పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/276

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గజశాస్త్రము

గజశాస్త్రమునందు వర్ణితములు, చిత్రితములు అయిన నాలుగుదంతములు, ఆరుదంతములుగల దిగ్గజములు

ఈ పక్షయుక్త గజములు పురాణకల్పితములని కొందరు అభిప్రాయపడవచ్చును. అయితే స్థూలకాయముగల జంతువులకు జీవశాస్త్ర రీత్యా మొదట మొదట రెక్కలుండుచుండెననియు, పరిణామదశలో రెక్కలు రాలిపోసాగెననియు ప్రకృతిశాస్త్రజ్ఞులు నిరూపించియున్నారు. ఇక రెండు, మూడు జతల దంతములుగల గజములున్న వనుటకును, ఇటీవల (బెల్జియం) కాంగోలో రెండు జతల దంతములుగల గజము కనబడుటయు, దానిని జంపియుండుటయు దృష్టాంతముగా నుండగలదు. ఇవి ఊహాజనితములు కావనుట నిక్కము.