పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/273

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గజశాస్త్రము

సంగ్రహ ఆంధ్ర

గజవయోభేదములు : పది సంవత్సరములనుండి పదునాల్గు సంవత్సరముల ప్రాయమువరకు గజమునకు ఉత్తమ వయస్సు. అటనుండి డెబ్బదవ యేడు వరకు అధమ వయస్సు. డెబ్బదికి పైబడిన కరులు వాహనాది క్రియల వేనికిని పనికిరావు. శిక్షణాదిక్రియల కన్నింటికి ప్రథమవయస్సే యోగ్యమైనది.

మదము : గజమునకు, సహజము, శోభావహము అయిన భూషణము మదమే. కావున నే


'సద్రత్నైశ్చామరై శ్చాపినతథా జాయతేరుచిః
మదపట్ట కృతాశోభాయథాభవతి దంతినః
                                 (హ. చతు 55 పుట)

అన్నారు. మద, రేఖవలన గలిగిన శోభ రత్నహారములచే గాని చామరములచేగాని కలుగదు.


'మదహీనా నధావంతి నయుధ్యంతే మతంగజా'
                                               (మా II 4 – 6)

అని సోమేశ్వరుడు చెప్పెను. మదోత్పత్తి ఇట్లు వర్ణింపబడినది.


కఫమేదః పిత్త రక్త మాంపై రన్యోన్యమూర్ఛితై 8
ఈశ్వరేణ పరామృష్టో, జాయతే దంతినాం మదః
                                    (హ. చతు. 55 పుట)

కఫము, కొవ్వు, పిత్తము, రక్తము, మాంసములు అన్యోన్య ఘట్టితములై మదముగా ఏర్పడును. గండస్థలములు, మేఢ్రము, ముఖము, కన్నులు అనునవి మదస్రావస్థానములు. మదవాహకములైన నాడులు మొత్తము ఏబది; వీనిలో పది నేత్రగతములు, పది గండస్థల గతములు. మేఢ్రగతములు పదునైదు. ముఖగతములు పదునైదు. ఏడాకుల యరటి, మామిడి - మొగలి, నల్లకలువ, తామర అను నీ పువ్వులయు, చందనము, ఏలకి, అగురు అనువాని పరిమళముతో ఒప్పు మదము శ్రేష్ఠమును, శుభకరమును అగును. పురీషము, మూత్రము, రక్తము, వెల్లుల్లి, చెమ్మట, శుక్రము మొదలైనవాని వాసన కనిష్ఠము. అశుభకరము.

మదావస్థలు : ఇవి సప్తవిధములు. మృగజాతి గజములకు మూడు, మందజాతి వానికి అయిదు, భద్రజాతికి ఏడును మదావస్థలు కలుగును. 1. రోమాంచము గల గండములతో అరమోడ్చిన కనులతో నుండి నిచ్చలు తొండముతో గండములను తాకుచు, మూచుచు నుండు గజము ప్రథమ మదావస్థలో నున్నదని గ్రహింపనగును. 2. శీకరములు వర్షించు కరముతో, గండములందు మాత్రము స్రవించు మదధారలతో వెలయుచు చిఱ్ఱుబుఱ్ఱులాడు చుండునది ద్వితీయావస్థాగతము. 3. గండములు, మేఢ్రము అను నవయవములనుండి మదము స్రవింప పలుమారు ఆవలించుచుండుట తృతీయావస్థకు గుర్తు. 4. సత్వశక్తు లధికములై అన్యకుంజరములను చూచుటచేతనే కోపోద్రిక్తమై మదపరిమళముచే దిక్కులను వాసిల్ల జేయునట్టిది చతుర్థావస్థకు వచ్చినది. 5. మదధార లతిశయింప, రోషము హెచ్చ, గతివేగ మినుమడింప, పదదంతక రాఘాతములు చేయుచు, అంకుశమునకుగూడ లొంగని స్థితిలో నున్నది పంచమావస్థాగతము 6. ధనుష్టంకారనాదము, అన్యగజఘంటాధ్వని, అశ్వఖురఘట్టన శబ్దము వినబడగానే, కోపంపు పెల్లున పరువులు పెట్టునదియు, కరపాదాఘాతములతో నేలను మట్టునదియు, ప్రాకార భంజనము గావించుకొని పోవునదియు, షష్ఠావస్థకు చేరిన గజము. 7. కటాది మదస్థానము లన్నింటి నుండియు గురియు మదధారలచే నేలను తడుపునదియు, శరాది నిశితాయుధాఘాతములను గూడ లెక్క సేయక తిరుగునదియు, ఏ జంతువునకు భయపడనిదియు, ఏ శబ్దమును వినిపించుకొననిదియు, మన్నుమిన్ను కాననిదియు, అతివేగమున దిక్కులకు పారునదియు అయిన గజము సప్తమావస్థ కెక్కినదని గుర్తింపదగును. ఈ మహామదేభము యొక్క మదపరిమళమును దవ్వులనుండి ఆఘ్రాణించి అన్యగజములు భయకంపితములై ఓసరిల్లును.

మదస్రావస్థానము లెనిమిది 'అన్నా రే' భీష్మ పర్వములో వ్యాసభగవానుడు 'కుంజరేణ ప్రభిన్నేన సప్త ధాస్ర వతా మదమ్' అని మదస్థానములను సప్తసంఖ్యాకములనుగా చెప్పెనుగదా! మరి యది యెట్లు? అని సందేహింపనక్కర లేదు. గండద్వయము, నయనద్వయము, మేఢ్రము, ముఖము, తుండమును నాసారంధ్రద్వయమునుబట్టి ద్విస్థానికముగా గ్రహించిన సమన్వయమగును.

మదక్షీణత : అన్యమదేభములు క్రుమ్ముటవలనను, సారహీనమైన ఆహారమువలనను, అతిదూరము నడచుట వలనను, ఉల్కాపాతదావాగ్నితాపముల వలనను, సింహా

230