పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/287

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గణపతిదేవుడు - కాకతి

సంగ్రహ ఆంధ్ర

చేయుట ద్వారా నూతన పరిశోధనలు జరిపి, మిక్కిలి నవీనములగు గడియారములను రూపొందింప గలిగెడివారు, ఆర్క్ రైట్, హ్యూగెన్స్, జెన్నీ, ఫుల్టన్ మొదలైన మేధావు లందరు ఇట్టివారే.

గోడగడియారములకు మాత్రమే పెండ్యులమ్ ఉండుననియు, పూర్వము పెద్ద గడియారములలో నున్న దోషములు పెండ్యులమ్ వలన తొలగిన వనియు, అందుచే గోడగడియారములు క్రమబద్ధముగ పనిచేయ నారంభించె ననియు విదిత మయినది. అయుతే, హ్యూగెన్స్, చేతి గడియారములలోను, జేబు గడియారములలోను గూడ పెండ్యులమును ఉపయోగించు పద్ధతిని కనిపెట్టెను. ఈ పెండ్యులమ్ ' ప్లైవీలు' వంటిది; ఒక్క వైపున ఉక్కుతో చేయబడిన స్ప్రింగ్ ఉండును. దానికి హెయిర్ స్ప్రింగు అమర్పబడి యుండును. హెయిర్ స్ప్రింగు యొక్క రెండవకొన కదలక స్థిరముగా నుండెడి ప్లేటుకు తాపటము చేయబడి యుండును.

చిత్రము - 83

పటము - 7

జేబు గడియారము పనిచేయువిధము

ప్లైవీలును కుడివైపునకుగాని, ఎడమవైపునకు గాని త్రిప్పి, తరువాత వదలినచో అది లోలకమువలె అటునిటు ఊగును. ఇదివరలో చెప్పియున్నట్లు, స్ప్రింగుకుగల లక్షణమే దీనికిని కలదు. పెద్ద గడియారములలోని పెండ్యులము, చిన్న గడియారములలోని "బాలెన్సువీలు" ఒకే పనిని నిర్వర్తించును. స్పైరల్ యొక్క ఊపులు, పెండ్యులం యొక్క ఊపుల వలెనే సరియైన కాలపరిమితిని కలిగియుండును. స్పైరల్ యొక్క ఈ విచిత్ర లక్షణమే గడియారములో పెండ్యులమునకు బదులుగా స్పైరల్ ను ఉపయోగింపవచ్చునను భావము హ్యూగెన్స్ మహాశయునకు స్ఫురించుటకు కారణ మయ్యెను.

గడియారమను ఈ చిన్నయంత్రము యొక్క స్వస్థతను ఎప్పటికప్పుడు ఒక కంట కనిపెట్టు చుండవలెను. సాధారణముగ దానిలో ఘటిల్లు స్వల్పక్రమ భంగములను మెకానిక్ సహాయము లేక యే మనము దిద్దుకొనవచ్చును. ఎంతటి విలువగల గడియారమైనను ఒక నిమిష మటో, ఒక నిమిష మిటో నడచుచుండునని అనుభవము వలన తెలియుచున్నది. కాని, ఈ గడియారముల కంటెను, ఓడలలో నావికు లుపయోగించు క్రోనో మీటరులకంటెను సూర్యుడు, నక్షత్రములే సరియైన కాలమును తెలుపు అంతరిక్ష గడియారములు. పూర్వమువలెనే ఇప్పుడును ప్రశాంతముగ పయనించు నక్షత్రములను బట్టియే, నక్షత్ర పరిశోధనాలయ శాస్త్రజ్ఞులు సరియయిన కాలనిర్ణయము చేయగలుగు చున్నారు.

ప్ర. రా. సు.


గణపతిదేవుడు - కాకతి (క్రీ. శ. 1198 1261) :

శాతవాహనుల తరువాత త్రిలింగదేశమును 'ఏకచ్ఛత్రము క్రిందికి తెచ్చి పాలింపగల్గిన రాజచంద్రుడు గణపతిదేవుడు. ఇతడు కాకతీయ చక్రవర్తులలో ఏడవ వాడు ; కడు సమర్థుడు; విపులసామ్రాజ్య నిర్మాత.

కాకతి ప్రోలరాజు (1110-1158) యొక్క పుత్త్రులలో నొక్కడును, కాకతి రుద్రదేవుని తమ్ముడును ఐన మహాదేవరాజున కును, బయ్యమాంబకును జన్మించినవాడు గణపతి దేవుడు. వీరిది సూర్యవంశమనియు, వీరు క్షత్రియులుగా పరిగణింపబడిరనియు, గణపతిదేవుని పాకాల, మోటుపల్లి కాంచీవర శాసనములవలన తెలియుచున్నది. విద్యానాథుడు ప్రతాపరుద్రీయమున కాకతీయ ప్రభువులను 'అత్య ర్కేందుకుల ప్రసూతు'లని కీర్తించియున్నాడు. అంతియకాక వీరు దుర్జయాన్వయులనియు, చతుర్థకులజు లనియు శాసన ప్రమాణములవలన (గారవపాడు శాసనము మొదలగునవి) తెలియుచున్నది.

మొదటి ప్రతాపరుద్రుడని బిరుదముదాల్చిన కాకతి రుద్రదేవుడు పరిపాలన చేయుచున్న కాలమున, మహా దేవరాజాతని రాజ్యమును హరించుటకు మాయోపాయములను పన్నుచు, రాజు నగరమున లేనిసమయము చూచి, సింహాసనమును అక్రమించుకొనెను. కాని రుద్రదేవు డాతనిని వధించి, అతని కుమారుడైన గణపతి దేవుని చెరపట్టెను శాణదేశాధీశుడును, యాదవరాజును అగు జైత్రపాలుడు (జైతుగి) ఈ సమయమున రుద్రదేవునిపై నురికి, వానిని చంపి, పిన్న వయస్కుడగు గణపతిదేవుని చెరనుండి విడిపించి క్రీ శ. 1198 లో ఆతనిని

242