పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/285

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గడియారములు

సంగ్రహ ఆంధ్ర

యందలి సాంకేతిక నిపుణులు కనిపెట్టిన పెక్కు రకముల గడియారములను బ్రిటిష్ శాస్త్రజ్ఞులు పరిశోధించి విశేషమైన నైపుణ్యముతో ఈ టవర్ గడియారమును తయారు గావించిరి. దీనికి ఆంగ్లేయులు 'బిగ్ టామ్' అని పేరిడిరి. ఇది 'లైట్ హౌస్' వలె బహుదూరమున నున్న ప్రజలకు కూడ జ్యోతివలె కనిపించి దిక్ దర్శక మగుటయే గాక, అలారము కొట్టి గంటలను గూడ తెలుపుచుండెను. తరువాత కొంతకాలమునకు 'బిగ్ టామ్' స్థానమును 'బిగ్ బెన్' అను వేరొక నమూనా టవర్ గడియార మాక్రమించెను. 'బిగ్ టామ్ ' అవతరించిన తరువాత ఇతర ఐరోపా పట్టణములలో గూడ టవరు గడియారములు కనిపింపదొడగెను.

గడియారమును కనిపెట్టిన సాంకేతిక శాస్త్రజ్ఞులు నీటినితోడు బావి గిలకను దృష్టియం దిడుకొని, దానిని పోలు చక్రములను గడియారమం దమర్చిరి. నీటినితోడు కడవకు బదులుగా గడియారమం దొకబరువు వ్రేలాడు చుండును. చక్రముయొక్క స్థానములో గడియారమందు ముళ్ళు తిరుగును. అయితే త్రాటినివదలినప్పుడు గిలక వేగముగా తిరుగునట్లు గడియారములోని ముళ్ళు వేగముగా పరుగెత్తకూడదు. చక్రములు, ముళ్ళు ఎల్లప్పుడు సమాన వేగముతో తిరుగవలసి యుండును. వేగమును అరికట్టి, సమానస్థాయిలోనడచు ఏర్పాటు ప్రతిగడియార మందును కలదు. దానిని రెగ్యులేటర్ అనియెదరు. స్ప్రింగులతో నడచు గడియారములకు రెగ్యులేటర్ అవసరము. బిగువుగా చుట్టుకొనిన స్ప్రింగును ఒక్కసారిగా వదలినచో అది అతివేగముగా విప్పుకొని అనతి కాలములో గడియారము ఆగిపోవును. అందుచే స్ప్రింగు కూడ మెల్లగా, సమాన వేగముతో విప్పుకొనునట్లు చేయవలెను.

రెగ్యులేటరుకు రెండు 'ఫ్లాన్ జెస్' అమర్చబడి ఉండును. ఇందులో పై భాగముననున్న ఫ్లాన్ జ్ పళ్ళచక్రమునకుగల రెండు పళ్ళనడుమ కరచుకొనునట్లు అమర్చబడియుండును. ఆ ప్లాన్ జ్ పళ్ళను ముందునకు కదలనియ్యక ఆపును. అట్టియెడ, ఆపళ్ళు ఫ్లాన్ జ్ ను ముందునకు త్రోయును. అది అక్షమును త్రిప్పి సగము చుట్టువరకు పోవునట్లు చేయును. అప్పుడు క్రిందివైపున నున్న మరియొక ఫ్లాన్జ్ ఆపళ్ళ చక్రములోని రెండుపళ్ల నడుమ పడును. ఆవిధముగా అది తిరుగును. కాని పళ్ళ చక్రము రెగ్యులేటరును సులభముగా త్రిప్పకుండుటకు అక్షము (ఆక్సిల్) పైన అడ్డముగా ఒక కడ్డీయుండును. ఈకడ్డీకి ఇరువైపుల చిన్నబరువులు వ్రేలాడ కట్టబడి యుండును. రెగ్యులేటరు లేకున్నచో బరువు త్వరగా పడిపోవును. కాని బరువులు వ్రేలాడ గట్టబడిన కడ్డీని తిరుగునట్లు చేసినయెడల, అది మిక్కిలి కష్టముతో మెల్లగా తిరుగును. ఆపళ్ళ చక్రమును 'ఎస్కేవ్ వీల్' అనియు, 'టర్న్‌స్టెల్' అనియు లేక 'బాలెన్స్' అనియు అందురు. ముళ్ళను, రెగ్యులేటర్ మొదలగు వాటి నన్నిటిని గిలక త్రిప్పును. ఆ కదలికను అన్నిటికిని అంద జేయుటకు రెండుపళ్ళ చక్రము లుండును. ఎడమ వైపుననున్న 'పినియన్' అను పళ్ళచక్రము ఆ కదలికను గడియారపుపళ్ళకు అందియ్యగా, కుడివైపుననున్న పళ్ళచక్రము మొదట తిరుగు చక్రపుఇరుసును త్రిప్పును. మొట్టమొదట తయారైన గడియారములు కాలమును సరిగా తెల్పెడివికావు. అవి కొలదిగ మోటుగా నుండెడివి. వాటికి గంటలముళ్లుండెడివికావు. అవి దినమునకు పెక్కుసార్లు చుట్టుకొను అవసరము కలిగెడిది. ఈగడియారములో 24 అంకెలుండెడివి. ఇవి సూర్యాస్తమయ సమయమున ఒక గంటయు, మరుసటిరోజు సూర్యాస్తమయ కాలమున 24 గంటలును కొట్టెడివి అనగా, ఆ రోజులలో ఒక నాటి సూర్యాస్తమయమునుండి మరుసటి దినము సూర్యాస్తమయమువరకు గల కాలమును ఒక రోజుగా పరిగణించెడివారు. తరువాత గడియారపు 'డయల్' లో మార్పులు వచ్చెను. 1 నుండి 12 వరకు రెండు వరుసలలో అంకెలు వ్రాయబడినవి. ఒక వరుస పగటికాలమును, రెండవవరుస రాత్రికాలమును తెలుపుటకు నిర్దేశింపబడినవి. నేడు 12 అంకెలుగల గడియారములే వివిధ దేశములందు వివిధ రూపములలో తయారగుచున్నవి.

ప్రారంభదశలో కొన్నివందల పౌనులు బరువుగల టవర్ గడియారములు తయారయ్యెడివి. ఇప్పుడున్న టేబిల్ గడియారములు, గోడగడియారములు, చేతి గడియారములు మొదలైనవాటి ఆకారములను రూపొం

240