ఒక సమకోణము (Right angle)నకు సరియగునట్లుగా గీయబడినవి. లోపలవృ త్తము నక్షత్రములలో A అను నొకనిర్ణీత స్థానము యొక్క ఊర్ధ్వబిందువు (Zenith) ననుసరించి గీయబడుచో, పరిశోధనాస్థలపు పరివృత్త(circum) ధ్రువతారలు బాహ్యవృత్తముచే ఆవరింపబడి యుండును. A వద్ద వాటిఊర్ధ్వబిందువుదూరము (Zenith distance) ఒక సమకోణముకంటె తక్కువ ఉండును. దీనికి విరుద్ధముగా, A యొక్క పరివృత్త ధ్రువతారలను అంతరవృత్తము ఆవరించినపుడు, బాహ్యవృత్తము, దానియొక్క ఊర్ధ్వబిందువుచే తెలుపబడును. A యొక్క ఉచ్చ తమ స్థానమునకును, మరేదైన నక్షత్రమునకును మధ్య గల దూరము ప్రతి 12 గంటలకు గరిష్ఠ, కనిష్ఠ పరిమాణములను ఏకాంతరిత క్రమమున (alternately) పొందుచుండును. నక్షత్రములగుండా A యొక్క యామ్యోత్తర రేఖాక్రాంతి (Transit) అత్యున్నత స్థానమును పొందుట (Culmination) అని అనబడును. యామ్యోత్తర రేఖాక్రాంతిలో నున్న ఒకానొక నక్షత్రముయొక్క

249